nasrullabad
-
ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని..
సాక్షి, నస్రుల్లాబాద్ (బాన్సువాడ): ప్రేమించిన అమ్మాయి దక్కదన్న ఆవేదనతో మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బ్రహ్మం (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి ప్రేమించిన యువతి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు రక్షించారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకోక పోవడంతో బ్రహ్మం గతంలోను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందులో భాగంగానే శనివారం తన స్నేహితులకు ఫోన్ చేసి ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావంటూ స్నేహితులు తెలుసుకొని అక్కడకు వెళ్లేలోపు మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బ్రహ్మం వేలాడుతూ కన్పించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి..) -
‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య
నసురుల్లాబాద్ (బాన్సువాడ): తమను చూసేవారెవరూ లేరనే మనోవేదనతో వృద్ధ దంపతులు మనోవేదనకు గురయ్యారు. దీంతో ఉన్న ఇల్లు విక్రయించి వచ్చిన డబ్బులతో పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఆ తిరుగుతున్న సమయంలోనే వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో చివరకు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌లో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి గ్రామానికి చెందిన గంగాధర్ గిరి (70), మహానంద (65) భార్యాభర్తలు. వీరికి సంతానం లేకపోవడంతో వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. దీంతో వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమ గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో మూడు నెలలుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా నసురుల్లాబాద్‌లోని కొచ్చరి మైశమ్మ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. అయితే తీర్థయాత్రలు చేస్తున్న క్రమంలో చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో గురువారం భార్యాభర్తలు నిజాంసాగర్ ప్రధాన కాలువ వెంట ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన అక్కడి స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే భర్త మృతిచెందగా, భార్య బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ నలుగురు లేక ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజకీయమంటే వ్యాపారం కాదు
సాక్షి, నస్రుల్లాబాద్: రాజకీయమంటే వ్యాపారం కాదని, రాజకీయ నాయకులు ప్రజా సేవే పరమార్థంగా పని చేయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ప్రతి నాయకుడు ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని, స్వప్రయోజనాల కోసం ఆలోచించుకోవడం మానుకోవాలన్నారు. మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామంలో నిర్మించిన 31 డబుల్ బెడ్రూం ఇళ్లను సభాపతి పోచారం సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్య పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. కొంత మంది రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటున్నారని, అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రతి వ్యక్తికి తోడు, నీడ ఉండాలని.. తోడు మీరు(ప్రజలు) చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నీడను అందించాలన్న ఉద్దేశ్యంతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు గతంలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలు ఇచ్చి పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఇప్పటికి 5 వేల ఇళ్లను కేటాయించామని, వీటిలో 2500 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని లబ్ధిదారులను ఎంపిక చేసి అందివ్వడమే మిగిలిందని చెప్పారు. జెడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ, జెడ్పీటీసీ జన్నుబాయి, ఎంపీపీ విఠల్, జిల్లా కో–ఆప్షన్ మెంబర్ మాజీద్ ఖాన్, తహసీల్దార్ అర్చన, డీఎఫ్‌వో వసంత, వైస్ ఎంపిపి ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటిసి మేని బాయి, మాజి ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, రాము, అయ్యన్న,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి శివారులోని సోమలింగేశ్వరాలయం దినదినాభివృద్ధి చెందుతూ దక్షిణ కాశీగా విరాజిల్లుతోందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో స్పీకర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కల్యాణ మండపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లంలో గల బసవేశ్వర మందిరం, వర్ని మండలంలోని బడాపహాడ్‌తో పాటు సోమలింగేశ్వరాలయంలో చేపట్టిన కల్యాణ మండపాల నిర్మాణాలు నిధులు లేక నిలిచి పోయాయని చెప్పారు. ఆ పనులు పూర్తి చేయాలని సంకల్పంతో రూ.27లక్షలు కేటాయించి నేడు పూర్తి చేశామన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.1.10 కోట్లను కేటాయించామని చెప్పారు. పురావస్తు శాఖ అధ్వర్యంలో రూ.50 లక్షల నిధులతో ఆలయ ప్రాకారం పూర్తిగా సీసీ చేయించేలా నివేదికలను తయారు చేశామన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆలయ కమిటీ చైర్మన్ పోచారం సురేందర్‌రెడ్డికి సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదర్ శోభ, కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ కో–ఆప్షన్ మెంబర్ మాజీద్‌ఖాన్, ఎంపీపీలు విఠల్, నీరజ, సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, నేతలు దివిటి శ్రీనివాస్, పెర్క శ్రీనివాస్, కిషోర్‌యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్) : భర్త చేతిలో భార్య మరణించిన సంఘటన నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన బసగుట్ట జ్యోతి(25) అనే యువతికి 5 ఏళ్ల క్రితం కడేం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్ని రోజులుగా భార్యపై అనుమానంతో తరచూ జ్యోతిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. దీంతో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్యాభర్తలు నస్రుల్లాబాద్‌లోనే తన తల్లివారి గృహంలోనే ఉంటున్నారు. జ్యోతికి తల్లిదండ్రులు మరణించడంతో తనకు ఉన్న ఇద్దరు చెల్లెల్లను చూసుకుంటూ ఉండేవారు. అయితే గత నెల 29న మధ్యాహ్నం భర్త రాజు జ్యోతిని విచక్షణారహితంగా కొట్టి, గొంతు నులుముతుండగా బయట నుంచి వచ్చిన జ్యోతి చెల్లి స్వాతి చూసి అందరిని పిలిచింది. దీంతో రాజు పారిపోయాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న జ్యోతిని స్థానిక బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసిన అనంతరం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9.30గంటలకు చనిపోయింది. జ్యోతి చెల్లి స్వాతి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని శవ పంచనామ నిర్వహించి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని బాలుని ఆత్మహత్య
కామారెడ్డి: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హాజీపూర్‌కు చెందిన మధు(16) అనే బాలుడు సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. అయితే వారు కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన మధు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.