
సాక్షి, హైదరాబాద్ : భారత్-పాక్‌ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సందర్భంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారత్-పాక్ రహదారిని కాకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోగా పలు విమానాలకు కూడా రద్దు చేసింది. దేశీయంగా.. హైదరాబాద్ నుంచి అమృత్‌సర్, చండీఘడ్, డెహ్రాడూన్‌లకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.