హైదరాబాద్: జీఎంఆర్ గ్రూపు కంపెనీ అయిన జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ 20.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.130 కోట్లు) చెల్లించాలంటూ మాల్దీవుల ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్టును ముందస్తుగా రద్దు చేసుకున్నందున 271 మిలియన్ డాలర్ల పరిహారాన్ని జీఎంఆర్ గ్రూప్ కంపెనీ అయిన జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆర్బిట్రేషన్ మార్గంలో గెలుచుకుంది. దీంతో వ్యాపార లాభంపై పన్ను 14.4 మిలియన్ డాలర్లు, మరో 2.8 మిలియన్ డాలర్ల మేర విత్‌హోల్డింగ్ పన్ను, 3.3 మిలియన్ డాలర్ల మేర జరిమానాలు కలసి మొత్తంగా 20.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని మాల్దీవుల ఇన్‌ల్యాండ్ రెవెన్యూ విభాగం నోటీసుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment