జెహానాబాద్: బిహార్‌లోని జెహానాబాద్‌లో మృగాళ్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ బాలికపై ఎనిమిది మంది నీచులు వేధింపులకు పాల్పడ్డారు. తనను ఏమీ చేయవద్దని వేడుకున్నా, కనికరం లేకుండా వారు బాలిక దుస్తులను చించివేశారు. అనంతరం ఆమె కాలును పట్టుకుని ఈడ్చుకెళ్లారు.
ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ వారి ఆగడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, సరికదా దానిని మొబైల్‌లో వీడియోలు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. మొత్తం నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ఒకరు మైనర్ అని పట్నా ఐజీ ఖాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment