ఖమ్మం వ్యవసాయం: వాతావరణ పరిస్థితులను నియంత్రించి నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే ఆధునిక గ్రీన్‌హౌస్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే, నాగపూర్ వంటి నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో గ్రీన్‌హౌస్‌లలో ఉద్యానపంటలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆధునిక విధానాన్ని రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాలన్నింటికీ విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి జిల్లాలోని నేలలూ అనువైనవిగా ఉద్యానశాఖ గుర్తించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దగ్గరలో ఉండటం, రేల్వే రవాణా సౌకర్యం ఉండటం, ఖమ్మంతో పాటు విజయవాడ, వరంగల్ వంటి నగరాలు సమీపంలో ఉండటంతో గ్రీన్‌హౌస్ విధానానికి మన జిల్లా అనుకూలమని గుర్తించారు. కూరగాయలు, పూల సాగుకు ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. గ్రీన్‌హౌస్‌లకు రాయితీలు, వాటి వల్ల రైతులకు ఉపయోగాల గురించి ఉద్యానశాఖ ఉపసంచాలకులు కె.సూర్యనారాయణ -83744 49066 వివరించారు.
గ్రీన్‌హౌస్‌లతో ఉపయోగాలు
పూలసాగు దిగుబడి 10-12 రెట్లు అధికంగా (ఆరుబయట సాగుతో పోలిస్తే) ఉంటుంది.
జెర్బెరా, కార్నేషన్స్, గులాబి వంటి పంటలకు గీన్‌హౌస్‌లు ఎంతో అనువైనవి.
సంవత్సరం పొడవునా పూలు, కూరగాయల వంటివి సాగు చేయవచ్చు.
వివిధ రకాల శిలీంద్రాలు, కీటకాల నుండి పంటలకు రక్షణ ఉంటుంది.
ఎరువులు, పురుగు మందులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
నీటి వినియోగం తక్కువగా ఉండటమేగాక, డ్రిప్, ఫాగర్స్ ద్వారా నీటి యాజమాన్యాన్ని చేపట్టవచ్చు.
గ్రీన్‌హౌస్‌ల ద్వారా ఉద్యాన సాగు లాభదాయకం.
ఈ విధానంలో ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు చేయూతనిస్తుంది
ఒక రైతుకు సుమారు 4000 చ.మీ వరకు రాయితీ ఇస్తారు.
పూల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు నీరు, భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి.
రైతులు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసుపుస్తకం నకలు, రేషన్‌కార్డునకలు, బ్యాంక్ ఖాతా నకలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో వివరాలతో అందుబాటులోని ఉద్యాన అధికారిని సంప్రదించాలి.
గ్రీన్‌హౌస్‌ల ద్వారా పూలసాగుకు ఎంపికైన రైతులకు వారం రోజుల పాటు పూర్తి శిక్షణ ఇస్తారు. గ్రీన్‌హౌస్‌లు నిర్మించే ప్రతి దశలోనూ ఫొటోలు తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుకు రావల్సిన రాయితీ మొత్తాన్ని గ్రీన్‌హౌస్ నిర్మించిన తరువాత వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 10,000 చ.మీ
‘గ్రీన్‌హౌస్’కు ప్రోత్సాహం
Published Fri, Oct 3 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement