weather conditions
-
కుండపోత.. ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వాన.. కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్‌లో మాత్రం మండే ఎండ, ఆపై ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్‌పైనో, కారులోనో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించిన వారికి ఈ వింతైన అనుభవం ఎదురవుతోంది. గతంలో ఒకచోట వర్షం పడుతుంటే ఆ పక్కనున్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతోనే ఒక్కసారిగా అతివృష్టి, లేకుంటే తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని, జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రపంచంలోని పర్యావరణ నిపుణులు గొంతెత్తి చెబుతున్న ఒకేఒక్క మాట ‘ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’. సీజన్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పుడు పర్యావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ, వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం నమోదవుతూ వస్తోంది. ఉదాహరణకు అదిలాబాద్‌లో ప్రస్తుత సీజన్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీ సెల్సీయస్ నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం ఏకంగా 34.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీ సెల్సీయస్ కాగా..సోమవారం 34.6 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. రామగుండంలో 31.1 డిగ్రీ సెల్సీయస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతకు గాను 34.2 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ సోమవారం నాడు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వాటికి తీవ్ర ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 49.62 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం నాటికి 56.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర సగటును పరిశీలిస్తే సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలే గణాంకాలను గణనీయంగా పెంచేశాయన్న మాట. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఈ అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే కొన్నిచోట్ల అతి తక్కువ వర్షాలు లేదా అసలు వర్షమే లేకపోగా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయన్న మాట. వాతావరణంలోనూ ఇదే తరహా భిన్నమైన పరిస్థితులు నెలకొంటుండటం గమనార్హం. పట్టణీకరణ పేరిట వనరుల విధ్వంసం పట్టణీకరణ పేరిట ఇప్పుడు వనరుల విధ్వంసం విపరీతంగా పెరుగుతోంది. పట్టణీకరణ వల్ల నీటివనరులు పెద్దయెత్తున ఆక్రమణలకు గురవుతుండగా.. చెట్లు, పుట్టలను ఇష్టారాజ్యంగా తెగనరికేస్తున్నారు. మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ప్రారంభమై ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెంది అంతకంతకకూ విస్తరిస్తున్నా.. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వందలాది చెరువులతో కళకళలాడిన హైదరాబాద్, ఇప్పుడు నీటి సమస్యతో సతమతమవుతోందని, చెరువులు కబ్జాల పాలుకావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వనరులు కబ్జాలపాలు కావడంతో నీటి ప్రవాహం దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయని, చివరకు నిల్వ చేయాల్సిన నీరు సముద్రం పాలుకావడంతో నీటి సమతుల్యత దెబ్బతింటోందని వివరిస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ స్పేస్ నిబంధనలు గాలికొదిలి అనేక అంతస్తులతో భారీ నిర్మాణాలు చేపట్టడం, విచ్చలవిడి లేఅవుట్లతో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఓపెన్ స్పేస్ ఏరియా ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కడాన్ని గుర్తు చేస్తున్నారు. పెరగని సాగు విస్తీర్ణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోతతో కూడిన విభిన్న వాతావరణం నెలకొనడం పంటల సాగుపైనా ప్రభావం చూపించింది. వానాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. ఈ నెల 14వ తేదీ వరకు 1.03 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయాల్సి ఉంది. కానీ 94 లక్షల ఎకరాల మేర మాత్రమే పంటలు సాగవడం గమనార్హం. నీటి వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి హైదరాబాద్ లాంటి నగరానికి అతి త్వరలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న చెరువులు ఇప్పుడు వందల్లోకి పడిపోయాయి. నీటి నిల్వలకు కేంద్రంగా ఉండే చెరువుల సంఖ్య తగ్గిపోతుండగా కాలువలన్నీ కబ్జాలపాలవుతున్నాయి. ఉదాహరణకు ఫిరంగిరనాలా అనే కాలువతో శివారు ప్రాంతాల్లోని 22 చెరువులు నీటితో నిండేవి. కానీ ఈ నాలా కబ్జాకు గురైంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ నాలాను పునరుద్ధరిస్తే దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతాయి. అదేవిధంగా నగరంలో ఉన్న చెరువులు, ప్రధాన కాలువలను పునరుద్ధరించి పరిరక్షిస్తే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. – ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం... నగరీకరణలో అత్యంత కీలకం సమగ్ర ప్రణాళిక. కానీ ఇప్పుడు కేవలం కట్టడాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉంది. అడ్డగోలు కట్టడాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారడం తప్ప మెరుగైన జీవావరణం ఏవిధంగా సాధ్యమవుతుంది. అందకే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు హైదనాబాద్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలి. – సుబ్బారావు, పర్యావరణ నిపుణులు వర్షాకాలంలోనూ ఎండ వేడిమి...పగటిపూటే కాకుండా రాత్రిళ్లు కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో ఏసీలు, కూల ర్లను రోజంతా వాడక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఆదివారం (ఆగస్టు 18న) 273.665 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా.. గతేడాది ఇదే రోజున 254.123 మిలియన్ యూనిట్ల వినియోగమే నమోదు కావడం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 17 వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం. -
మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇక, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 26.03.2024 DAILY WEATHER REPORT OF TELANGANA pic.twitter.com/Uxr05ZS5oZ — mchyderabad dwr (@mchyderaba94902) March 26, 2024 మరోవైపు.. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీచేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలుచోట్ల వర్షం కురిసిన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
జనవరి చలి ఏదీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఎముకలు కొరికే చలి ఉండాలి. కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో చలికి బదులు ఉక్కపోత ఉంటోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. సగటున 3 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మేర అధికంగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలోని వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే మూడురోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతటా అధికమే... రాష్ట్రంలో అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఐఎండీ అధికారుల గణాంకాల ప్రకారం అదిలాబాద్‌లో సాధారణం కంటే 9.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ సమయంలో 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 19 డిగ్రీలు నమోదవుతోంది. నిజామాబాద్‌లో సాధారణం కంటే 5.7 డిగ్రీ సెల్సియస్, రామగుండంలో 5.5 డిగ్రీ, భద్రాచలంలో 4.3 డిగ్రీ, మెదక్‌లో 3.8 డిగ్రీ, హైదరాబాద్‌లో 3 డిగ్రీ సెల్సియస్ చొప్పున అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రిపూట చలి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. గురువారం ఖమ్మంలో 31 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
రైతులకు తోడుగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ అన్నారు. ‘పొలాలు బీడు–ఏదీ రైతుకు తోడు’ శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కథనంలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు సాయం కోసం ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక చేపట్టడం లేదనడంలో వాస్తవం లేదన్నారు. సీజన్ ప్రారంభానికి నెల రోజులు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐసీఏఆర్, సీఆర్ఐడీఏ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆర్బీకే, మండల, జిల్లా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో చర్చించి జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేశామన్నారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద ఇతర పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఒక్కొక్క రైతుకు 2 హెక్టార్ల వరకు 80 శాతం రాయితీపై విత్తనాలను సిద్దం చేసామన్నారు. జూలై నెలలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుకు సైతం 80 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేశామన్నారు. ఈ విధంగా ఆర్హత, అవసరం ఉన్న రైతులను గుర్తించి ఆ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించామన్నారు. వ్రర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తారని చెప్పారు. కాగా.. ఖరీఫ్–2023లో ఇప్పటివరకు సాగైన పంటలను ప్రస్తుత వాతావరణంలో నిలదొక్కుకొని ఆశించిన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన పంట యాజమాన్య పద్ధతులపై జిల్లా రిసోర్స్ సెంటర్స్, కేవీకే, ఏఆర్ఎస్, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలతో రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. ఇలా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుంటే.. రైతులను ఆందోళనకు గురిచేసేలా, ప్రభుత్వం బురద జల్లే రీతిలో లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు. -
మిరప సాగుకు అనువైన సమయం ఇదే..
పెద్దవూర: గత వానాకాలం సీజన్లో మిరప పంటకు అధిక ధరలు పలకడంతో ఈ యేడాది అధిక విస్తీర్ణంలో సాగు చేయటానికి సిద్ధం అవుతున్నారు. మిరప పంటలో సాగు విధానం, యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ, మిరప చేను చుట్టూ రక్షణ పంటలుగా హైబ్రిడ్ జొన్న లేదా మొక్కజొన్న రెండు లేదా మూడు సాళ్లలో వేయాలి. కీటక ఆకర్షణ(ఎర) పంటలుగా బంతి, ఆముదాన్ని పొలంలో అక్కడక్కడా వేయాలని సూచిస్తున్నారు. మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అత్యంత అనుకూలమని చెబుతున్నారు. వాతావరణం, విత్తే సమయం మిరప పంట అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. మిరపకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప కోసం వేసే పంటను వానాకాలం సీజన్లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప కోసం సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా మిరప పంటను ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లోనూ, యాసంగిలో అయితే అక్టోబర్, నవంబర్ నెలలో సాగుకు అనుకూలం. నేల తయారీ : పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ వేయాలి. అలాగే 90కిలోల పశువుల ఎరువు, 10కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మావిరిడి శిలీంద్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంద్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసినట్లైతే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియ దున్నాలి. దీనివలన భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10–15 రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్‌తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి. విత్తనశుద్ధి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా చీడపీడల నుంచి దీర్ఘకాలం పాటు పంటను రక్షించవచ్చు. మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. వైరస్ తెగుళ్ల నివారణకు గాను కిలో మిరప విత్తనానికి గాను 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్పేటును ఒక లీటరు నీటిలో కరిగించి దీనిలో 15నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టాలి. తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు గాను కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను పట్టించాలి. దీనివలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి నివారణ జరుగుతుంది. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు గాను కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి. విత్తన మోతాదు మిరపను రెండు రకాల పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా ప్రధాన పొలంలో విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పెంచుటకు విత్తన మోతా దు సూటి రకాలకు 650 గ్రాములు, హైబ్రిడ్ రకాలైతే 75 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. ప్రోట్రేలలో.. ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా మొక్కలు పెరిగి పంట ఒకేసారి కాపుకు వస్తుంది. దీనితో పాటు నారు దృఢంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావాల్సిన వారు 98 సెల్స్ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేసు నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపీట్ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపీట్‌తో కప్పుకోవాలి. 6 రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి. మొక్కలను నాటుకునే విధానం మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24్ఙశ్రీ24 అంగుళాలు(ఇంచులు) లేదా 26్ఙశ్రీ26 లేదా 28్ఙశ్రీ28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాల్లో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు అనువైనది. కలుపు యాజమాన్యం కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తరువాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఎలా మొక్క నేల మొత్తాన్ని కప్పివేసేవరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్ ఇథైల్‌ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. నారు పెంచే విధానం మిరప నారును రెండు పద్ధతుల్లో పెంచవచ్చు. మిరప నారుమడికి సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తరు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అ నుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్యదూరం, 1.5 సెం,మీ లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్ నీటిలో 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి. -
‘అన్న’లకు అనారోగ్యం!
ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన ‘అన్న’లకు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తోంది. దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు లెక్క చేయక గడిపిన ఎందరో నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు మారిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. వైద్యం కోసం అడవులు వదిలితే ఎక్కడ పోలీస్ బలగాలకు చిక్కుతామన్న భయంతో తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇప్పుడు వారిని మరింతకుంగదీస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే.. అనారోగ్య కారణాలతోనే మావోయిస్టు అగ్రనాయకులైన ఆర్కే, హరిభూషణ్‌లు సైతం మృతిచెందారు. అలాగే ఇటీవలే మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మావోయిస్టు కేంద్ర కమిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నేతలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో అరెస్టయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. మంచానికే పరిమితమైన గణపతి? మావోయిస్టు ఉద్యమం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటైన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక నేతగా ఉన్న గణపతి వయస్సు 73కు చేరింది. బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న గణపతి ప్రస్తుతానికి మంచానికే పరిమితమైనట్టు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు అయిన గాజర్ల రవి సైతం కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీలోని రామచంద్రారెడ్డి, మొడెం బాలకృష్ణ, పోతుల కల్పన, దండాకరణ్యం స్పెషల్ జోన్ కమిటీలోని నూనె నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న వెన్ను నొప్పితో , తెలంగాణ డివిజనల్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ అధిక రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర కీలక నాయకులు సైతం చాలా మంది షుగర్ , బీపీ, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో సతమతవుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి సహకారం తగ్గుతోందా? మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గుతోందనీ, అందుకే సకాలంలో మందుల రవాణా, ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కటకం సుదర్శన్ మృతిపై ప్రకటన జారీ సందర్భంగా మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఇవే ఆరోపణలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మేం చూసుకుంటామంటున్న ఖాకీలు పోలీసు అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది..అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంటున్నారు. మావోయిస్టు నాయకులు, కేడర్ లొంగిపోతున్న సందర్భాల్లో, అరెస్టుల సందర్భంగా నిర్వహించే పత్రికా సమావేశాల్లోనూ లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుపతి: ఒకవైపు ఏపీలో ఎండలు మండిపోతుంటే.. తిరుమలలో మాత్రం ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Heat induced & atmospheric instability triggering thunderstorms along sesachalam hills and it's raining heavily in #Tirumala now. these thunderstorms likely to spread into parts of #Tirupati city and surroundings during next 1 hour. Go out with umbrella! Tirupatians. pic.twitter.com/JRgBAvd09u — Eastcoast Weatherman (@eastcoastrains) May 18, 2023 -
ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’?.. ఎందుకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు?
మహారాష్ట్రలోని నవీ ముంబై శివార్లలో భారీ సభ.. లక్షల్లో జనాలు వచ్చారు.. ఎండాకాలమే అయినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు.. అయినా వడదెబ్బ తగిలి ఏకంగా 14 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతకు మరికొన్ని వాతావరణ అంశాలు తోడుకావడమే దీనికి కారణం. అందుకే కేవలం ఉష్ణోగ్రతను కాకుండా.. ‘హీట్ ఇండెక్స్’ను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్ణయించింది. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంచనాలతో కలర్ కోడింగ్ మ్యాప్‌లనూ విడుదల చేస్తోంది. మరీ ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? దీనితో ఏమిటి లాభం? వంటి వివరాలు తెలుసుకుందామా.. ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ కలిస్తే.. ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాస్త వేడిగా అనిపిస్తుంది. కానీ దీంతోపాటు వాతావరణంలో నీటిఆవిరి శాతం (రిలేటివ్ హ్యూమిడిటీ) కూడా పెరిగితే.. వేడికి తోడు ఉక్కపోత మొదలవుతుంది. ఆచోట నీడ లేకపోయినా, గాలివీయకపోయినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. విపరీతంగా చెమటపడుతుంది. అప్పటికీ ఎండ/వేడిలో నే ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఒకదశలో ఊపిరి తీసుకోలేక, స్పృహ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి ఏమిటి సంబంధం? మామూలుగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే.. అందుకు తగినట్టుగా గాలి, నీరు వేడెక్కుతూ ఉంటాయి. వేడెక్కిన నీరు వేగంగా ఆవిరి అవుతూ గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఎండ, వేడి గాలి కారణంగా మన శరీరం వేడెక్కి చెమటపడుతుంది. మామూలుగా అయితే చెమట ఆరినకొద్దీ శరీరం చల్లబడుతుంది. కానీ వాతావరణంలో అప్పటికే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట ఆరక.. శరీరం వేడెక్కిపోతూనే ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపి.. అస్వస్థతకు గురవుతారు. ఎంత ఉష్ణోగ్రతకు, ఎంత హ్యూమిడిటీ ఉంటే.. ఏంటి పరిస్థితి? - ఒక్కో స్థాయిలో ఉష్ణోగ్రతకు, ఒక్కోస్థాయి వరకు హ్యూమిడి టీ ఉంటే ఇబ్బందిగా ఉండదు. అవి పరిమితి దాటితే సమస్యగా మారుతుంది. - 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 40% వరకు హ్యూమిడిటీ ఉంటే వాతావరణం హాయి గా ఉన్నట్టు. ఈ పరిస్థితిని మన శరీరం సులువుగా తట్టుకోగలుగుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. - ఈ ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీకి తోడు నేరుగా ఎండలో ఉండటం, వడగాడ్పులు వంటివి కూడా ఉంటే హీట్ ఇండెక్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏమిటి దీనితో ప్రయోజనం? ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా తొలుత బాగానే అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఇతర అంశాల ప్రభావంతో ఇబ్బందిగా మారుతుంది. అదే ‘హీట్ ఇండెక్స్’తో పరిస్థితి ఎలా ఉందన్నది తెలిస్తే.. ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ, విశాఖపట్నం రెండు చోట్లా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఢిల్లీలో 40%, విశాఖలో 50% హ్యూమిడిటీ ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ విశాఖలో మాత్రం ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువ. ఇప్పటికే ‘ఫీల్స్ లైక్’పేరిట.. ఉష్ణోగ్రత, ఇతర అంశాలను కలిపాక.. వాతావరణం ఎంత వేడిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుందనే దాన్ని ‘ఫీల్స్ లైక్’, ‘రియల్ ఫీల్’వంటి పేర్లతో సూచిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాతావరణ సంస్థలు దీనిని అమలు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోని వెదర్ యాప్స్‌లో కూడా ఈ హీట్ ఇండెక్స్ అంచనాలను చూడవచ్చు. - ఉష్ణోగ్రత, హ్యూమిడిటీతోపాటు మేఘాలు ఆవరించి ఉండటం, గాలి వీచే వేగం, సదరు ప్రాంతం ఎత్తు, సమీపంలో భారీ జల వనరులు ఉండటం, తీర ప్రాంతాలు కావడం, వర్షాలు కురవడం వంటివాటిని బట్టి హీట్ ఇండెక్స్ మారే అవకాశం ఉంటుంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ‘హీట్ ఇండెక్స్’ను నిర్ధారించాల్సి ఉంటుంది. ‘హీట్ ఇండెక్స్’ఏ రోజుకారోజు, ఉదయం నుంచి రాత్రి వరకు సమయాన్ని బట్టి మారుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్. ఇది కూడా చదవండి: అవసరం అయితేనే బయటకు రండి.. రాత్రిపూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు -
Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను (Bomb Cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, తుఫాన్లు, మంచు ధాటికి మంగళవారం కూడా దేశమంతా అతలాకుతలమైంది. 4,000 పై చిలుకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 60 దాటింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కనీసం 30 మంది దాకా చనిపోయారు. ఇక్కడి బఫెలో కౌంటీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా కనీసం 50 అంగుళాల మేర మంచు పరుచుకుపోయింది. 1880ల తర్వాత ఈ ప్రాంతం ఈ స్థాయిలో హిమపాతాన్ని చూడటం ఇదే తొలిసారి! నిత్యావసరాల కొరత పలుచోట్ల లూటీలకు కూడా దారితీస్తోంది. అయితే గత ఆరు రోజులతో పోలిస్తే మంగళవారం పరిస్థితి కాస్త మెరుగైందని, పలు ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. న్యూయార్క్ రాష్ట్రంలోని ఎల్మ్వుడ్లో మంచుమయమైన రహదారి పొంచి ఉన్న వరద ముప్పు ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటిదాకా పేరుకుపోయిన అపారమైన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. దాంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నారు. -
IND Vs PAK: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ భయాలేమి అక్కర్లేదట!
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 23న) చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెల్బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌కు టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడయ్యాయి. 90వేలకు పైగా సామర్థ్యం ఉన్న మెల్బోర్న్ స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం పెద్ద ఆటంకంగా ఉంది. భారత్, పాక్ మ్యాచ్ జరగనున్న ఆదివారం మెల్బోర్న్లో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయంటూ గతంలో ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలోనే వరుణ దేవుడు అభిమానుల మొర ఆలకించినట్లున్నాడు. శనివారం ఉదయం నుంచి మెల్బోర్న్లో వర్షం పడలేదని.. వాతావరణం సాధారణంగా ఉందంటూ ఆస్ట్రేలియా వాతావారణ విభాగం స్టేడియానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది . సోమవారం వరకు వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే వర్షం ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని.. 40 శాతం మేర వర్షం పడే అవకాశముందని తెలిపింది. అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న సంశయంలో ఉన్న భారత్-పాక్ అభిమానులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు. ఒకవేళ రేపు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. దీంతో అభిమానులు భారత్-పాక్ మ్యాచ్ ఎలాగైనా మ్యాచ్ జరిగేలా చూడాలని వరుణ దేవుడికి పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఇన్నాళ్లు మ్యాచ్ గెలవాలని కోరుకుంటూ పూజలు చేయడం చూశాం.. ఇప్పుడేమో మ్యాచ్ జరిగేలా చూడాలని పూజలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ'' మరికొంతమంది పేర్కొన్నారు. A very good morning to everyone in India (and Pakistan). This is the view outside MCG at 1pm. The sun is out. Forecast has improved massively this morning. No more rain expected until Monday. Yes, read that again!! 🙂#IndvPak #IndvsPak #T20WorldCup pic.twitter.com/XXVEFr2JLt — Chetan Narula (@chetannarula) October 22, 2022 చదవండి: కోహ్లి, రోహిత్‌ల భజన తప్ప సూర్య గురించి అడగడం లేదు! విండీస్ జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Hyderabad: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. వర్షంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తాయి. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలతోపాటు మూసీలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్ జలాశయంలోనికి 1800 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ఆరు గేట్లను ..నాలుగు అడుగుల మేర తెరచి 2328 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. హిమాయత్సాగర్లోనికి 2500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..నాలుగు గేట్లను రెండు అడుగుల మేర తెరచి 2532 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది. చదవండి: ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్! -
కోవిడ్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం!
జెనీవా: కోవిడ్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. చైనాలోని వూహాన్లో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పటికీ దాని చుట్టూ ఇంకా ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది. శ్వాస కోశకు సంబంధించిన వ్యాధులన్నీ సీజనల్‌గానే వస్తాయని, శీతల వాతావరణం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు ఎక్కువని చెప్పింది. ఇక ఫ్లూ తరహా వ్యాధులు కూడా సమశీతోష్ణ ప్రాంతాల్లో కూడా తరచూ విజృంభిస్తూ ఉంటాయని వెల్లడించింది . కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకటే రకం వ్యాధి కావడంతో ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారుతుందని ఆ బృందం అభిప్రాయపడింది. అందుకే ఇప్పటికిప్పుడు వాతావరణ మార్పుల్ని అంచనా వేసుకొని కోవిడ్ ఆంక్షల్ని సడిలించవద్దని హెచ్చరించింది. అత్యంత శీతల వాతావరణంలో కరోనా వ్యాప్తి ఎలా చెందుతోందో, వేడి వాతావరణంలో కూడా అదే స్థాయిలో విజృంభిస్తోందని వచ్చే సీజన్లలో కూడా అలాగే జరిగే అవకాశం ఉందని బృందానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్ జెయిట్‌చిక్ చెప్పారు. -
ఏంటిది.. చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్!
సాక్షి, హైదరాబాద్: చండ ప్రచండమైన భానుడి భగభగలతో దేశవ్యాప్తంగా జనం వడ గాల్పుల తాకిడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు ఎన్ని తిరుగుతున్నా ఇళ్లల్లో వేడి భరించలేకుండా ఉన్నామని చెప్తున్నారు. ఉక్కపోతకు తోడు.. వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లను వినియోగించాలని ఉన్నా.. కరోనా భయంతో వాటికి దూరంగా ఉంటున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో నగర వాసులు.. తమ వేడి బాధను సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వెళ్లక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిల్లో ఒక మీమ్ నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ‘నువ్ సూర్యుడివా యముడివా.. అలా మండుతున్నావ్ ఏంటి.. నిన్న 45 డిగ్రీలు, ఇవాళ 46 డిగ్రీలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్’అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ఫొటోతో ఉన్న మీమ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: ఫీల్.. కూల్) ఎండ తీవ్రత వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి ఈరోజు మరింత ఎక్కువగా ఉంది. నిజామాబాద్ 43, మెదక్ 42, వరంగల్ 44, హైదరాబాద్ 42, కరీంనగర్ 44, రామగుండం 43, నల్గొండ 44, విజయవాడ 42, విశాఖ 34, తిరుపతి 41, రాజమండ్రి 41, ఒంగోలు 42, నెల్లూరు 42, కర్నూలు 41, అనంతపురం 41, కడప 42, ఏలూరు 42, విజయనగరం 36, శ్రీకాకుళం 36 డిగ్రీల చొప్పున శుక్రవారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత్‌లోని ప్రధాన నగరాల్లో నేటి ఎండల తీవ్రతను పరిశీలిస్తే.. ఢిల్లీ 45, హైదరాబాద్ 42, అహ్మదాబాద్ 41, చెన్నై 38, పుణె 36, ముంబై 35, కోల్‌కత 34, బెంగుళూరు 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తమిళనాడుని వణికించిన వాన
సాక్షి, చెన్నై : బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు తాంబరం పరిసరవాసుల్ని వర్షం వణికించింది. ఒక్క రాత్రిపూటే ఏకంగా 14 సెం.మీ వర్షం కురవడంతో రోడ్లు జలదిగ్భందంలో చిక్కాయి. గతంలో ఇక్కడ నెలకొన్న పరిణామాలతో అధికారులు ఇంకా గుణపాఠం నేర్వక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 డిసెంబరులో ఈశాన్య రుతు పవనాలు చెన్నై మీద తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. నీట మునిగిన తాంబరం సమీపంలోని సబ్ వే ప్రధానంగా తాంబరం పరిసరాల్లో ఒకే రాత్రి 20 సెం.మీకి పైగా వర్షం పడటంతో ఇక్కడి చెరువులు తెగి ఆ నీళ్లు అడయార్‌లోకి ఉధృతంగా ప్రవహించడంతో చెన్నై నీట మునిగింది. కాంచీపురం జిల్లా, ప్రస్తుత చెంగల్పట్టు జిల్లా పరిధిలోని తాంబరం, ముడిచ్చూరు, వరదరాజపురం, మణివాక్కం, ఆలందూరు, మణిమంగళం, ఊరపాక్కం, గూడువాంజేరి ప్రాంతాల్లోని చెరువులన్నీ తెగడం కారణంగానే చెన్నై జలదిగ్భంధంలో చిక్కుకుని పది రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ జామ్ అలాగే, పెరుంగళత్తూరు, సేలయూరు, పళ్లికరణై , పెరుంగుడి పరిసరాల్లోని చెరువుల రూపంలో ఆ పరిసరాలన్నీ కొన్ని రోజుల పాటు నీట మునగాల్సిన పరిస్థితి. దీంతో అడయార్ తీరంతో పాటు నీటి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు మీద ప్రత్యేక దృష్టి పెట్టినా, అధికారులు ఆ తదుపరి యథారాజ తథాప్రజా అన్న చందంగా వ్యవహరించడం మొదలెట్టారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలతో అధికారులు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని బుధవారం రాత్రి తాంబరం పరిసరాల్లో కురిసిన వర్షంతో వెల్లడైంది. కుండపోతగా వాన.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో మోస్తారుగా వర్షం పడ్డా, చెన్నైలో అంతంత మాత్రమే. చెన్నై శివారుల్లో కొంత మేరకు అప్పుడప్పుడు వర్షం పలకరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో బుధవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, పిడుగు పాటులతో ఆ ప్రాంతం దద్దరిళ్లింది. వర్షం ధాటికి కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల కలెక్టర్లు ఉదయాన్నే విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. రోడ్డుపై చేరిన నీరు ఈ రెండు జిల్లా పరిధిలోని శ్రీపెరంబదూరు, వాలాజాబాద్, తిరుప్పోరూర్, ఉత్తర మేరు, మహాబలిపురం, గూడువాంజేరి, పరిసరాల్లో భారీ వర్షం పడింది. అయితే, తాంబరం పరిసరాల్లో ఏకంగా 14.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షం కారణంగా తాంబరం – ముడిచ్చూరు మార్గం జలమయమైంది. తాంబరం – వేళచ్చేరి మార్గంలో సేలయూరు వద్ద రోడ్డు మీద వరద పారాయి. వాహనాలు ముందుకు సాగలేని పరిస్థితి. అన్ని రోడ్లు జలమయం కావడంతో పాటుగా రైల్వే సబ్‌వేలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తాయి. ఇక, అడయార్‌లో నీటి ప్రవాహం పెరిగింది. వాహనదారుల ఇక్కట్లు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి సైతం నీళ్లు చొరబడటంతో అక్కడి ప్రజలు అధికారుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త కాలువల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగి ఉండటంతో నీళ్లు బయటకు వెళ్ల లేని పరిస్థితి. పది గంటల తదుపరి అధికార వర్గాలు రంగంలోకి దిగి, నీటిని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అంత వరకు ఆయా మార్గాల్లో ప్రయాణం గగనంగా మారింది. ఇక, వేలూరు జిల్లా పరిధిలో అనేక చోట్ల భారీ వర్షం ధాటికి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కొన్ని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలను యాజమాన్యాలు వాయిదా వేశాయి. మరో మూడు రోజుల వాన.... చెన్నైలోని ట్రిప్లికేన్, పురసైవాక్కం, విల్లివాక్కం, ఎగ్మూర్, టీ.నగర్, వడపళని, అంబత్తూరు, ఆవడి ప్రాంతాల్లో కాసేపు వర్షం పలకరించింది. ఈశాన్య రుతు పవనాలు మరింత బలపడే అవకాశాలతో మరోమూడు రోజుల పాటుగా అక్కడక్కడ భారీగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో మోస్తారుగా వర్షం పడుతుందని, ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీగా వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం సమాచారంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 2015లో ఇదే తరహాలో నవంబర్ చివర్లో భారీ వర్షం పడటం, డిసెంబరు 1, 2 తేదీల్లో రాత్రికి రాత్రే కురిసిన వర్షాలతో చెన్నై నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో వర్షం పడే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. -
42 % మేట.. 27% కోత
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని సముద్ర తీరం అనూహ్యమైన మార్పులకు లోనవుతోంది. దేశంలో గుజరాత్ తర్వాత అతి పెద్దదైన మన రాష్ట్రంలోని తీరం.. 42 శాతం ఇసుక మేటల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తొమ్మిది జిల్లాల్లో 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీరంలో 434.26 (42 శాతం) కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేసింది. 272.34 కిలోమీటర్ల తీరం (27%) కోతకు గురవుతుండగా, 320.98 కి.మీ. (31%) తీరం స్థిరంగా ఉంది. చెన్నై కేంద్రంగా పనిచేసే నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ విభాగం 1990 నుంచి 2016 వరకు సముద్ర తీరంలోని మార్పులను శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్, క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా అధ్యయనం చేసి, ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. కృష్ణా, తూర్పుగోదావరిలో ప్రమాదకర మార్పులు కృష్ణా జిల్లాలో 40.30 కి.మీ. తీరం ప్రమాదకర స్థాయిలో కోతకు గురవుతుండగా, 29.18 కి.మీ. మేర ఇసుక మేటలు వేశాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 కి.మీ. తీవ్రంగా కోతకు గురవుతుండగా, 33.10 కి.మీ. ఇసుక మేటలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే కోతలు, మేటలు ఎక్కువగా ఉంటున్నాయి. విశాఖలో 102.74 కి.మీ., శ్రీకాకుళంలో 81.60 కి.మీ. తీరం స్థిరంగా ఉంది. కైలాసగిరి, యారాడ కొండలు విశాఖ తీరాన్ని స్థిరంగా ఉండేలా చేస్తున్నాయి. విజయనగరం తీరం కూడా స్థిరంగా ఉంటోంది. నెల్లూరు జిల్లా తీరంలో కొన్ని చోట్ల మేటలు కనిపిస్తుండగా, ఎక్కువ ప్రాంతం స్థిరంగా ఉంది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తీరంలో ఇసుక మేటలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. గడిచిన 26 ఏళ్లలో పశ్చిమబెంగాల్ తీరం 40 శాతం కోతకు గురై 99 చదరపు కి.మీ. తీరాన్ని కోల్పోయింది. 40 శాతం ఇసుక మేటలు వేయడంతో ఒడిశాలో ఆ మేర తీరం పెరిగింది. దేశం మొత్తం మీద 231.50 చ.కి.మీ. ఇసుక మేటలు వేసి తీరం పెరగ్గా, 234.25 చ.కి.మీ. కోత వల్ల తీరం కోల్పోయింది. ఒకచోట పెరిగితే మరో చోట తగ్గుతుంది సముద్ర తీరం ఒకచోట కోతకు గురైతే మరో చోట పెరుగుతుంది. రాష్ట్రంలో ఉప్పాడ తీరాన్ని బట్టి మార్పులను అంచనా వేస్తారు. ఇటీవలి కాలంలో కోత ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. తీరానికి ఎక్కడైనా అడ్డుకట్ట (నిర్మాణాలు, జెట్టీలు వంటివి) పడితే మరో చోట మార్పు కనిపిస్తుంది. ఒక్క ప్రాంతాన్నే చూస్తే అక్కడి వరకే కనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం తీరాన్ని పరిశీలిస్తే ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది తెలుస్తుంది. ఈ అధ్యయనం చాలా నిశితంగా, సంవత్సరాలపాటు చేస్తేగానీ ఏం జరుగుతుందో అర్థం కాదు. – వీఎస్ఎన్ మూర్తి, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ (ఓషనోగ్రఫీ) తీరం కోతకు కారణాలివే.. - బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వల్ల రాష్ట్రంలోని తీరం ఎక్కువగా మార్పులకు లోనై కోతకు గురవుతోంది. - సాధారణ పరిస్థితుల్లో గాలి వేగం, సముద్ర మట్టాల్లోని తేడాలు, తరచూ మారే వాతావరణ పరిస్థితులు, పర్యావరణం కారణంగానూ తీరం తీరు మార్చుకుంటోంది. -పోర్టులు, హార్బర్లు, ఫిషింగ్ జెట్టీలు, తీరంలో ఆధునిక సౌకర్యాల కోసం జరిగే మార్పుల వల్ల కూడా ప్రభావితమవుతోంది. నష్ట నివారణ ఇలా.. - మానవ విధ్వంసాల్ని వీలైనంతగా తగ్గించాలి. - కోస్టల్ రెగ్యులేటరీ నిబంధనలను (కట్టడాల సైజు, ఏ ప్రాంతంలో కట్టాలి.. ఎక్కడ కట్టకూడదు.. తదితరాలు) తప్పక పాటించాలి. - నదులు సముద్రంలో కలిసే చోట అడ్డంకులు లేకుండా చూడాలి. - సముద్రంలో కాలుష్య కారకాల విడుదలను తగ్గించాలి. - తీరంలో ఆటుపోట్లకు విఘాతం కలుగకుండా చూడాలి. -
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలోని వివిధ మండలాల్లో వాతావరణం చల్లబడి ఆకస్మికంగా వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. పొడిగా ఉన్న వాతావరణం కాస్త మేఘావృతమైంది. హఠాత్తుగా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సరాసరి 0.3 మిమి వర్షపాతంగా నమోదైందని అధికా రులు తెలిపారు. ఒంగోలులో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు నగర ప్రధాన రోడ్ల పైన కూడా నీరు ప్రవహిస్తోంది. ఒంగోలులోని 38వ డివిజన్లో ఇళ్లలోకి నీరు చేరింది. గత టీడీపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒంగోలులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జనం మండిపడుతున్నారు. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 206.5 మిమీ కాగా మొదటి పక్షం రోజుల్లోనే 29.6 మి.మీగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు 185.7 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో పుల్లలచెరువు, పామూరు, పీసీపల్లి, కందుకూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు. ఆయా మండలాల వీఆర్వోలను, తహసీల్దార్లను , ఇతర అధికా రులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా గిద్దలూరు 3.8 మిమీ, జె.పంగులూరు 10.4 మిమీ, ఒంగోలు 10.4 మిమీ వర్షపాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. -
స్వైన్‌ఫ్లూ సైరన్..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఏడాదికేడాదికి దీని తీవ్రత వాతావరణ పరిస్థితిని బట్టి మారుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2012 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 27 వరకు అంటే ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 1.14 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ సోకింది. అందులో 8,119 మంది మృతి చెందారు. అంటే స్వైన్‌ఫ్లూ సోకిన వారిలో 7.12 శాతం మంది మరణించారు. కేంద్ర నివేదిక వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015లో అత్యధికంగా 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి సోకగా, 2,270 మంది చనిపోయినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో తక్కువగా 937 మందికి ఫ్లూ రాగా, అందులో 218 మంది మృతిచెందారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు నమోదైన స్వైన్‌ఫ్లూ కేసులు, మృతులు ఏడాది కేసులు మృతులు 2014 78 8 2015 2,956 100 2016 166 12 2017 2,165 21 2018 1,007 28 2019 245 0 మొత్తం 6,617 169 మహారాష్ట్రలో మరీ దారుణం... ఈ ఏడేళ్లలో మహారాష్ట్రలోనే అత్యధికంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,786 కేసులు నమోదు కాగా, 2,509 మంది మృతి చెందారు. అంతేకాదు గతేడాది 2,593 కేసులు నమోదు కాగా, 461 మంది చనిపోయారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఏడేళ్లలో 16,177 కేసులు నమోదు కాగా, 1346 మంది చనిపోయారు. గతేడాది ఈ రాష్ట్రంలో 2,375 కేసులు నమోదు కాగా, 221 మంది చనిపోయారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు 6,617 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, 169 మంది మృతిచెందారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 27 వరకు తెలంగాణలో అత్యధికంగా 245 కేసులు నమోదయ్యాయి. ఎవరూ చనిపోలేదని కేంద్రం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ 2014 నుంచి ఇప్పటివరకు 1,208 మందికి ఫ్లూ సోకగా, అందులో 79 మంది చనిపోయారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించకపోవడం, నియంత్రణ చర్యలు కొరవడటమే వైరస్ విస్త్రృతి కావడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 2012 నుంచి ఇప్పటి వరకు ‘ఫ్లూ’ కేసులు- 19,786 మహారాష్ట్రలో 2012 నుంచి ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ మృతులు- 2,509 -
నందాదేవి.. ఓ మిస్టరీ.. పొంచి ఉన్న అణు ముప్పు!!
ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు మన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాపై నిఘా పెట్టడానికి హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణులకు తరలించిన అణు పరికరం.. భవిష్యత్తులో ఏం ప్రకంపనలు రేపుతుందోనని గుబులు రేపుతోంది. మంచులో కూరుకుపోయిన దాని జాడ పసిగట్టేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. మరోవైపు ఆ సీక్రెట్ ఆపరేషన్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. అసలు అప్పుడేం జరిగింది ? మనకు పొంచి ఉన్న ముప్పేంటి ? 53 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే... అది 1964 సంవత్సరం. చైనా తొలిసారిగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పెద్దన్న అమెరికాకు దడ పుట్టించింది. దీంతో చైనా అణుపాటవం తెలుసుకోవడానికి హిమాలయాల్లో సెన్సార్లు ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. దీనికి భారత్ సహకారం కోరింది. అనాలోచితంగా భారత్ దీనికి అంగీకరించింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్తంగా చైనా అణుకార్యకలాపాలపై హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణుల నుంచి నిఘా పెట్టడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలకు చెందిన సిబ్బంది అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ప్లుటోనియం క్యాప్సూల్స్, ఏంటెనాలు ఏర్పాటు చేయడానికి 1965 జూన్ 23న అలాస్కాలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో నందాదేవి శ్రేణులకు వెళ్లారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్, క్యాప్సూల్స్‌ను అక్కడే విడిచి వచ్చేశారు. వాతావరణం చక్కబడ్డాక తిరిగి వెళ్లి చూస్తే అవి అక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయా యి. వాటిని అలాగే వదిలేస్తే ప్రమాదం ఉంటుందని భావించిన ఈ బృందం తిరిగి 1966, 67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించాయి. కానీ లాభం లేకుండా పోయింది. అవెక్కడున్నాయో కనిపెట్టలేకపోయారు. అది రహస్య ఆపరేషన్ కావడంతో చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. అయితే అప్పట్లో భారత్ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్సింగ్ కోహ్లి మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడాయనకు 88 ఏళ్లు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున పరికరాల జాడ కనిపెట్టాలంటున్నారు. క్యాప్సూల్స్‌తో ప్రమాదం ఎలా ? ప్లుటోనియం క్యాప్సూల్స్ జీవితకాలం వందేళ్లు. ఆ తర్వాత అవి కరిగిపోతాయి. ఇప్పటికే 53 ఏళ్లు గడిచిపోగా మరో 47 ఏళ్లే మిగిలి ఉంది. గంగానదికి అణు ముప్పు ప్లుటోనియం క్యాప్సూల్స్ ఒకవేళ కరిగిపోయి రిషి గంగలో కలిస్తే పవిత్ర జలాలన్నీ కలుషితమైపోతాయి. ఆ నీటిని వినియోగిస్తే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న ప్రజలు రేడియేషన్ బారినపడే అవకాశం ఉంది. ఇప్పుడేం చేస్తారు? ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పల్ మహరాజ్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి గంగానదికి ఉన్న అణుముప్పు గురించి వివరించారు. ప్లుటోనియం క్యాప్సూల్స్‌ను వెలికితీయకపోతే 40ఏళ్ల తర్వాత పెను ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాడార్లు, సెన్సార్ల ద్వారా 10–15 అడుగుల లోతైన మంచు పొరలను తొలిచి ఆ పరికరాల జాడ కనుగొనాలని కోరారు. ఇందుకు కేంద్రం ఓకే చెప్పింది. తెరకెక్కనున్న హాలీవుడ్ సినిమా... స్మోక్ సిగ్నల్స్, హోమ్ ఎలోన్ వంటి చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ నిర్మాత స్కాట్ రోజెన్ఫెల్ట్ని ఈ సీక్రెట్ మిషన్ విపరీతంగా ఆకర్షించింది. కెప్టెన్ కోహ్లి ఈ ఆపరేషన్‌పై స్పైస్ ఇన్ హిమాలయాస్ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం హక్కుల్ని రోజెన్‌ఫెల్ట్ పదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ బడ్జెట్ సరిపోక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మలబెర్రి ఫిలిమ్స్, రోజెన్‌ఫెల్ట్ సంయుక్తంగా 2 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్‌లో పాల్గొన్న పలువురిని రోజెన్‌ఫెల్ట్ కలసి వారు చెప్పిన అనుభవాలతో ఆపరేషన్ నందాదేవిని తెరకెక్కిం చనున్నారు. భారత్ సిబ్బంది పాత్రల్లో భారతీయులనే తీసుకోనున్నారు. కెప్టెన్ కోహ్లి పాత్రకు రణబీర్‌ను సంప్రదించినట్టు సమాచారం. -
వాతావరణ హెచ్చరికలకు ఐఎండీ–బీఎస్ఎన్ఎల్ జట్టు
న్యూఢిల్లీ: దేశంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజల్ని హెచ్చరించేందుకు వీలుగా భారత వాతావరణశాఖ(ఐఎండీ) సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రజలకు ముందస్తు అలర్ట్స్ పంపేందుకు బీఎస్ఎన్ఎల్తో ఐఎండీ జట్టుకట్టినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వాతావరణ శాఖ తమకు కచ్చితమైన అలర్ట్స్ పంపడం లేదని ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించిన నేపథ్యంలో ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలకు వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ పంపేందుకు ఐఎండీ, బీఎస్ఎన్ఎల్ కలసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఐఎండీ ఓ అలర్ట్‌ను పంపిస్తే.. దాన్ని బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులందరికీ పంపిస్తుంది. ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉంది’ అని చెప్పారు. -
మీ ముక్కు సైజును నిర్ణయించేది ఇదే!!
న్యూయార్క్: అప్పుడే పుట్టిన పిల్లల్లో పోలికలను పరిశీలించేటప్పుడు ముందుగా పరిశీలించేది ముక్కునే. ఆ ముక్కును చూసే తండ్రిలా ఉన్నాడు.. తల్లిలా ఉన్నాడు.. అచ్చం తాతయ్య పోలికలే.. అని చెబుతుంటారు. అయితే ముక్కు పరిమాణాన్ని, ఆకారాన్ని నిర్ణయించేవి వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కావని, స్థానిక వాతావరణ పరిస్థితులే మన ముక్కు పరిమాణం, ఆకారాన్ని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం తెలిసింది. స్థానిక వాతావరణంలోని గాలిలో నీటి ఆవిరి, ఉష్ణోగ్రత వంటివి ముక్కు పరిమాణాన్ని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, గాలిలో నీటిఆవిరి పరిమాణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారి ముక్కు కాస్త వెడల్పుగా ఉంటుందని, ఆర్ధ్రత తక్కువగా ఉండి, శీతల ప్రాంతాల్లో నివసించేవారి ముక్కు వెడల్పు తక్కువగా ఉండి, పొడవుగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవపరిణామక్రమంలో వచ్చిన మార్పు కారణంగానే ఇలా ఆకారాలు, పరిమాణాల్లో మార్పులు సంభవిస్తున్నాయని చెప్పారు. -
ఆలస్యంగా వెళ్తున్న రైళ్లు, విమానాలు
-
‘నీటి ఇంజెక్షన్’తో తీరును ఇక్కట్లు!
మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షం కురిసే రోజులు తగ్గిపోవడమే కాకుండా తుపాన్ల వల్ల లేదా అకాలంగా వచ్చే కుండపోత వర్షాల సంఖ్య పెరుగుతోంది. కుండపోత వర్షాల సమయంలో ఆ నీటిని చప్పున భూగర్భంలోకి ఇంకింప జేసుకుంటే.. తదనంతరం కొన్ని నెలల పాటు సాగు నీటి కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు. పొలాల్లో వాలుకు అడ్డంగా ఖండిత కందకాలు (మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు) తవ్వుకుంటే అదాటుగా పెద్ద వర్షాలు పడినప్పుడు కూడా వాన నీటిని పొలం నుంచి బయటకు పోకుండా చాలా వరకు భూమిలోకి ఇంకేలా చేయవచ్చని మనకు తెలుసు. నీటి వాలులో ఉన్న బోర్ల చుట్టూ ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకుంటే వాన నీటిని కొంతమేరకు ఇంకింపజేసుకోవచ్చనీ మనకు తెలుసు... అయినా, అదాటుగా వచ్చే కుండపోత వర్షాల నీరు ఎక్కువ శాతం పొలాల బయటకు కొట్టుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కొట్టుకుపోయిన వాన నీరు పొలాల పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీటి మడుగులు ఏర్పడుతుంటాయి. అలా నీటి మడుగులోకి చేరిన నీటిని భూమిలోకి ఇంకింపజేసే (ఇంజెక్ట్ చేసే) ఏర్పాట్లు చేసుకుంటే.. రెండు పంటలకూ నీటి కొరతే ఉండదని బిప్లవ్ కేతన్ పాల్ చెబుతున్నారు. గుజరాత్‌కు చెందిన పాల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఇందుకు ఉపకరించే ఒక పద్ధతిని ఆవిష్కరించారు. దీనికి ‘భుంగ్రు’ అని పేరు పెట్టారు. గుజరాతీ భాషలో దీని అర్థం ‘నీటిని పీల్చుకునే గొట్టం’ అని అర్థం. అతి చిన్న కమతాలున్న ఐదుగురు మహిళా రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి.. బృందానికి ఒకటి చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయంతో వందలాది భుంగ్రులను నెలకొల్పారు. మడుగుల్లోకి చేరే వాన నీటిని లేదా వరద నీటిని పీవీసీ గొట్టం ద్వారా భూమికి తాపి (ఇంజెక్ట్ చేసి).. కరువు కాలంలో ఆ నీటిని మోటారు ద్వారా తోడుకొని నిక్షేపంగా రెండు పంటలు పండించుకొని అధిక నికరాదాయం పొందవచ్చని రుజువు చేశారు. ఒక్కో భుంగ్రు 15 ఎకరాలకు రెండు పంటలకు నీరందిస్తుంది. 18 వేలకు పైగా చిన్న కుటుంబాలు వీటి ద్వారా ఆహార భద్రతను సాధించి పేదరికాన్ని జయించాయని ఆయన చెబుతున్నారు. పొలాల్లో భూమి పైపొర వాన నీటిని ఇంకింపజేసుకోలేనంత గట్టిగా మారిన భూముల్లో కుండపోత వానలు లేదా వరదలు వచ్చినప్పుడు ఈ పద్ధతి ద్వారా నీటిని భూమిలోకి ‘ఇంజెక్ట్’ చేసుకోవడం ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. భూమి చౌడు బారి, భూమి లోపలి పొరల్లో ఇసుక పాళ్లు ఎక్కువగా ఉన్న భూముల్లో కూడా ఈ పద్ధతిలో వాన నీటిని ఇంకింపజేసుకోవడం ప్రయోజనకరమని అంటున్నారు. భూమి అడుగు పొరల్లో ఉప్పు నీరు ఉన్నప్పటికీ.. పైపొర ఇసుక భూమిలో స్వచ్ఛమైన వాన నీరు నిల్వ ఉంటుందని, మోటారు ద్వారా ఈ నీటిని తోడినప్పుడు ఈ మంచినీరే అందుబాటులోకి వస్తుందని, ఆ విధంగా పంటలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తీర ప్రాంతాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ యే ప్రాంతాలకు నీటి ఇంజెక్షన్ పద్ధతి ఎంతవరకూ ఉపయోగమో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నిపుణులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వివరాలకు.. ‘భుంగ్రు’ ఆవిష్కర్త బిప్లవ్ కేతన్ పాల్‌ను 0091 98255 06900 లేదా ఛజీఞ్చఛజుఞఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. - సాగుబడి డెస్క్ -
విశాఖలో 38 డిగ్రీలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జనం విలవిల విశాఖపట్నం: కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న భా నుడు ఒక్కసారిగా విజృంభిస్తున్నాడు. ఆదివా రం తీవ్ర ఉష్ణోగ్రతలతో జనాన్ని బెదరగొట్టా డు. ఈ సీజనులో జిల్లాపై తొలిసారిగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలను వెదజల్లాడు. ఆది వారం ఉదయం నుంచే వేడి సెగలు మొదలయ్యాయి. అది సాయంత్రమయ్యే దాకా కొనసాగాయి. భా నుడి ప్రతాపానికి జనం తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మధ్యాహ్నం అయ్యే సరికి తట్టుకోలేకపోయారు. ముఖానికి దుస్తులు చుట్టుకుని కొందరు, గొడుగులు వేసుకుని ఇంకొంద రు రాకపోకలు సాగించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించిన వారు, రోడ్ల పక్కన చిరు వ్యాపారులు ఎండ తీవ్రతకు నానా అగచాట్లు పడ్డారు. విశాఖలో ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదు కావలసి ఉంది. కానీ ఆదివారం నాలుగు డిగ్రీలు అధికంగా నమోదై 38కి చేరుకుంది. శనివారం విశాఖలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఉష్ణతాపాన్ని భరించ లేక జిల్లా వాసులు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నాళ్లు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
ఆక్వా సాగు అంపశయ్యపై..
⇒ సాగుకు సహకరించని వాతావరణం ⇒ శీతాకాలంలో పెరిగిన వ్యాధుల ఉధృతి ⇒ ఖాళీ అవుతున్న చెరువులు.. తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం ⇒ మూతపడిన రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ⇒ నాడు డాలర్లు కళ్లజూసిన రైతులు నేడు అప్పుల పాలు జిల్లాలో ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆక్వారంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా రొయ్యలకు వైట్‌స్పాట్, స్లోమార్టాల్టీ, ఇబ్రాయిసిస్ వ్యాధులు పడగనీడలా వెంటాడుతున్నాయి. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. శీతాకాలంలో రొయ్యలపై వ్యాధుల ఉధృతి మరింత పెరగడంతో రైతులకు సాగు కత్తిమీద సాములా తయారైంది. బాపట్ల: రెండు దశబ్దాల క్రితం జిల్లాలో ఆక్వారంగం టైగర్ రొయ్యల సాగు విదేశీమారక ద్రవ్యంతో డాలర్ల పంట పండించింది. ఆక్వా రైతుల ఇంట సిరుల వాన కురిపించింది. అనంతరం రొయ్యలను అంతుచిక్కని వ్యాధులు వెంటాడాయి. రొయ్యల మార్కెట్‌ను దెబ్బతినడం ప్రారంభమైంది. తొలిదశలో లక్షల రూపాయలు ఆర్జించిన రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయారు. క్రమంగా రొయ్యల సాగు విస్తర్ణం తగిపోయింది. వందలాది చెరువులు ఖాళీ అయ్యాయి. వెనామీ సాగుతో కొంత ఊరట.. ఐదేళ్ల క్రితం వచ్చిన వెనామీ రకం ఆక్వా రైతుల్లో మళ్లీ ఆశలను చిగురింపచేసింది. వ్యాధులను తట్టుకోవటంతోపాటు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈసాగువైపు అధికశాతం ఆక్వా రైతులు మొగ్గు చూపారు. రెండేళ్ల క్రితం విదేశాల్లో ఆక్వా సాగు ప్రతికూలత కారణంగా దేశీయంగా మనదేశానికి చెందిన ఆక్వా రంగానికి బాగాా కలిచొచ్చింది. రికార్డుస్థాయిలో ధరలు లభించాయి. దీంతో వేలంవెర్రిగా వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. గతంలో పాడుపడిన చెరువులు సైతం వెనామీ రొయ్యల సాగుకు నోచుకున్నాయి. ఆ తరువాత సీజన్‌కు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ధరలు పూర్తిగా పడిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయ్యారు. మళ్లీ ఇప్పుడు శీతాకాలం సాగు వెనామీ సాగుకు ప్రతికూలంగా మారింది. వెనామీపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. తట్టుకోలేని విధంగా ఈరకంపై వైట్‌స్పాట్ విజృంభించటంతో చెరువులు నామరూపాల్లేకుండాపోతున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు ప్రస్తుత తరుణంలో వెనామీ సాగు చేసి హెక్టారుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. మళ్లీ టైగర్ వైపు చూపు.. వెనామీ రొయ్యకు ప్రతికూల పరిస్థితులు వెన్నాడటంతో శీతాకాలం రొయ్యల సాగుకు స్వస్తి చెబుతున్నారు. చెరువులు ఆరబెట్టి మళ్లీ మేలురకం టైగర్ రొయ్యపిల్లతో సాగు చేసేందుకు చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు. రొయ్యపిల్లలు ఉత్పత్తి రాష్ర్టంలో ఆశించిన మేర అందుబాటులో లేకపోవటంతో పాండిచ్చేరి ప్రాంతం నుంచి టైగర్ రొయ్యపిల్లలను తెచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. దీని కోసం ఒక్కొక్క పిల్లను 40 నుంచి 60 పైసలు చెల్లించి దిగుమతి చేసుకునేందుకు ముందుగానే ఆడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఊరిస్తున్న ధరలు.. ఆక్వా రంగంలో ఉత్పత్తి గణనీయంగా ఉంటే ధరలు పడిపోతున్నాయి. ధరలు గణంగా ఉంటే ఉత్పాత్తి నామమాత్రంగా ఉంటుంది. ఈదశలో రైతాంగం కొట్టుమిట్టాడటంతోపాటు ధరలను దళారీలు నిర్ణయిస్తున్నారు. రైతులు పండించిన రొయ్యలకు ధర విషయంలో భరోసా లేకుండాపోతుంది. ప్రస్తుతం వెనామీ 30 కౌంట్ ధర రూ.500 నుంచి రూ.540 పలుకుతోంది. అదే 40 కౌంట్ ధర రూ.450, 50 కౌంట్ వస్తే రూ.400పైనే ధర ఉంది. అయితే ప్రతికూల వాతావరణం వైట్‌స్పాట్ వ్యాధి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. పెట్టుబడులు తేలక రైతులు నష్టాలబాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం లేదు ప్రభుత్వం నుంచి ఆక్వారంగానికి ప్రోత్సాహం లేదు. విదేశీమారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈరంగంపై చిన్నచూపు చూస్తోంది. సూర్యలంకలో రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం మూలన పడిపోయింది. గత ప్రభుత్వం హయాంలో బాపట్ల మార్కెట్‌యార్డులో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని పంపిన ప్రతిపాదనలు పురోగతికి నోచుకోలేదు. రొయ్యలకు సోకే వ్యాధులకు సంబంధించి నిర్ధారణ చేసే ప్రభుత్వ నిపుణులు లేక ప్రైవేటు నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆక్వా చెరువులో రహదారి మార్గాలు సక్రమంగా లేకపోవటం, మురుగునీటి పారుదల ఇబ్బందిగా ఉండటంతో వ్యాధులు త్వరగా సోకుతున్నాయి.ప్రభుత్వం ఆక్వా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. - మంతెన గంగరాజు, ఆక్వా రైతు సబ్సిడీపై సోలార్ పంపు సెట్లు ఆక్వారంగాన్ని ప్రోత్సాహించేందుకు, విద్యుత్ సమస్యను నివారించేందుకు సోలార్పంపుసెట్లను 85శాతం సబ్సిడీ రైతులకు అందిస్తున్నాం. రూ.4.80లక్షలు విలువ చేసే సోలార్పంపుసెట్లుకు కేవలం 15శాతం రైతు చెల్లించగలిగితే ఆయూనిట్ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం.రూ. 40విలువ చేసే ఎరియేటర్లు ఒక రైతుకు నాలుగు 50శాతం సబ్సిడీపై అందిస్తారు. రూ.16వేలు విలువ చేసే సొలార్లైట్ 50శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తాం. - ఉషాకిరణ్, ఎఫ్‌డీవో -
మున్ముందు ముప్పే
పడిపోతున్న భూగర్భ జలాలు మారిన వాతావరణ పరిస్థితులతో కరువు ఛాయలు ‘‘నిండుకుండలా కళ కళలాడే చెరువులు... ఇప్పుడు వెలవెలబోతున్నారుు. అలలతో అలరించే జలాశయూలు.. బావురుమంటున్నారుు. పంట పొలాలతోపాటు నిత్యావసరాలకు అండగా నిలిచే నీటి వనరులు ప్రకృతి ప్రకోపానికి కరిగిపోతున్నారుు. ఫలితంగా రానున్న రోజుల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం అరిగోస పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ మార్పులతో నీటి ఎద్దడి నెలకొంటుందని.. కాలగమనంలో విపత్కర పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. జిల్లాలో గణనీయంగా పడిపోతున్న భూగర్భజలాలపై ప్రత్యేక కథనం