
యశవంతపుర: పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్ వీడియో తీయడానికి యత్నించిన యువకుడిని ఉడుపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపికి సమీపంలోని ముల్కి పక్షికరెకి గ్రామానికి చెందిన సుమంత్ (22)ని అరెస్ట్ చేశారు.
నిందితుడు పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్ దాచి పెట్టాడు. అదే సమయంలో యువతి అన్న బాత్‌రూమ్‌కు వెళ్లగా మొబైల్‌ను గమనించాడు. విచారించగా మొబైల్ సుమంత్‌దిగా గుర్తించారు. అతని ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment