సాక్షి, క్రైమ్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అండర్‌వేర్‌లో బంగారం తరలిస్తుండగా.. ఆ ముఠాను అధికారులు పట్టేసుకున్నారు.
దాదాపు రూ. కోటి 37లక్షలు విలువ చేసే.. 2.279 కిలోలు బంగారం సీజ్ చేశారు అధికారులు. అలాగే.. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.
మొదటి బంగారం కేసు.. 1196 గ్రాముల బంగారం 72 లక్షల బంగారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ సీట్ వద్ద పేస్టు రూపంలో అమర్చి తీసుకొని హైదరాబాద్ వచ్చిన రసల్ కైమా ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు.
రెండో కేసులో 752 గ్రాముల బంగారాన్ని కట్ పీస్ గోల్డ్ బార్ గా పెట్టుకొని కువైట్ వయా దుబాయ్ మీదిగా హైదరాబాద్ వస్తూ పట్టుపడ్డాడు విలువ 45 లక్షలు.
మూడో కేసులో 331 గ్రాముల స్మగ్ల్డ్ గోల్డ్ విలువ 20 లక్షలు ప్రయాణికుడు షార్జా వయా దుబాయ్ నుండి వస్తూ పట్టుబడ్డాడు
మరో కేసులో 1,10,000 సిగరెట్ ప్యాక్స్ ని ముగ్గురు ప్రయాణికులు కంబోడియా బ్యాంకాక్ నుండి వస్తు పట్టుబడిన ముగ్గురు వద్ద విదేశీ సిగరెట్లు.
Comments
Please login to add a commentAdd a comment