సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది.
దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు.
సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్‌లు, బోన్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment