Updates..
- శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమిత్ షా.
అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- ఇది ట్రైలర్ మాత్రమే.. 2024లో ఫుల్ పిక్చర్ కనిపిస్తోంది
- ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు
- ప్రధాని కుర్చీ ఖాళీ లేదు
- తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయింది
- అవినీతి పరులను బీజేపీ జైళ్లకు పంపించడం ఖాయం
- కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉంది
- తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం
- రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు
- ఎంఐఎంకు భయపడేది లేదు
- తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది
- ఎంఐఎం కోసమే విమోచన దినం జరపడం లేదు
- ఉద్యోగాల భర్తీ పేరుతో దోచుకుంటున్నారు
- 9 ఏళ్లుగా టీచర్ల నియామకాలు చేపట్టలేదు
- తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తాం
- బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు
- కేసీఆర్‌ను గద్దె దింపేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది
- బండి సంజయ్ ఏం తప్పు చేశారు
- పేపర్ లీకేజీపై బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
- అందుకే సంజయ్‌ను కేసీఆర్ సర్కార్ జైల్లో వేసింది
- బండి సంజయ్ అరెస్ట్‌ను మీరు సమర్థిస్తారా?
- పేపర్ లీకేజ్‌తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది
- పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
- బండి సంజయ్ మాట్లాడుతూ.. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నన్ను ఎనిమిది గంటల పాటు రోడ్లపై తిప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే బీజేపీ ధృడ సంకల్పం. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తాం. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా చేవెళ్ల వచ్చారు.
- చేవెళ్ల చేరుకున్న అమిత్ షా
- చివరి నిమిషంలో అమిత్ షా టూర్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవాటెల్‌కు అమిత్ షా వెళ్లారు.
- ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితలపై చర్చించారు.
- అమిత్ షా.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై మరింత దూకుడు పెంచాలి. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అధికారమే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలి. బీఆర్‌ఎస్ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి.
- శంషాబాద్ నుంచి చేవెళ్ల సభకు బయలుదేరిన అమిత్ షా.
- అమిత్ షాకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు.
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్ చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు.. వాహనాలను లోపలికి అనుమతిస్తున్నారు. లిస్టులో పేరు ఉన్న వాళ్లని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
- ఏటీసీ సెంటర్ నుంచి అమిత్ షా నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్నారు.
- అమిత్ షా సుమారు రెండు గంటల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.
- సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.
- రాత్రి 7 గంటలకు అమిత్ షా తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుంచి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment