
సాక్షి, హైదరాబాద్ : ఇండిగో విమానానికి మరోసారి ప్రమాదం పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 15 నిమిషాలపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే సమస్యను పసిగట్టిన ఫైలెట్ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌కు అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండిగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.
గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు సైతం పేలిపోయాయి. అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. వారిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణానికి భరోసా లేదంటూ వాపోతున్నారు.