సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలోని వివిధ మండలాల్లో వాతావరణం చల్లబడి ఆకస్మికంగా వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. పొడిగా ఉన్న వాతావరణం కాస్త మేఘావృతమైంది. హఠాత్తుగా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సరాసరి 0.3 మిమి వర్షపాతంగా నమోదైందని అధికా రులు తెలిపారు. ఒంగోలులో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు నగర ప్రధాన రోడ్ల పైన కూడా నీరు ప్రవహిస్తోంది. ఒంగోలులోని 38వ డివిజన్‌లో ఇళ్లలోకి నీరు చేరింది. గత టీడీపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒంగోలులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జనం మండిపడుతున్నారు.
అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 206.5 మిమీ కాగా మొదటి పక్షం రోజుల్లోనే 29.6 మి.మీగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు 185.7 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో పుల్లలచెరువు, పామూరు, పీసీపల్లి, కందుకూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు. ఆయా మండలాల వీఆర్వోలను, తహసీల్దార్లను , ఇతర అధికా రులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా గిద్దలూరు 3.8 మిమీ, జె.పంగులూరు 10.4 మిమీ, ఒంగోలు 10.4 మిమీ వర్షపాతంగా నమోదైందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment