శాన్ ఫ్రాన్సిస్కో : గ్లోబల్ అడ్వర్టైజింగ్‌లో ప్రధాన శక్తిగా అవతరించిన కోకాకోలా కంపెనీ సోషల్ మీడియాలో 30 రోజుల వరకు ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోందంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోకాకోలా ప్రకటనల్లో హింసకు తావివ్వకుండా పూర్తి పారదర్శకతతో ప్రజలకు జావాబుదారీతనంతో ఉండే దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రకటన విధానాల్లో ఏదైనా మార్పు అవసరమా అన్న అంశాలపై అంచనావేయడానికి తాత్కాలికంగా ప్రకటనల్ని నిలిపివేస్తున్నాం అని కంపెనీ కంపెనీ చైర్మన్, సీఈవో క్విన్సీ క్లుప్త అన్నారు.
ప్రపంచంలోనే జాత్యంహకారానికి చోటు ఉండకూడదని పేర్కొన్నారు. ద్వేషం, జాత్యహంకారం లేదా హింసను ప్రేరేపించే ప్రకటనల్ని నిలిపివేయాలని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (ఎన్‌ఐఏసిపి) సంస్థ ఇప్పటికే పలు కంపెనీలను కోరింది. మెరుగైన సామాజం కోసం మనమందరం పాటుపాడాలని ఫేస్‌బుక్ వేదికగా కోరింది. అమెరికాలో నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా లిప్టన్ టీ, బెన్ అండ్ జెర్రీ సహా పలు కంపెనీలు 2020 చివరి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి.
ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు సైతం జత్యాంహకారానికి వ్యతిరేకంగా తమ వంతు కృషి చేస్తున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్. కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ షాదీ.కామ్ కలర్ ఫిల్టర్‌ను తొలిగించే దిశగా నిర్ణయం తీసుకుంది. రంగును బట్టి భాగస్వామిని ఎంచుకునే కలర్ ఫిల్టర్‌ను తొలిగించాలంటూ పిటిషన్ దాఖలైన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్‌గా సంతకాలు చేశారు. దీంతో వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్ కలర్ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ షాదీ డాట్ కామ్ (‘వైట్, ఫెయిర్, లైట్ పదాలు తొలగిస్తున్నాం’ )
మెన్నటికి మెన్న తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్ లీవర్ సంస్థ కూడా తమ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే మాటను తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫెయిర్, వైట్, లైట్ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన క్రమంగా పలు దిగ్గజ కంపెనీ ప్రకటనల్లో పలుమార్పులు రాబోతున్నాయన్నమాట. (ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్ నుంచి జేజే ఔట్! )
Comments
Please login to add a commentAdd a comment