Ashes 2021-22: England Man Proposes His Australian Girlfriend in Stands During 1st Test Video Viral - Sakshi
Sakshi News home page

Ashes Series: ఓవైపు మ్యాచ్‌.. మరోవైపు ప్రపోజల్‌.. ముద్దుల్లో ముంచెత్తి.. వైరల్‌ వీడియో

Published Fri, Dec 10 2021 1:25 PM | Last Updated on Fri, Dec 10 2021 2:25 PM

Ashes Series: A Fan Proposes To His Girlfriend During 1st Test Video Viral - Sakshi

Ashes Series: A Fan Proposes To His Girlfriend During 1st Test Video Viral: మనసుకు నచ్చిన అమ్మాయి ముందు ప్రేమను వ్యక్తపరిచే అపురూప క్షణాలను కలకాలం పదిలం చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. యాషెస్‌ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న గబ్బాను ఇందుకు వేదిక చేసుకున్నాడు. మోకాళ్లపై కూర్చుని గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసి ఆమె అంగీకారం పొందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా... ఫ్యాన్స్‌ అంతా మ్యాచ్‌ వీక్షిస్తుండగా.. రాబ్‌ అనే వ్యక్తి మాత్రం తన పనిలో తాను తలమునకలైపోయాడు. ప్రేయసి నాట్‌ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. 

ఈ హఠాత్పరిణామానికి తొలుత ఆశ్చర్యపోయిన నాట్‌.. వెంటనే తేరుకుని ఓకే అంది. రాబ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుల్లో ముంచెత్తింది. ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ వారి ప్రేమను ఆశీర్వదించారు. మరికొంత మంది సెల్‌ఫోన్లలో ఈ దృశ్యాలను బంధిస్తూ విషెస్‌ చెప్పారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి! 


 

చదవండి: Ashes Series 2021: ‘శవాన్ని కాల్చేస్తారు.. బూడిదను తీసుకువెళ్తారు’.. బ్లిగ్‌ పెళ్లి.. అసలు బూడిద ఉన్న ట్రోఫీ ఎక్కడ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement