
పెట్రోల్, వంటనూనె, పప్పులు, సబ్బులు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు బేరేజెస్ వంతు వచ్చింది. సాఫ్ట్‌డ్రింకుల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది కోకకోలా. కరోనా ప్రభావం ఆ తర్వాత వచ్చిన ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన ద్రవ్యోల్బణం మరికొద్ది కాలం కొనసాగే అవకాశం ఉండటంతో ధరల పెంపు తప్పదనే నిర్ణయానికి వచ్చినట్టు కోకకోలా ఇండియా , సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ సంకేత్‌రాయ్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ధరల పెంపుపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కోకకోల పరిధిలో అనేక సాఫ్ట్ డ్రింకులు వివిధ పరిణామాల్లో లభిస్తున్నాయి. దీంతో ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై పడకుండా ధరల పెంపు ఎలా చేపట్టాలి, ఏ విభాగంలో ధరలు పెంచాలనే అంశంపై కోకకోలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ధరల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.