ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అవసరమైనప్పుడు కొందరికి లేఖలు కూడా రాస్తుంటారు. తాజాగా యూపీలోని ఒక యువకునికి ప్రధాని మోదీ లేఖరాశారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని మొహల్లా పిర్బతవాన్‌లో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అభయ్‌ను ప్రశంసించారు. అభయ్ గత 20 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు.
ప్రధాని మోదీ తన లేఖలో అభయ్ చంద్వాసియాను ప్రశంసించారు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని మోదీ పేర్కొన్నారు. అభయ్ తన స్వీయ రచనలోని ప్రతి పదాన్ని ప్రధాని మోదీకి అంకితం చేశారు. శారీరక వైకల్యంతో మంచం మీదనే ఉంటున్నప్పటికీ అభయ్ పలు స్ఫూర్తిదాయకమైన రచనలు సాగించాడు. అవి చదివినవారు వీటిని రాసిన వ్యక్తి శారీరక వైకల్యంతో బాధపడుతూ, కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైనవాడంటే ఎవరూ నమ్మలేరు.
ప్రధాని నరేంద్ర మోదీపై అభయ్‌కు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి, నాయకత్వ సామర్థ్యాలను వర్ణిస్తూ కవిత్వం రాశాడు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ అభయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నుంచి లేఖ రావడంపై అభయ్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment