
బ్రహ్మం (ఫైల్)
సాక్షి, నస్రుల్లాబాద్ (బాన్సువాడ): ప్రేమించిన అమ్మాయి దక్కదన్న ఆవేదనతో మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బ్రహ్మం (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి ప్రేమించిన యువతి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు రక్షించారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకోక పోవడంతో బ్రహ్మం గతంలోను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇందులో భాగంగానే శనివారం తన స్నేహితులకు ఫోన్ చేసి ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావంటూ స్నేహితులు తెలుసుకొని అక్కడకు వెళ్లేలోపు మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బ్రహ్మం వేలాడుతూ కన్పించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment