
ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలున్నాయి. అందులో లైలా మజ్ను, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, రోమియో జులియట్ మనం ఇలాంటి ప్రేమ కథలు ఇప్పటివరకు ఎన్నో చూసుంటాం. ప్రస్తుత జనరేషన్‌లో ప్రేమ అనేది కామన్. నిజమైన ప్రేమకు ఎప్పుడు ఓటమి అనేది ఉండదు. నిజమైన ప్రేమకు ఏదైనా ఆటంకం కలిగితే ప్రేమికులిద్దరు సూసైడ్ చేసుకోవడం చూసి ఉంటాం. ప్రేమ గుర్తుగా ఎన్నో కట్టడాలను చూసి ఉంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా కంట తడి పెట్టించే ఓ ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి ప్రమాదవశాత్తు తన ప్రియుడు చనిపోయినా.. ఆయన ప్రతిబింబాన్ని తన బిడ్డ రూపంలో చూసుకోవాలనుకుంది. చనిపోయిన ప్రేమికుడి కోరికను తీర్చడం కోసం ఏకంగా అతని వీర్యంతో తల్లి కావాలనుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. బ్రిస్‌బేయిన్ జోషువా డేవిస్, ఐలా క్రాస్‌వెల్‌లు ప్రేమికులు. అయితే ఓ రోజు ప్రమాదవశాత్తు రోడ్డుయాక్సిడెంట్‌లో హఠాత్తుగా జోషువా మరణించాడు. మరణించిన గంటలో 24 ఏళ్ల ఐలా బ్రిస్‌బేయిన్ సుప్రీం కోర్టును సంప్రదించింది. తన బాయ్‌ప్రెండ్ వీర్యాన్ని వాడుకొని తాను గర్భం దాల్చేందుకు అనుమతివ్వాలని కోరింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. కృత్రిమ విధానంలో గర్భం దాల్చే విధానం అంతా ఒక ఇన్విట్రో ఫెటిలిటి క్లీనిక్‌లో జరపాలని కోర్టు సూచించింది. అటు ఆమె తల్లిదండ్రులు, ఇటు జోషువా కుటుంబం, వారి స్నేహితులు బంధువులు కూడా ఆమెకు పూర్తి మద్దతు తెలిపారు. జోషువా చనిపోయే ముందు తామిద్దరికి ఒక పాపనో, బాబునో కావాలనే గట్టి కోరిక ఉండేదని ఆధారాలతో సహా కోర్టుకు విన్నవించుకుంది. వారిద్దరు ప్రేమలో ఉన్నపుడు పెళ్లిచేసుకొని కలకాలం జీవించాలని జాషువాకు ఉండేదని, ఎప్పుడు పిల్లల గురించే మాట్లాడేవారని ఐలా కోర్టుకు తెలిపింది. ఓ బిడ్డకు తండ్రి కావాలన్నది ఆయన కోరిక అని, ఆయన చివరి కోరిక తీర్చడమే ఐలా జీవిత లక్ష్యమని కోర్టులో విన్నవించుకుంది.
వీరి ప్రేమ కథపై పలువురి నుంచి మిశ్రమంగా స్పందనలోచ్చాయి. కొంతమంది వీరికి మద్దతు తెలుపుతూ ఆమె కోరుకున్నట్టుగా కోర్టు తీర్పునివ్వాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరికొందరు దీనికి నిరాకరించారు. అయితే ఐలా కోర్టుతో పాటు సమాజాన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. రెండు నెలల కిందట జరిగిన వాదనల తర్వాత నుంచి ఆమె సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. మొత్తానికి ఐలా కోరుకున్నట్టుగానే తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రిలేడనే లోటును తమ ఇరు కుటుంబసభ్యులు తీరుస్తారనే నమ్మకాన్ని కోర్టు వ్యక్తపరిచింది. ఇరుకుటుంబ సభ్యులు ఐలా పట్ల చూపించిన ప్రేమకు, మద్దతుకు కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చనిపోయిన ప్రియుడి వీర్యం ఉపయోగించుకునేందుకు ఆమెకు కోర్టు అనుమతించింది.జాషువా ఈ లోకంలో లేకపోయినా పుట్టబోయే బిడ్డ బాగోగులు ఐలా ఒక్కరే సమర్ధవంతంగా చూసుకోగలదని ఇరు కుంటుబాలవారు విశ్వసించారు.








Comments
Please login to add a commentAdd a comment