
కారు డ్రైవింగ్‌లో భళా!
పదేళ్లప్రాయంలోనే ఓ బుడతడు కారుడ్రైవింగ్ చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటూ ఎస్సీ అభివృద్ధి శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కుమారుడు మణికంఠ అలవోకగా డ్రైవింగ్ చేస్తూ ఔరా! అనిపిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం సాధారణ విషయమే అయినా ఇంతటి చిన్న వయస్సులో కారు నడపడం అసాధారణమే.. ఆ చిన్నాడికి తండ్రి దగ్గరుండి అన్నీతానై నేర్పిస్తున్నాడు. డ్రైవింగ్ అంటే మహాఇష్టమని చెబుతున్న మణికంఠ ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. - జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)