సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్‌ ఆసక్తి | GMR plans to bid for airport projects in Serbia, Jamaica | Sakshi
Sakshi News home page

సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్‌ ఆసక్తి

Published Wed, Jun 21 2017 12:45 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్‌ ఆసక్తి

సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్‌ ఆసక్తి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్‌ గ్రూప్‌ విదేశీ గడ్డపై మరో రెండు విమానాశ్రయ ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయనుంది. వీటిలో సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌ సమీపంలోని నికోలా టెస్లాతోపాటు, జమైకాలోని కింగ్‌స్టన్‌ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి విస్తరణ, ఆధునీకరణ పనులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కపూర్‌ తెలిపారు.

బిడ్ల దాఖలు చేయడానికి కావాల్సిన అర్హతలను కంపెనీ సాధించింది. గతేడాది నికోలా టెస్లా విమానాశ్రయం నుంచి 49 లక్షలకుపైచిలుకు, కింగ్‌స్టన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. విశాఖపట్నంలోని కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుకు సైతం బిడ్‌ దాఖలు చేయనున్నట్టు సిద్ధార్థ్‌ వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement