స్నానం చేస్తుండగా... సెల్ ఫోన్లో చిత్రీకరించాడని... | woman punished to youth in karnataka | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తుండగా... సెల్ ఫోన్లో చిత్రీకరించాడని...

Published Sun, Mar 8 2015 7:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

స్నానం చేస్తుండగా... సెల్ ఫోన్లో చిత్రీకరించాడని...

స్నానం చేస్తుండగా... సెల్ ఫోన్లో చిత్రీకరించాడని...

కర్ణాటక : యువతులు నదీ స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి చెట్టు చాటు నుంచి తన సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు.  అది గమనించిన ఓ యువతి మిన్నకుండి పోలేదు. ధైర్యంగా అతడిని పట్టుకుని చెప్పుతో చితక్కొట్టింది. మహిళా దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటన తాలూకూ దృశ్యాలు వాట్సాప్‌లోకి వచ్చి చేరడంతో  మహిళా దినోత్సవం సందర్భంగా యువతి సాహసాన్ని అభినందిస్తూ సామాజిక అనుసంధాన వేదికలో పలువురు ఆ దృశ్యాలకు లైకులతోపాటు అభినందనలు తెలుపుతున్నారు.

బెంగళూరుకు చెందిన కొందరు యువతులు ఆదివారం మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణానికి విహార యాత్రకు వెళ్లారు.  స్థానిక కావేరి సంగమంలో స్నానం చేశారు. ఆ సమయంలో చెట్టుపైకి చేరుకున్న ఓ యువకుడు... నదిలో యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించాడు.

ఓ యువతి చెట్టు చాటున దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను కూడా చిత్రీకరించాడు. ఆ విషయాన్ని గమనించిన ఆ యువతి వెంటనే సమీపంలో ఉన్న వారి స్నేహితులను అప్రమత్తం చేసింది. దాంతో ఆకతాయి యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో అతడిని పట్టుకుని... సదరు యువతి తన కాలి చెప్పుతో దేహశుద్ధి చేసింది.

యువకుడి దుశ్చర్యను గమనించిన ఆ యువతి వెంటనే సమీపంలో ఉన్న వారిని అప్రమత్తం చేసింది. యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా... అక్కడున్న వారి సాయంతో అతడిని పట్టుకున్న యువతి తన కాలి చెప్పుతో దేహశుద్ధి చేసింది. ఈ దృశ్యాలు స్థానికులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించి... వాట్సాప్లో పెట్టారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువకుడు మండ్య తాలుకా మేళాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement