విశాఖలో 38 డిగ్రీలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జనం విలవిల
విశాఖపట్నం: కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న భా నుడు ఒక్కసారిగా విజృంభిస్తున్నాడు. ఆదివా రం తీవ్ర ఉష్ణోగ్రతలతో జనాన్ని బెదరగొట్టా డు. ఈ సీజనులో జిల్లాపై తొలిసారిగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలను వెదజల్లాడు. ఆది వారం ఉదయం నుంచే వేడి సెగలు మొదలయ్యాయి. అది సాయంత్రమయ్యే దాకా కొనసాగాయి. భా నుడి ప్రతాపానికి జనం తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మధ్యాహ్నం అయ్యే సరికి తట్టుకోలేకపోయారు. ముఖానికి దుస్తులు చుట్టుకుని కొందరు, గొడుగులు వేసుకుని ఇంకొంద రు రాకపోకలు సాగించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించిన వారు, రోడ్ల పక్కన చిరు వ్యాపారులు ఎండ తీవ్రతకు నానా అగచాట్లు పడ్డారు.
విశాఖలో ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదు కావలసి ఉంది. కానీ ఆదివారం నాలుగు డిగ్రీలు అధికంగా నమోదై 38కి చేరుకుంది. శనివారం విశాఖలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఉష్ణతాపాన్ని భరించ లేక జిల్లా వాసులు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నాళ్లు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.