కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్ : అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి ఇపుడు మందు పాతరలాగా పేలుతోందని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాక్యానించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీల రూ.10వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని క్షత్రియ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు అంశాలు చెప్పారు. ప్రభుత్వం వచిన కొత్తలో 24 గంటలు 7 రోజులు పని చేయాలన్నారు. ఆదివారం కూడా సోమవారం లాగా తీసుకోవాలన్నారు. అన్నీ రూరల్ ఏరియాల పర్యటన చేయాలనీ సూచించారు. వ్యవస్థలో గుమస్తాలు శాశ్వతం. మంత్రులు, కలెక్టర్, న్యాయమూర్తులలో మారిన వాళ్లు మారారు. మోదీ కుటుంబము అంతా సామాన్యులే. ఇప్పటికి 14 ఏళ్లు సీఎం, 4 ఏళ్లు ప్రధానిగా మోది పని చేశారు. మోది గ్లోబల్ లీడర్. కామన్వెల్త్ సమావేశానికి గత 14 ఏళ్లుగా ఇండియా ప్రదాని వెళ్లలేదు. మోదీ వెళ్లారు. ఇండియా ప్రధాని మోది అభిప్రాయం తీసుకోండి అని పారిస్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పార’ ని వెల్లడించారు.
@పాకిస్తాన్ ఎంతో భయపడుతోంది. మోది ఏం చేస్తున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సర్జికల్ స్ట్రైక్‌లో ఒక్క జవాన్ కూడా గాయపడలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు 50 మంది చనిపోయారు. కొరియా వాళ్లు ఇండియాతో మాట్లాడటానికి సిద్దంగా ఉన్నారు. 17 వేల కంపెనీలు రూ.35 వేల కోట్ల టాక్స్‌లు చెల్లించాయి. 2014 వరకు ఇండియాలో రెండు మొబైల్ తయారీ కంపెనీలు ఉండేవి. బీజేపీ హయాంలో 120 మొబైల్ తయారీ కంపెనీలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దేశంలో 45 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇవి కంప్యూటర్‌తో సమానం. దేశ జనాభా ఎంత ఉందో అన్ని మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి. ప్రజలకు 31 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఇచ్చాము. అన్నీ సబ్సిడీలు బ్యాంకు అకౌంట్ ద్వారా సుమారు రూ.90వేల కోట్ల సబ్సిడీ ఇచ్చాం. కేంద్రం 1000 రూపాయలు అకౌంట్‌లో వేస్తే 1000 వినియోగదారునికి అందుతున్నాయి. కాంగ్రెస్‌లో రూపాయి ఇస్తే 15 పైసాలు అందేవ’ ని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment