
దానిమ్మ జీవితం..
ఒంట్లో పెరిగిపోతున్న కొవ్వు, మానసిక ఆందోళనలు, మారిన వాతావరణ పరిస్థితులు వెరసి మనిషి గుండెకు ఎప్పుడైనా ముప్పు తీసుకురావొచ్చు. పిడికెడు గుండె గుండ్రాయిలా గట్టిగా ఉండాలంటే ప్రతి రోజూ ఓ సగం గ్లాస్ దానిమ్మగింజల జ్యూస్ పుచ్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ జ్యూస్‌తో పాటు రోజుకు మూడంటే మూడు కర్జూర ఫలాలు సేవించడం మరచిపోవద్దని సూచిస్తున్నారు.
కర్జూరలో గుజ్జుతో పాటు అందులోని గింజను కూడా తినేసి అరాయించుకుంటే మీ గుండె పది కాలాలు పదిలంగా ఉంటుందని తెలిపారు. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. ఎందుకాలస్యం దానిమ్మ జ్యూస్, కర్జూర ‘ఫల’హారానికి సిద్ధమైపోండి.