
సాక్షి, ఒంగోలు: ‘‘ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడు.. నన్ను పిలుస్తున్నాడు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’’ అంటూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దారవీడు మండలం మద్దలకట్ట పంచాయతీ చాట్లమడ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఏర్వ వెంకట పూర్ణశేఖరరెడ్డి (24) చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘తన చావుకు ఎవరూ కారణం కాదని.. ప్రేమ వంటి వ్యవహారం లేదని.. పిరికివాడిని కాదని.. ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడని.. తనను పిలుస్తున్నందునే ఆత్మహత్య చేసుకున్నట్లు’ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఆస్తులన్నీ చెల్లి సాయిలక్ష్మి పేరుమీద రాయాలని చెప్పాడు. పూర్ణ శేఖరరెడ్డికి శివుడు అంటే ఎనలేని భక్తి భావం ఉంది. తండ్రి మృతి చెందగా.. తల్లి, చెల్లి ఉన్నారు.
చదవండి: (రవికుమార్‌తో వివాహేతర సంబంధం.. తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం)
Comments
Please login to add a commentAdd a comment