హైదరాబాద్, బ్రిస్బేన్ మధ్య సోదర నగర సంబంధం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. క్వీన్స్‌లాండ్ ప్రధాని క్యాంప్‌బెల్ ఇచ్చిన విందులో మాట్లాడిన మోదీ.. ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్బేన్ అవతరించింది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సైబరాబాద్‌గా పేరొందింది. సహజంగానే ఈ రెండింటి మధ్య సోదర నగరాల బంధం ఏర్పడుతుంద’న్నారు. ఆస్ట్రేలియా, భారత్ బంధం మరింత బలపడ్డాలంటే ఇరు దేశాల్లోని రాష్ట్రాలు, నగరాలు ఇంకా దగ్గరకావాలన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో రాష్ట్రాలు, నగరాలూ భాగస్వామ్యమైతే దేశాల సంబంధాలు బలపడతాయన్నారు. తన పర్యటనలో కుదుర్చుకునే ఒప్పందాల్లో భారత్‌లోని రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించడంపై దృష్టి సారిస్తామన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధా ల్లో క్వీన్స్‌లాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, క్వీన్స్‌లాండ్ భారత్‌ను తన వనరులు, పరిశోధనలతో శక్తిమంతం చేయడంలో ముందుందన్నారు.