prakasam distrcit
-
ప్రభుత్వ ధరకు కొనాల్సిందే.. నష్ట పరిచే చర్యలు వద్దు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సీజన్లో పండించిన రొయ్యలను రైతుల వద్ద నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతుల సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ ఆక్వా రైతుల సదస్సుకు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు, ట్రేడర్లను కూడా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్ దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ రొయ్యల రైతులను నష్టపరిచే పనులు ఏ ఒక్కరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘సాధికార కమిటీలో 100 కౌంటు రొయ్యలకు కిలో రూ.240 నిర్ణయించాం. కానీ 100 కౌంటును రూ.225కు కొనుగోలు చేస్తున్నారు. ధర లేదంటే ప్రభుత్వం ఒక మెట్టు దిగి 100 కౌంటును రూ.210 తగ్గించి నిర్ణయం తీసుకుంది. అయినా ఆ ధరకు కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మీకు గిట్టుబాటు కాకపోతే చెప్పండి... 10 ఎకరాలు సాగుచేసే రైతును 5 ఎకరాలు సాగుచేయమంటారా’’ అని నిలదీశారు. అలా చెబితే రైతులు మానసికంగా నిర్ణయించుకుంటారని సలహా కూడా ఇచ్చారు. రైతు వద్ద ఒక కౌంటు రొయ్యలు ఉంటే లేని కౌంటు రొయ్యలను రైతులను అడుగుతున్నారని వారు చెబుతున్నారని..ఇదే విధంగా కొనసాగితే ప్రాసెసింగ్ ప్లాంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యుత్ సమస్యతో పాటు రొయ్యల రైతులకు ఉన్న అన్ని సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారని, 15 రోజుల్లో సీఎం రొయ్యల రైతులకు శుభవార్త చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్ దుగ్గినేని గోపీనా«థ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన వారిలో జిల్లా ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు మున్నంగి రాజశేఖర్, రైతులు టంగుటూరుకు చెందిన దివి హరిబాబు, కొత్తపట్నంకు చెందిన శ్రీనివాస రావు, నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర నాయుడు, గూడూరుకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి, నరేంద్ర, నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకురెడ్డితో పాటు జిల్లా మత్స్యశాఖ జేడీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మన దేశం నుంచి ఈ సంవత్సరం 8.50 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నాం. ఈక్విడార్ దేశంలో 8.85 లక్షల టన్నులు ఎగుమతి చేస్తోంది. వాళ్లకు ఇచ్చే ధర ఇక్కడ ఎందుకు ఇవ్వరు. పలు దేశాల్లో 100 కౌంటుకు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు సాధ్యం కావటం లేదో చెప్పండి. ప్రభుత్వం చొరవ తీసుకొని అందరినీ ఒకచోటకు చేర్చి సదస్సులు నిర్వహిస్తోంది. ఆక్వా రైతు అప్పుల పాలు కాకుండా చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మోహన రాజు, రొయ్య రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఈ సీజన్లో రైతులను ఆదుకోండి ఈ సీజన్లో సిద్ధంగా ఉన్న రొయ్యలను కొనుగోలు చేసి ఆదుకోండి. ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలబడింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాల వారీగా ఆక్వా రైతులతో పాటు రొయ్యలను కొనుగోలు చేస్తున్న సంస్థల యజమానులను కూడా సదస్సులకు పిలిపిస్తోంది. ఇది మంచి పరిణామం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా అందరితో కలిపి సంయుక్తంగా సదస్సులు నిర్వహించలేదు. – దుగ్గినేని గోపీనా«థ్, ప్రకాశం జిల్లా ఆక్వా రైతు సంఘం కన్వీనర్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రొయ్యలను కొనుగోలు చేస్తాం. నేను కూడా 1500 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. సాగులో నేను కూడా నష్టపోతున్నాను. అయితే ఈ సంక్షోభం తాత్కాలికమే. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆక్వా రంగంలో ఎదురవుతున్న సంక్షోభంపై చొరవ చూపుతోంది.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చొరవ చూపలేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా ఉండాలని నిర్ణయించి జిల్లాల వారీగా రైతులు, ఎక్స్‌పోర్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయటం మంచి పరిణామం. రైతులు కూడా ఖర్చులు తగ్గించుకోవాలి. – బీద మస్తాన్ రావు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఈ రెండు జిల్లాల్లో 50 టన్నులు కొంటాం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే రొయ్యలను తాము ఇక నుంచి 50 టన్నులు కొనుగోలు చేస్తాం. సింగరాయకొండ, నెల్లూరు జిల్లాల్లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఈ రెండు జిల్లాల నుంచే కొనుగోలు చేస్తాం. బయట జిల్లాల నుంచి ఇక్కడకు తెప్పించేది లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తాం... చేస్తున్నాం. రైతులు చిన్నసైజు రొయ్యల ఉత్పత్తినే లక్ష్యంగా పెట్టుకోవద్దు. మిగతా సంస్థల చేత కూడా కొనుగోలు చేయిస్తాం. – బ్రహ్మానందం, ఏపీ ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు, దేవీ సీఫుడ్స్ చైర్మన్ -
సురక్షిత మాతృత్వం.. ఖర్చు లేని కాన్పు
మాతృత్వం అనేది ఓ వరం. ప్రసవ ఘట్టం మహిళకు పునర్జన్మ వంటింది. దీనిని కొందరు స్వార్థపరులు తమ సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సురక్షిత మాతృత్వాన్ని ఉచితంగా ప్రసాదించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకు అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచింది. ప్రధానంగా ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలపై ప్రధాన దృష్టి సారించింది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని వైద్యశాలలు, ఏరియా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించడంతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి నమ్మకం ఏర్పడింది. గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డాక్టర్లు లేక మందుల కొరతతో ప్రజలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించారు. తాజాగా పరిస్థితి మారింది. నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం ఏర్పడింది. జిల్లాలో మొత్తం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 12 వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో మార్కాపురంలో జిల్లా వైద్యశాల, ఒంగోలులో మాతాశిశు వైద్యశాల ఉన్నాయి. కనిగిరి, దర్శి, పొదిలి, చీమకుర్తి, పామూరు, దోర్నాల, కంభం, కొండపి ఉండగా గిద్దలూరు, యర్రగొండపాలెంలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 9 కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఇవన్నీ వైద్య విధాన పరిషత్ కో ఆర్డినేటర్ పరిధిలో ఉండగా, డీఎంహెచ్ఓ పరిధిలో 64 పీహెచ్‌సీలు ఉన్నాయి. జిల్లాలో బేస్తవారిపేటలో అత్యధికంగా నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో కాన్పులు చేస్తున్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు రావడంతో ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్యశాలలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు సర్జన్లతో పాటు అనస్థీషియన్ (మత్తు డాక్టరు), నిపుణులైన నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. నెలకు సుమారు 180 నుంచి 200 మ«ధ్య కాన్పులు జరుగుతున్నాయి. ఆధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం, బ్లడ్ బ్యాంక్, ఐసీయూ బెడ్లు, అందుబాటులో ఉండడంతో సమీప మండలాల్లోని గ్రామాల గర్భిణులు కాన్పుల నిమిత్తం జిల్లా వైద్యశాలలకు వస్తున్నారు. మొత్తంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 2,500 వరకు ప్రసవాలు జరిగాయి. ప్రోత్సాహకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్నిస్తోంది. పీహెచ్‌సీల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద రూ.4 వేలు, జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి ఇస్తోంది. మొత్తంగా రూ.ఐదు వేలు ఇస్తుండగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే రూ.4600 ఇస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తోంది. సురక్షితంగా ఇంటికి... ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ప్రసవం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతాశిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. మంచి వైద్య సేవలు అందాయి కాన్పు కోసం జిల్లా వైద్యశాలకు వచ్చాను. డాక్టర్లు, నర్స్‌లు మంచి వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు చేశారు. పాప పుట్టింది. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. మంచి మందులు ఇచ్చారు. డాక్టర్లకు ధన్యవాదాలు. – నాగలక్ష్మి, రాగసముద్రం, తర్లుపాడు మండలం మంచి సేవలందిస్తున్నాం జిల్లా వైద్యశాలలో గైనకాలజిస్టులు, సర్జన్లు, మంచి సేవా భావం కలిగిన వైద్య సిబ్బంది ఉన్నారు. నార్మల్ డెలివరీలు చేస్తారు. తక్షణ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. హైరిస్క్ పేషెంట్లకు కూడా మా డాక్టర్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రోగులకు భరోసా ఇస్తాం. మందుల కొరత లేదు. – డాక్టర్ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం -
నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం
సాక్షి, ఒంగోలు: ‘‘ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడు.. నన్ను పిలుస్తున్నాడు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’’ అంటూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దారవీడు మండలం మద్దలకట్ట పంచాయతీ చాట్లమడ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఏర్వ వెంకట పూర్ణశేఖరరెడ్డి (24) చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని.. ప్రేమ వంటి వ్యవహారం లేదని.. పిరికివాడిని కాదని.. ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడని.. తనను పిలుస్తున్నందునే ఆత్మహత్య చేసుకున్నట్లు’ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆస్తులన్నీ చెల్లి సాయిలక్ష్మి పేరుమీద రాయాలని చెప్పాడు. పూర్ణ శేఖరరెడ్డికి శివుడు అంటే ఎనలేని భక్తి భావం ఉంది. తండ్రి మృతి చెందగా.. తల్లి, చెల్లి ఉన్నారు. చదవండి: (రవికుమార్‌తో వివాహేతర సంబంధం.. తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం) -
ఒంగోలులో యువతుల సహజీవనం.. ఆ వీడియోలు చూసి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి స్పందిస్తూ ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్‌లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అపోహపడుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది. ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో.., తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో మదురై, విరుదునగర్ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెట్రోల్ పోసి ఒంటికి నిప్పు, ప్రేమ వ్యవహారమే కారణమా?
మద్దిపాడు(ప్రకాశం జిల్లా): ఓ యువకుడిపై కొందరు దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించారు. మద్దిపాడు మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన యరజాని అంకమ్మరావు(20) అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల వరకు కాలనీ సమీపంలో స్నేహితులతో గడిపి ఇంటికి వెళ్లాడు. అతడి వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి మేస్త్రీ పిలుస్తున్నాడంటూ కాలనీ బయటకు తీసుకువెళ్లారు. కాలనీ సమీపంలోని చప్టా వద్ద అతనితో మద్యం తాపించి, ఆ తర్వాత ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అక్కడ నుంచి అంకమ్మరావు కేకలు వేస్తూ చర్చి సమీపంలో పడిపోగా అతని సోదరుడు వచ్చి తన టీషర్ట్ విప్పి మంటలు ఆర్పివేశాడు. స్థానికులు స్పందించి 108లో రాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రిమ్స్‌కు చేర్చారు. తనపై వెల్లంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించాడని, అతనితోపాటు మరో ఇద్దరు ఉన్నారని బాధిత యువకుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, మద్దిపాడు ఎస్సై నాగరాజు తెలిపారు. బాలికతో ప్రేమ వ్యవహారమే కారణం? ఓ బాలికతో కలిసి ఉన్న ఫొటోలను అంకమ్మరావు తన స్నేహితులకు ఆదివారం రాత్రి వాట్సప్‌లో పంపినట్లు సమాచారం. ఆ బాలిక తనకు దక్కదనే ఆలోచనతో అంకమ్మరావు ఈ పని చేసి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కాగా అంకమ్మరావు శరీరం 70 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. చదవండి: యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్ రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
‘నాన్నా.. నా మనసేమీ బాలేదు’
‘నాన్నా.. నా మనసేమీ బాలేదు. ఈ రోజు ఒంగోలులోనే ఉంటా’ తండ్రితో మద్ది వెంకటసాయి చివరి మాటలివి. తెల్లారేసరికి ఆ మాటలు మృతదేహం రూపంలో కనిపించాయి. ప్రేమను జయించిన ఆ జంటకు పరిస్థితులే యమపాశాల్లా మారాయా? పిల్లల క్షణికావేశం.. పెద్దల మంకుతనమే ప్రేమజంటను జీవశ్చవంలా మార్చాయా? రైలు పట్టాలపై ఛిద్రమైన ప్రేమకథలోని ఓ కొత్త కోణం ఇది. చీమకుర్తి: ప్రేమజంట ఆత్మహత్య ప్రతి ఒక్కరిలో ఆవేదనే మిగిల్చింది. కకావికలంగా మారిన ఆ రైలు పట్టాలే ఈ కన్నీటి కథకు సాక్ష్యం. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వెంకటసాయి, నాగతేజ ఒంగోలు సమీపంలోని పెళ్లూరు–రైజ్ కాలేజ్ మధ్యనున్న రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి తన కుమారుడు తనతో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుని మద్ది నారాయణ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ‘‘ఇంట్లో నుంచి సాయంత్రం ఆరు గంటలకు బయటకు వెళ్తున్నా నాన్నా అన్నాడు. రోజుటిలాగే అనుకున్నా.. మళ్లీ రాత్రి 9:30 గంటలకు ఫోన్లో మాట్లాడుతూ నేను ఒంగోలులో ఉన్నా నాన్నా.. నా మనసేమీ బాగోలేదు’’ అని చెప్పినప్పుడైనా ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరగకుండా ఉండేదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటసాయి చెన్నై ఎందుకు వెళ్లాడు? ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటలో వెంకటసాయి తండ్రి నారాయణ చెప్పిన మాటల ప్రకారం.. ఆత్మహత్యకు ఆరు రోజుల ముందు వెంకటసాయి తనకు ఉద్యోగం వచ్చిందని, సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి రూ. 10 వేలు కావాలని తండ్రిని అడిగాడు. అందులో రూ. 5 వేలతో ఫోన్ కొనుక్కొని మిగిలిన డబ్బులతో చెన్నై వెళ్లాడు. వెంకటసాయి ఒంటరిగా కాకుండా తాను ప్రేమించిన అమ్మాయి నాగతేజను కూడా చెన్నై తీసుకెళ్లినట్లు తెలిసింది. కొరియర్ సరీ్వస్‌లో పనిచేసేందుకు వెళ్లిన వెంకటసాయికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. నాగతేజను చూసిన కొరియర్ సరీ్వస్ యాజమాన్యం ఇంత చిన్న వయస్సులో ఇలా అమ్మాయిని తీసుకొస్తే కేసులు అవుతాయి.. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి రా అన్నారని తమకు తెలిసిందని నారాయణ చెప్పారు. దీంతో వెంకటసాయి ఏం చేసేది లేక ఆ తర్వాత రోజే ఒంగోలు తిరిగొచ్చేశాడు. చెన్నై నుంచి వచ్చిన తర్వాత వెంకటసాయి తనలో తను కుమిలిపోయి చివరకు ఏం చేయలేక తాను ప్రేమించిన అమ్మాయితో ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్నెల్ల కిందటే ఇంట్లో నుంచి బయటకొచ్చిన నాగతేజ నాగతేజ ఆరు నెలల కిందటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులోని హాస్టల్లో ఉంటుందని తండ్రి రవీంద్ర తెలిపారు. ఏడాదిన్నర కిందట నాగతేజ ఇంట్లో వారిని ఎదిరించి నేను వెంకటసాయినే పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పుడు పెద్దలు పోలీసులతో మాట్లాడి సర్దిచెప్పటంతో కొన్నాళ్ల పాటు వారిద్దరి మధ్య ప్రేమకు విరామం ఏర్పడింది. ఇంతలో ఏమైందో ఏమో మరి నాగతేజ ఇంట్లో నుంచి బయటకు రావడంతోనే వారి మధ్య ప్రేమ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. దీంతో రవీంద్ర చేసేది లేక ఒంగోలులోని హాస్టల్లో ఉంటుందిలేననుకున్నాడు. వెంకటసాయితో చెన్నై వెళ్లడం, వారిద్దరు ఆత్మహత్య చేసుకునే వరకు తనకు తెలియదని రవీంద్ర చెప్పాడు. ఇద్దరికి తల్లిదండ్రుల నుంచి సరైన ఆమోదం లభించకపోవడం, బయట కలిసి జీవించడంలో ఆర్థిక ఇబ్బందులు తోడవడం, ఇంట్లో నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో బతుకు చాలా భారంగా ఉందని లేత మనస్సులు జీవితాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమై ఆత్మహత్యవైపు పురికొల్పిందని ప్రేమజంట బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కులాలు కలవని ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో చీమకుర్తి, తొర్రగుడిపాడు గ్రామంలో బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రాణం పోయినట్లయింది.. : యువకుడి తండ్రి నారాయణ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి 9:30 గంటలకు తండ్రితో ఫోన్లో మాట్లాడిన వెంకటసాయి తాను స్నేహితుడి రూమ్‌లో ఉన్నానని చెప్పాడు. తీరా తెల్లారేసరికి రైల్వే పోలీసులు ఫోన్ తీసి తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడనడంతో ప్రాణం పోయినట్లయిందని నారాయణ వాపోయాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నా కొడుకును కష్టపడి కూరగాయలు అమ్మి చదివించానని, ప్రేమలో పడి తెలిసీ తెలియని వయస్సులో ఆత్మహత్యకు పూనుకున్నాడని బోరున విలపించాడు. ఏదోక ఉద్యోగంలో సెటిలైతే కులం గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసే వాడినంటూ ఆవేదన చెందారు. పూర్తి వివరాలు తనదాకా తీసుకురాకుండానే వాడి మనస్సులోనే కుమిలిపోయి ఆత్మహత్య వైపు అడుగులు వేశాడు. జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా మమ్మలను అఘాతంలోకి నెట్టాడని నారాయణ వాపోయాడు. నారాయణ కుటుంబ సభ్యుల రోదనలు, ఆవేదనలు చూసి తొర్రగుడిపాడు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. చదవండి: బండారం బట్టబయలు: బుల్లెట్‌పై దొరల్లా వచ్చి... హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం -
టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు
పర్చూరు: అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘పచ్చ’ రంగులు వేసుకొని తరించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోను వారి ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా 26 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ కార్యాలయానికి గురువారం పచ్చ రంగు వేసేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శుక్రవారం పచ్చ రంగును తొలగించి తెలుపు రంగు వేయించారు. ఏడుగుండ్లపాడులో.. ఒంగోలు: సచివాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు నానా యాగీ చేసి కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలుపొందడం, శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందంటూ టీడీపీ నేతలు గ్రామ సచివాలయం బోర్డుకు పసుపు రంగులు వేశారు. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై లారీని ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బల్లికురవ మండలం అలనడక వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జర్మనీ గడ్డపై గుజ్జుల రవీంద్రారెడ్డి
ఎర్రెర్రని భావాలతో ఎరుపెక్కిన కళ్లతో తెలుగు నాట రక్తపు చుక్కలు చిందించి జర్మనీలో ఎర్ర కపోతాన్ని ఎగరేశాడు ఓ తెలుగు తేజం. పదిహేనేళ్ల వయస్సులో పోరాటాల భూమిలో అడుగెట్టి జైలు జీవితం గడిపిన చరిత్ర ఆయనది. ఆ అడుగులు దేశాన్ని దాటి విదేశాల్లో ఓ ప్రభంజనం సృష్టించాయి. ‘పనిచేసే వాడే పాలకుడు’ అన్న నినాదంతో పాతకేళ్లుగా జర్మనీలో తిరుగులేని కమ్యూనిస్టు లీడర్‌గా కొనసాగుతున్న మన కనిగిరి నిప్పు కణిక గుజ్జుల రవీంద్రారెడ్డిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ప్రజలు ఓ నాయకుడిని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్నారంటే.. దానికి కారణం కేవలం ఆ నాయకుడు ప్రజలకు చేస్తున్న సుపరిపాలనే. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజలకు చేసిన మంచి పనులే మళ్లీ మళ్లీ నన్ను ఎన్నుకునేలా చేశాయని నేను అర్థం చేసుకున్నాను. – గుజ్జల రవీంద్రారెడ్డి సాక్షి, పీసీపల్లి: పోరాట ప్రతిమతో ప్రపంచాన్ని ఈదొచ్చని నిరూపించాడు మన కనిగిరి విప్లవ కెరటం గుజ్జుల రవీంద్రారెడ్డి. తెలంగాణలోని భద్రాచలంలో పుట్టిన గుజ్జల రవీంద్రారెడ్డి స్వస్థలం పీసీపల్లి మండలంలోని ఓ మారుమూల గ్రామమైన నేరేడుపల్లి గ్రామం. రవీంద్రారెడ్డి పెరిగింది, ప్రాథమిక విద్యాభ్యాసం సాగిందంతా కనిగిరిలోనే. ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు నేత గుజ్జుల యలమందారెడ్డి, తల్లి సరళాదేవి ఓ మహిళా కార్యకర్త. రవీంద్రారెడ్డి 1 నుంచి 7వ తరగతి వరకు కనిగిరి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశాడు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం.. రవీంద్రారెడ్డి తండ్రి గుజ్జుల యలమందారెడ్డి సీపీఐ తరఫున కనిగిరి ఎమ్మెల్యేగా మూడు సార్లు, ఒంగోలు ఎంపీగా ఒకసారి గెలుపొందారు. తండ్రి ప్రభావం రవీంద్రాపై బలంగా పడింది. ఎలానైనా సోషలిస్ట్ ఐడియాలజీతో సోషలిస్ట్ దేశాల్లో ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీలో ఏడాదిపాటు బీకాం చదవాడు. బీకాం వదిలేసి జర్మనీలో మెడిసిన్ చేయాలని నిర్ణయించుకుని 1973 డిసెంబర్లో జర్మనీ వెళ్లాడు. ఏడాదిపాటు జర్మనీ భాషను నేర్చుకుని ఆ తర్వాత అక్కడ మెడిసిన్‌లో చేరాడు. మెడిసిన్ చదువుతున్న రోజుల నుంచే సోషలిస్ట్ భావాలు ఆయన్ను నిరంతరం కదిలిస్తూ ఉండేవి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ఉద్యమాలు కొనసాగించేవాడు. పదిహేనేళ్ల వయస్సులోనే జైలుకు.. చిన్నతనం నుంచే రవీంద్రారెడ్డి ప్రగతిశీల భావాలతో, సమసమాజం కోసం నిరంతరం పోరాటం చేశాడు రవీంద్రారెడ్డి. పదిహేనేళ్ల వయస్సులో దున్నేవాడిదే భూమి అంటూ నినదించి ఆ పోరాటంలో జైలుకు వెళ్లాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో హైదరాబాద్‌లో అమూల్ బేబీ ఫుడ్ బ్లాక్ మార్కెట్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి మరోసారి జైలుకు వెళ్లాడు. జర్మనీలో మెడిసిన్ చేసే సమయంలో పలువురు విదేశీ విద్యార్థులతో కలిసి పోరాటాలు చేశాడు. ఆఫ్రికాలో రోడీషా నల్లవారికి హక్కుల కోసం ఉద్యమించాడు. పాలస్తీనా ప్రత్యేక దేశం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్నాడు. వియత్నాంపై అమెరికా యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఉద్యమాల్లో ఉంటూనే బెర్లిన్‌లో మెడిసిన్ పూర్తి చేసి తన సేవలు కొనసాగించాడు. జర్మనీలో సంప్రదాయ దుస్తుల్లో ఏనుగు వద్ద రవీంద్రారెడ్డి రాజకీయాల్లో తొలి అడుగే మేయర్‌గా.. 1990వ సంవత్సరం వరకు ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండటంతో రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ రవీంద్రా పోటీ చేయలేకపోయాడు. 1993లో జర్మనీ సిటిజన్‌షిప్ రావడంతో ఏకంగా అల్టాండ్స్బర్గ్కి మేయర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు. వరుసగా ఐదుసార్లు మేయర్‌గా విజయాన్ని అందుకుని 2019 వరకు అక్కడి ప్రజల మన్ననలు పొందాడు. జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఓ భారతీయుడు ఏకంగా 25 సంవత్సరాల పాటు మేయర్‌గా ఉండి రవీంద్రారెడ్డి చరిత్ర సృష్టించాడు. మేయర్‌గా కొనసాగుతూనే 2004 నుంచి 2009 వరకు జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో జర్మన్ ప్రభుత్వం సాయంతో ఆయన కృష్ణాజిల్లా అవనిగడ్డలో స్కూల్స్, షెల్టర్స్, వంతెనలు, మరుగుదొడ్లు, జాలర్లకు భవనాలు నిర్మించి ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని సముద్రపు ఒడ్డున జాలర్లకు కట్టించిన 220 ఇళ్ల ఓ కాలనీకి రవీంద్రనగర్ అని పేరు పెట్టడం విశేషం. -
విషాదం: కుమారుడు లేడని తెలిసి..
మార్కాపురం: మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి వద్ద సుదీర్ఘకాలం పీఏగా పని చేసిన రిటైర్డు ఎంపీడీవో మొఘల్ సత్తార్ బేగ్ (70), ఆయన కుమారుడు షమీబేగ్ (40)లు శనివారం వేకువ జామున మృతి చెందారు. కొన్ని రోజులుగా షమీబేగ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తండ్రి సత్తార్ బేగ్ తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. కాసేపటికే ఆయన కూడా ప్రాణాలు విడవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రీకొడుకుల మృతి వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ ఇస్మాయిల్, బుశ్శెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణలు నివాళులరి్పంచారు. సత్తార్‌బేగ్ సుమారు 20 ఏళ్ల పాటు కొండారెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో విశేష అనుభవం ఉంది. రిటైర్డు పెన్షనర్ల సంఘానికి ఆయన తన సేవలు అందించారు. పలువురు ముస్లిం నాయకులు తండ్రి, కొడుకుల మృతిపై సంతాపం తెలిపారు. ఆ కుటుంబంలో విషాదం కొడుకు మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి కూడా చనిపోవటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రిటైర్డు ఎంపీడీవోగా, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా మొగల్ సత్తార్‌బేగ్ మార్కాపురం, తర్లుపాడు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల ప్రజలకు సుపరిచితుడు. ఆయన వివిధ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడైన షమీవుల్లాబేగ్ (40) వారం కిందట అనారోగ్యానికి గురై ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. ఆ వార్తను కుటుంబ సభ్యులు తండ్రి సత్తార్‌బేగ్ (70)కు చెప్పడంతో ఆయన కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. దీంతో సత్తార్‌బేగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. షమీవుల్లాకు కుమారుడు పర్హాన్, కుమార్తె పైజా ఉన్నారు. ఇద్దరూ చిన్న పిల్లలే. ఒక వైపు తండ్రి మరణం, మరో వైపు తాత మరణంతో ఇద్దరి మృతదేహాలను చూస్తూ రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. -
చిరకాల స్వప్నం.. త్వరలోనే సాకారం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా సముద్ర తీరంలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పనులు ప్రారంభించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహా్వనించేందుకు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు జ్యుడీషియల్ రివ్యూకు కూడా పంపించింది. తొలిదశలో మూడు బెర్తులతో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజల్లో రెట్టించిన ఆనందం నెలకొంది. 36 నెలల్లో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు: రామాయపట్నం పోర్టు పనులను 36 నెలల్లోనే పనులు పూర్తి చేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఈ నెలలోనే బిడ్డింగ్ విధానాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలి దశలో మూడు బెర్తులతో పనులు ప్రారంభించేలా విధివిధానాలను రూపొందిస్తున్నారు. అందుకుగాను ప్రాజెక్టు వ్యయ అంచనా విలువ రూ.2,169.62 కోట్లుగా నిర్ణయించారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. పోర్టు నిర్మాణాల్లో అనుభవమున్న బడా కాంట్రాక్టర్లను టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. రివర్స్ టెండర్ ద్వారానే కాంట్రాక్టును కట్టబెట్టేలా ఇప్పటికే నిర్ణయించారు. పోర్టుకు తొలి దశలో మూడు బెర్తులను 900 మీటర్ల పొడవుతో 34.5 మీటర్ల లోతు ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ... రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గతంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. వై.ఎస్.జగన్ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న ప్రకారం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్‌కార్పెట్ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం వరంగా మారింది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పోర్టు నిర్మాణంపై మోసం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా జిల్లాకు తీసుకురాని దుర్భర పరిస్థితి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన అనేక మంది ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం రామాయపట్నంలో మినీ పోర్టు ఏర్పాటు పేరుతో 2019 జనవరి 9వ తేదీన భూమి పూజ చేసి మరో మోసానికి తెరతీసిన వైనం అందరికీ తెలిసిందే. 2012లోనే అనుకూలమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ స్టేక్ హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అనువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. 2013 ఏప్రిల్ 15న కేబినెట్ కమిటీకి కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ఒక నోట్ సమరి్పంచింది. ఆ నోట్ ద్వారా రామాయపట్నం అనుకూల ప్రదేశమని ఆర్ధిక, రక్షణ, హోం, రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలకు సమాచారం అందించారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనూ దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశం విభజన చట్టంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. పోర్టు ఏర్పాటుకు అనుకూలాంశాలు ఇవీ.. జిల్లాలోని ఉలవపాడు– గుడ్లూరు మండలాల పరిధిలో రామాయపట్నం ఉంది. ఇక్కడ ‘సీఫ్రంట్’ సుమారుగా 7.5 కి.మీ తీరం పొడవున అతి దగ్గరలో సుమారు 10 మీటర్ల లోతు ఉండటం పోర్టు నిర్మాణానికి అనుకూలాంశంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మడ అడవులు అడ్డంకిగా లేని సముద్ర తీరం ఇక్కడ అందుబాటులో ఉండటం కూడా కలిసొచ్చే అంశం. సముద్ర తీరానికి అతి చేరువలో రవాణాకు అనుకూలంగా రైల్వేలైన్, 16వ నంబర్ జాతీయ రహదారి ఉండటం వల్ల పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది. దీనికితోడు రామాయపట్నం ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు అధికంగా అందుబాటులో ఉండటంతో స్థల సేకరణలో ఇబ్బందులు లేవు. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్న తరుణంలో పోర్టు నిర్మాణం జరిగితే పారిశ్రామికవేత్తలకు జల రవాణా కూడా అత్యంత చేరువలో ఉంటుంది. దీని వల్ల జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
సుబ్బారెడ్డి హత్య కేసు.. దర్యాప్తు ముమ్మరం
తాళ్లూరు: వైఎస్సార్ సీపీ నాయకుడు మారం సుబ్బారెడ్డి హత్య కేసులో సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటన జరిగిన వెంటనే రజానగరం గ్రామంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించారు. సోమవారం చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దర్శి, పొదిలి, అద్దంకి, ఇంకొల్లు సీఐలు శ్రీరామ్, ఎండీ మొయిన్, ఆంజనేయ రెడ్డి, రాంబాబు, ఎస్సైలు నాగరాజు, ఆంజనేయులు, రామకృష్ణ పోలీసుల బృందం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వీధి వీధిన తిరిగి బంధువులను విచారించారు. కేసును త్వరితగతిన ఛేదిస్తాం... పూర్తి స్థాయిలో విచారించి తగిన ఆధారాలు సేకరించి త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని దర్శి సీఐ ఎండీ మొయిన్ తెలిపారు. మృతునికి బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఏమైనా నగదు వ్యవహారాలు, ఇతర అంశాల్లో ఎవరితోనైనా విభేదాలున్నాయా అని ఆరా తీశామన్నారు. లేక గ్రామంలో సైకోగా అనుమానిస్తున్న వ్యక్తి పనేనా? అన్న విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ అశోక్ వర్ధన్, ఇంటలిజెన్స్ ఎస్సై రామారావు గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. జీపు నడుపుతూ గ్రామంలో పర్యటిస్తున్న ఎస్పీ.. భయాందోళన చెందుతున్న గ్రామస్తులు: గ్రామానికి చెందిన వారు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉంటుండగా వారి తల్లిదండ్రులు గ్రామంలో ఉంటూ పొలాలు చూసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా గొంతు కోసి దారుణంగా చంపిన సంఘటన గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించండి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హత్య జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పరిశీలించారు. అన్నం తినే సమయంలో కూర్చున్న స్థలం, వెనకవైపు గోడ, ఖాళీ ప్రదేశాలను చూశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ గ్రామంలో విచారించి ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే దారులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో సమాచారం సేకరించాలని చెప్పారు. అనుమానుతుల వివరాలు, వారి ప్రవర్తన తీరు, హతుడి ఆర్థిక పరిస్థితులపై పూర్తిగా ఆరా తీయాలని సూచించారు. ముందుగా తాళ్లూరు స్టేషన్ ఆవరణలో గతంలో రజానగరంలో జరిగిన ఘర్షణలో శేషయ్య అనే వ్యక్తిపై దాడి చేసిన పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం రోడ్డు మార్గంలో స్వయంగా ఎస్పీ జీపు నడుపుకుంటూ ఆయా ప్రాంతాల్లో పరిశీలించాల్సిన విధానాన్ని చీరాల డీఎస్పీ, దర్శి సీఐలకు వివరించారు. -
కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, ప్రకాశం జిల్లా: కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో శానిటైజర్లు విక్రయించిన పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ నిర్వహకుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శానిటైజర్లలో మిథైల్ ఆల్కహాల్‌కు బదులు మిథైల్ క్లోరైడ్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నాడని.. ఏజెంట్ల ద్వారా కురిచేడు, దర్శిలలో శానిటైజర్లు విక్రయించినట్టు విచారణలో తేలింది. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి) కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్లో అక్రమంగా తయారవుతున్న పర్ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. -
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలోని వివిధ మండలాల్లో వాతావరణం చల్లబడి ఆకస్మికంగా వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. పొడిగా ఉన్న వాతావరణం కాస్త మేఘావృతమైంది. హఠాత్తుగా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సరాసరి 0.3 మిమి వర్షపాతంగా నమోదైందని అధికా రులు తెలిపారు. ఒంగోలులో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు నగర ప్రధాన రోడ్ల పైన కూడా నీరు ప్రవహిస్తోంది. ఒంగోలులోని 38వ డివిజన్లో ఇళ్లలోకి నీరు చేరింది. గత టీడీపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒంగోలులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జనం మండిపడుతున్నారు. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 206.5 మిమీ కాగా మొదటి పక్షం రోజుల్లోనే 29.6 మి.మీగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు 185.7 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో పుల్లలచెరువు, పామూరు, పీసీపల్లి, కందుకూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు. ఆయా మండలాల వీఆర్వోలను, తహసీల్దార్లను , ఇతర అధికా రులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా గిద్దలూరు 3.8 మిమీ, జె.పంగులూరు 10.4 మిమీ, ఒంగోలు 10.4 మిమీ వర్షపాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. -
97వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, ఒంగోలు: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం టకారిపాలెం శివారు నుంచి ఆయన 97వ రోజు పాదయాత్రను ఆరంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అనంతరం చాల్ల గిరిగేల చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి గద్దమీద పల్లి క్రాస్, నందమారెళ్ల మీదుగాయేదపల్లి క్రాస్‌కు చేరుకుని, భోజన విరామం తీసుకుంటారు. తిరిగి పాదయాత్ర మద్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పాదయాత్ర పెద్దారికట్లకు చేరుకుంటుంది. వైఎస్ జగన్ పెద్దారికట్లలో జనంతో మమేకం కానున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యల వింటూ, వారికి నేనున్నా అనే భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. -
భవనంపై నుంచి పడి వృద్ధురాలు మృతి
సాక్షి, మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నెం కోటయ్య భార్య విష్ణుప్రియ (65) తన ఇంటి పైనుంచి కిందపడి మృతిచెందింది. పై అంతస్తుకు వెళ్లిన ఆమె అక్కడినుంచి జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో గమనించిన కింది పోర్షన్లో అద్దెకు ఉండేవాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. బంధువులను పిలిపించి కేసు నమోదు చేశారు. ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని మృతురాలి కొడుకు తెలిపాడు. -
ప్రత్యేక గర్జన
– ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రోడ్డెక్కిన జనం – జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణం – వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు – స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించిన ప్రజలు – నిరసనకారులపై మితిమీరిన పోలీస్ జులుం – అడుగడుగునా అరెస్ట్‌లు.. సుదూర ప్రాంతాలకు తరలింపు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని, దాన్ని సాధించే వరకు ఉద్యమం ఆగదని ఆపార్టీ శ్రేణులు నినదించాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగడుతూ జనం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వీరికి వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలూ జతకలిశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పలుచోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలను సైతం అరెస్టులు చేసి ఠాణాలకు తరలించారు. అయినా వెరవకుండా ఐక్యంగా ముందుకు కదిలారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ సీపీకి మద్దతుగా కాంగ్రెస్, వామపక్ష, ప్రజాసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పాటు వాణిజ్యసముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. ప్రజలు స్వచ్ఛందంగానే ప్రత్యేక హోదా బంద్‌కు మద్దతు పలకడం గమనార్హం. బంద్‌ను ఎలాగైనా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు పెద్ద ఎత్తున జులుం ప్రదర్శించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ, వామపక్ష, కాంగ్రెస్ ప్రజాసంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేçÙన్లలో ఉంచితే కార్యకర్తలు మరింత రెచ్చిపోతారని భావించి వారిని సుదూర ప్రాంతాలకు తరలించారు. బస్సులను అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ నేతలు, కార్యకర్తలను హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చిన నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌లు చేశారు. ఎమ్మెల్యేలని కూడా చూడకుండా మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేçÙన్లలో ఉంచారు. జిల్లావ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరిగింది. – ఒంగోలులో పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. ఉదయం 4.30 గంటల దాదాపు 100 మంది కార్యకర్తలు వామపక్ష, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించారు. 6 గంటల ప్రాంతంలో డీఎస్పీ జి. శ్రీనివాసరావు పోలీస్ బలగాలతో వచ్చి బంద్ నిర్వాహకులను అరెస్ట్ చేసి కొత్తపట్నం పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అనంతరం వందలాది మంది కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు, వామపక్ష నాయకులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాయి. ఆ తర్వాత నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. – గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు 6 గంటలకే అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేసి బేస్తవారిపేట పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. ఆ తర్వాత కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించడంతో పాటు రాచర్ల గేటు వద్ద రాస్తారోకో నిర్వహించారు. బ్యాంకులు, దుకాణాలు, పాఠశాలలను మూసివేయించారు. – యర్రగొండపాలెం నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలు, వామపక్ష కార్యకర్తలతో కలిసి బంద్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరిగింది. దుకాణాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతబడ్డాయి. 11 గంటల ప్రాంతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ బంద్‌లో పాల్గొన్నారు. – మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డిల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కార్యకర్తలు వాణిజ్యసముదాయాలు, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలన్నింటిని మూసివేయించారు. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి కొంతసేపటికి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. – కనిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి 1.30 గంటల వరకు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలను మూసివేయించారు. – కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు శింగారెడ్డి, వరికూటి కొండారెడ్డి, పి.వి.రమేష్‌యాదవ్, గంగిరెడ్డిల నేతృత్వంలో కార్యకర్తలు వామపక్ష కార్యకర్తలతో కలిసి టౌన్లో ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలను మూసివేయించారు. – అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చెంచు గరటయ్య అందుబాటులో లేకపోవడంతో పార్టీ జిల్లా క్రమశిక్షణా సంస్థ కమిటీ సభ్యుడు జ్యోతి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటల నుంచి కార్యకర్తలు అద్దంకిలో ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించారు. అద్దంకి–నార్కెట్‌పల్లి రోడ్డు వద్ద బైఠాయించిన 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. – చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు వరికూటి అమృతపాణి, యడం బాలాజీల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి బంద్ నిర్వహించారు. తొలుత ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలో దుకాణాలు, స్కూళ్ళు, బ్యాంకులు అన్నింటిని మూసివేయించారు. 12 గంటలకు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ బంద్ సంపూర్ణంగా జరిగింది. – కొండపి నియోజకవర్గంలో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో కొండపిలో పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. వాణిజ్యసముదాయాలు, స్కూళ్లు, బ్యాంకులన్నింటిని మూయించారు. బస్సులను ఆపారు. టంగుటూరులో ఒంటి గంట ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. – పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త గొట్టిపాటి భరత్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష కార్యకర్తలు ఉదయం 10 గంటల నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్యసముదాయాలు, పాఠశాలలన్నింటిని మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. – సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, పార్టీ నేత దుంపా చెంచిరెడ్డిలు బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు, స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. 2 గంటల వరకు బంద్ జరిగింది. – దర్శి నియోజకవర్గం సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూసివేయించారు. ఆర్టిసి బస్సులను అడ్డుకున్నారు. 12.30 గంటల వరకు బంద్ జరిగింది.