
శంషాబాద్: యూట్యూబ్ ద్వారా విద్వేష పూరిత వీడియోలు చేసి విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న పాతబస్తీవాసి అబూఫైజల్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ బార్కాస్‌కు చెందిన అబుఫైసల్‌పై 2020లో సైబర్‌క్రైమ్ పోలీసులు సమోటోగా కేసు నమోదు చేశారు. కొంతకాలంగా దుబాయిలో ఉంటున్న అతడిపై సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన అబూఫైజల్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అతడిని అక్కడి నుంచి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.