
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ ఆకతాయి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవి నకిలీ బెదిరింపులని గుర్తించిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేవీ విశ్వరత్నం అనే వ్యక్తి ప్రేమలో విఫలమై.. మద్యం మత్తులో ఈ బెదిరింపులకు తెగబడినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన విశ్వరత్నం సికింద్రాబాద్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment