ఆ డ్రింక్స్ రేట్లు పెరుగుతున్నాయ్!
ఆ డ్రింక్స్ రేట్లు పెరుగుతున్నాయ్!
Published Wed, Jun 28 2017 1:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుండటంతో, ప్రముఖ శీతల పానియాల సంస్థ కోకా కోలా తన కార్బోనేటేడ్ పానీయాల పోర్ట్ ఫోలియోలో ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ కిన్లే రేట్లను తగ్గించనున్నట్టు పేర్కొంది. అయితే జ్యూస్ లు, జ్యూస్ ల ఆధారిత డ్రిక్ ల పోర్టు ఫోలియోలో ధరలు పెంచబోమని కంపెనీ స్పష్టంచేసింది. కొత్త పన్ను విధానం ప్రకారం ప్రస్తుతమున్న రేట్ల కంటే అత్యధిక మొత్తంలో శీతలపానీయాలపై పన్ను శ్లాబులను ప్రతిపాదించారు. శీతల పానీయాలపై పన్ను శ్లాబులు 40 శాతంగా ఉన్నాయి. దీంతో ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని, తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా ధరలు పెంచాల్సి వస్తుందని కోకా కోలా ఓ ప్రకటనలో పేర్కొంది.
జీఎస్టీ విధానంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పన్ను రేట్లు తక్కువ ఉన్నందున వాటి ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తామని కంపెనీ చెప్పింది. ఈ మేరకు తన భాగస్వాములకు కిన్లే ధరలను తగ్గించాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను 18శాతం జీఎస్టీ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ అమలైనప్పటి నుంచి భారత వృద్ధి పెరుగుతుందని అంచనావేస్తున్నామని, పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని కోకా కోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా బిజినెస్ యూనిట్ టీ.క్రిష్ణకుమార్ చెప్పారు. తమ బెవరేజ్ పోర్టుఫోలియోలో కొన్ని కేటగిరీలో పన్ను ప్రభావం పడుతుందన్నారు.
Advertisement
Advertisement