
విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: కోల్కత-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అశోక్ చటర్జీ అనే ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని కిందకు దించారు.
కోల్కత నుంచి బెంగళూరు వెళుతున్న ఈ విమానం కిందకు దిగిన వెంటనే అశోక్ చటర్జీని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మరణించారు.
*