Sudha Murthy: ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసమే లేదు. అయితే ఇటీవల ఈమె కపిల్ శర్మ షోలో పాల్గొని తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి వెల్లడించిన సుధా మూర్తి, తాజాగా జేఆర్‌డీ టాటాకు కోపంతో లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సుధా మూర్తి 1974లో బెంగళూరులో చదువుకునే టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని చెప్పుకొచ్చింది. అయితే ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్ప్లై చేసుకోకూడదని వెల్లడించింది. ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చిందని వెల్లడించింది.
(ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు)
నోటీసులొని ప్రకటన చూసిన తరువాత జేఆర్‌డీ టాటాకు లేఖ రాసినట్లు తెలిపింది. అందులో మహిళలు అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు, 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. ప్రతి సంవత్సరం టాటా పుట్టిన రోజు సందర్భంగా మార్చి 15న తమ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చారని, అప్పుడు ఆయనను భయంతోనే దూరం నుంచి చూశానని తెలిపింది.
సుధా మూర్తి రాసిన లేఖ పనిచేసినట్లే ఉంది. అందువల్లనే టాటా సంస్థల్లో మహిళలు కూడా ముందుకు వెళుతున్నారు. దీనికి ప్రధాన పాత్ర 'సుధా మార్తి'దే అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment