
సాక్షి, ఒంగోలు: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం టకారిపాలెం శివారు నుంచి ఆయన 97వ రోజు పాదయాత్రను ఆరంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అనంతరం చాల్ల గిరిగేల చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి గద్దమీద పల్లి క్రాస్, నందమారెళ్ల మీదుగాయేదపల్లి క్రాస్‌కు చేరుకుని, భోజన విరామం తీసుకుంటారు.
తిరిగి పాదయాత్ర మద్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పాదయాత్ర పెద్దారికట్లకు చేరుకుంటుంది. వైఎస్ జగన్ పెద్దారికట్లలో జనంతో మమేకం కానున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యల వింటూ, వారికి నేనున్నా అనే భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.