కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!
యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది.
ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్‌లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.
యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం
రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్‌లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్‌కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు.
ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం.
#WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N
— Hindustan (@Live_Hindustan) December 30, 2024
Comments
Please login to add a commentAdd a comment