Sudha Murthy: భారతదేశంలో పరిచయం అవసరంలేని పేరు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధా మూర్తి'. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా, రచయిత్రిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ నిరాడంబరంగా జీవించడం ఈమెకు మాత్రమే సాధ్యమవుతుంది. గతంలో అనేక సందర్భాల్లో ఈమె నారాయణ మూర్తితో తన ప్రయాణం గురించి వెల్లడించింది. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో విజయవంతమైన భర్తల దగ్గర భార్యలు ఎలా ఉండాలి? అనేదాని గురించి వివరించింది.
యువ పారిశ్రామిక వేత్తల భార్యలకు సూచనలు చేసే క్రమంలో నారాయణ మూర్తి లాంటి సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని డీల్ చేయడం అంత ఈజీ కాదని చెప్పింది. అంతకు ముందే నారాయణ మూర్తి మాట్లాడుతూ తాను జీవితంలో విజయం సాధించడానికి తన భార్య చాలా సహకరించిందని చెప్పారు.
సుధా మూర్తి మాట్లాడుతూ.. నిజానికి జీవితంలో సక్సెస్ సాధించాలని తపనపడే వారు సాధారణ వ్యక్తుల మాదిరిగా ఉండరు, వారికి ఇంట్లో లాజిక్ ఉండదు, ఆఫీసులో మాత్రమే లాజిక్ ఉంటుంది. కాబట్టి మీరు భార్యగా మాత్రమే కాకుండా, సెక్రటరీ, ఫైనాన్స్ మేనేజర్, నానీ, అడ్వైజర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాల్సి వస్తుంది. ఇందులో ఏదైనా తప్పితే ప్రతికూల ప్రభావం ఎదురవుతుందని వెల్లడించింది.
(ఇదీ చదవండి: మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?)
పాత రోజుల్లో కొంత మంది తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లేవారు. అక్కడ తపస్సు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. పారిశ్రామిక వేత్తలు కూడా వారి కంపెనీ కోసం తపస్సు చేస్తారు. జీవితాన్ని దాని కోసం త్యాగం చేస్తారు. కావున భార్య తప్పకుండా అన్ని విషయాలలోనూ సహకరించాలి.
(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)
ఒక స్త్రీ పురుషుడికన్నా బలంగా ఉండాలని చెబుతూ.. కంపెనీలో నారాయణ మూర్తి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు, అయితే నేను అంతకంటే స్ట్రాంగ్‌గా ఉంటానని సుధామూర్తి చెప్పుకొచ్చింది. ప్రతి భార్య మంచి మేనేజర్, అద్భుతమైన సీఈఓ, గొప్ప సహచరురాలుగా ఉండాలన్నారు. నా మాటలు భర్త కోసం త్యాగాలు చేస్తున్న భార్యలకు అంకితమని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నారాయణ మూర్తి కూడా తన భార్య సుధా మూర్తి గురించి చాలా గొప్పగా చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment