మహిళా పీజీలో దుర్మార్గం.. రహస్యంగా నగ్న వీడియోలు | In Bengaluru, Man Caught for filming women in PG Bathroom | Sakshi
Sakshi News home page

మహిళా పీజీలో దుర్మార్గం.. రహస్యంగా నగ్న వీడియోలు

Dec 10 2022 3:07 PM | Updated on Dec 10 2022 3:07 PM

In Bengaluru, Man Caught for filming women in PG Bathroom - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు: నగరంలో పీజీలో ఉంటున్న యువతుల నగ్న దృశ్యాలు మొబైల్లో వీడియో తీసి వారిని లైంగికంగా వేధిస్తున్న కామాంధుడిని ఆగ్నేయ విభాగ సీఈఎన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బొమ్మనహళ్లిలో నివసిస్తున్న పాండిచ్చేరికి చెందిన నిరంజన్‌ పట్టుబడిన నిందితుడు.  

పీజీ పక్కనే ఇంటిలో ఉంటూ...  
నిందితుడు నిరంజన్‌ మహిళల పీజీ పక్కనే మరో పీజీలో ఉంటున్నాడు. అక్కడ పీజీలో యువతులు స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో రహస్యంగా తన గది నుంచి వీడియో తీసేవాడు. అనంతరం వారి నెంబర్లకు వీడియో పంపించి కలవాలని ఒత్తిడి తెచ్చేవాడు. వినకపోతే వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించేవాడు.

దీంతో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కామాంధుడు నిరంజన్‌తో చాట్‌ చేశారు. మీ డిమాండ్‌కు ఒప్పుకుంటున్నామని యువతుల మొబైల్‌ ద్వారా మెసేజ్‌ పంపించారు. నిజంగా యువతులు సెక్స్‌కు ఒప్పుకున్నారని నిరంజన్‌ హోటల్‌కు వెళ్లడంతో  ఈ సమయంలో ఆగ్నేయ విభాగ సీఈఎన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

పీజీ నిర్వాహకుడితో నమ్మకంగా ఉంటూ చెత్త పనులు  
నిరంజన్‌ నాలుగేళ్లుగా బొమ్మనహళ్లి పీజీలో ఉంటున్నాడు. పీజీ యజమానితో ఆత్మీయంగా ఉండేవాడు. ఇతను మహిళా పీజీ  నిర్వహిస్తున్నారు. తల్లి పంపించే డబ్బుతో ఎంజాయ్‌ చేసే నిరంజన్‌ పీజీకి సంబంధించిన ఏ పనైనా దగ్గర ఉండి చేసేవాడు. దీంతో మహిళల పీజీలో దర్జాగా సంచరించేవాడు. ఇదే సమయంలో పీజీలో యువతుల కదలికలపై నిఘా పెట్టాడు. యజమాని ఇచ్చిన చనువుతో నిరంజన్‌ మహిళా పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేసే సమయంలో రహస్యంగా మొబైల్‌లో నగ్న దృశ్యాలు తీసేవాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.    

చదవండి: (బుద్ధి మారని ఉపాధ్యాయుడు.. వాట్సాప్‌లో హనీమూన్‌ గురించి విద్యార్థినితో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement