mobile video
-
పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్.. ఆకతాయి అరెస్ట్
యశవంతపుర: పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్ వీడియో తీయడానికి యత్నించిన యువకుడిని ఉడుపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపికి సమీపంలోని ముల్కి పక్షికరెకి గ్రామానికి చెందిన సుమంత్ (22)ని అరెస్ట్ చేశారు. నిందితుడు పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్ దాచి పెట్టాడు. అదే సమయంలో యువతి అన్న బాత్రూమ్కు వెళ్లగా మొబైల్‌ను గమనించాడు. విచారించగా మొబైల్ సుమంత్దిగా గుర్తించారు. అతని ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
రాయలచెరువు పీహెచ్ సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకుంటుండగా సెల్ ఫోన్ తో చిత్రీకరణ
-
మహిళా పీజీలో దుర్మార్గం.. రహస్యంగా నగ్న వీడియోలు
సాక్షి, బెంగళూరు: నగరంలో పీజీలో ఉంటున్న యువతుల నగ్న దృశ్యాలు మొబైల్లో వీడియో తీసి వారిని లైంగికంగా వేధిస్తున్న కామాంధుడిని ఆగ్నేయ విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మనహళ్లిలో నివసిస్తున్న పాండిచ్చేరికి చెందిన నిరంజన్ పట్టుబడిన నిందితుడు. పీజీ పక్కనే ఇంటిలో ఉంటూ... నిందితుడు నిరంజన్ మహిళల పీజీ పక్కనే మరో పీజీలో ఉంటున్నాడు. అక్కడ పీజీలో యువతులు స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో రహస్యంగా తన గది నుంచి వీడియో తీసేవాడు. అనంతరం వారి నెంబర్లకు వీడియో పంపించి కలవాలని ఒత్తిడి తెచ్చేవాడు. వినకపోతే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించేవాడు. దీంతో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కామాంధుడు నిరంజన్‌తో చాట్ చేశారు. మీ డిమాండ్‌కు ఒప్పుకుంటున్నామని యువతుల మొబైల్ ద్వారా మెసేజ్ పంపించారు. నిజంగా యువతులు సెక్స్‌కు ఒప్పుకున్నారని నిరంజన్ హోటల్‌కు వెళ్లడంతో ఈ సమయంలో ఆగ్నేయ విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీజీ నిర్వాహకుడితో నమ్మకంగా ఉంటూ చెత్త పనులు నిరంజన్ నాలుగేళ్లుగా బొమ్మనహళ్లి పీజీలో ఉంటున్నాడు. పీజీ యజమానితో ఆత్మీయంగా ఉండేవాడు. ఇతను మహిళా పీజీ నిర్వహిస్తున్నారు. తల్లి పంపించే డబ్బుతో ఎంజాయ్ చేసే నిరంజన్ పీజీకి సంబంధించిన ఏ పనైనా దగ్గర ఉండి చేసేవాడు. దీంతో మహిళల పీజీలో దర్జాగా సంచరించేవాడు. ఇదే సమయంలో పీజీలో యువతుల కదలికలపై నిఘా పెట్టాడు. యజమాని ఇచ్చిన చనువుతో నిరంజన్ మహిళా పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేసే సమయంలో రహస్యంగా మొబైల్లో నగ్న దృశ్యాలు తీసేవాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బుద్ధి మారని ఉపాధ్యాయుడు.. వాట్సాప్‌లో హనీమూన్ గురించి విద్యార్థినితో..) -
బిహార్‌లో రెచ్చిపోయిన మృగాళ్లు
జెహానాబాద్: బిహార్‌లోని జెహానాబాద్‌లో మృగాళ్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ బాలికపై ఎనిమిది మంది నీచులు వేధింపులకు పాల్పడ్డారు. తనను ఏమీ చేయవద్దని వేడుకున్నా, కనికరం లేకుండా వారు బాలిక దుస్తులను చించివేశారు. అనంతరం ఆమె కాలును పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ వారి ఆగడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, సరికదా దానిని మొబైల్లో వీడియోలు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. మొత్తం నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ఒకరు మైనర్ అని పట్నా ఐజీ ఖాన్ తెలిపారు. -
స్నానం చేస్తుండగా... సెల్ ఫోన్లో చిత్రీకరించాడని...
కర్ణాటక : యువతులు నదీ స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి చెట్టు చాటు నుంచి తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అది గమనించిన ఓ యువతి మిన్నకుండి పోలేదు. ధైర్యంగా అతడిని పట్టుకుని చెప్పుతో చితక్కొట్టింది. మహిళా దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటన తాలూకూ దృశ్యాలు వాట్సాప్‌లోకి వచ్చి చేరడంతో మహిళా దినోత్సవం సందర్భంగా యువతి సాహసాన్ని అభినందిస్తూ సామాజిక అనుసంధాన వేదికలో పలువురు ఆ దృశ్యాలకు లైకులతోపాటు అభినందనలు తెలుపుతున్నారు. బెంగళూరుకు చెందిన కొందరు యువతులు ఆదివారం మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణానికి విహార యాత్రకు వెళ్లారు. స్థానిక కావేరి సంగమంలో స్నానం చేశారు. ఆ సమయంలో చెట్టుపైకి చేరుకున్న ఓ యువకుడు... నదిలో యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించాడు. ఓ యువతి చెట్టు చాటున దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను కూడా చిత్రీకరించాడు. ఆ విషయాన్ని గమనించిన ఆ యువతి వెంటనే సమీపంలో ఉన్న వారి స్నేహితులను అప్రమత్తం చేసింది. దాంతో ఆకతాయి యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో అతడిని పట్టుకుని... సదరు యువతి తన కాలి చెప్పుతో దేహశుద్ధి చేసింది. యువకుడి దుశ్చర్యను గమనించిన ఆ యువతి వెంటనే సమీపంలో ఉన్న వారిని అప్రమత్తం చేసింది. యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా... అక్కడున్న వారి సాయంతో అతడిని పట్టుకున్న యువతి తన కాలి చెప్పుతో దేహశుద్ధి చేసింది. ఈ దృశ్యాలు స్థానికులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించి... వాట్సాప్‌లో పెట్టారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువకుడు మండ్య తాలుకా మేళాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.