సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పీఠంపై యువరక్తం కొలువు దీరనుంది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో కొంతమంది బరిలోకి దిగితే.. సమాజసేవపై ఆసక్తితో మరికొంత మంది ఎన్నికల్లో పోటీకి దిగారు. నేరెడ్‌మెట్‌ను మినహాయిస్తే ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన 149 డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపొందిన అభ్యర్థుల్లో 78 మంది మహిళలు ఉండగా, 71 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 29 ఏళ్లలోపు వారు 10 మంది ఉండగా, 30–39 ఏళ్లలోపు వారు 43 మంది, 40–49 ఏళ్లలోపు వారు అత్యధికంగా 59 మంది, 50–59 ఏళ్లలోపు వారు 35 మంది ఉన్నారు. 60 వయసు దాటిన వారు కేవలం(లింగోజిగూడ, రియాసత్‌నగర్) ఇద్దరే ఉన్నారు. పత్తర్‌గట్టి, ఉప్పుగూడ, నవాబ్‌సాబ్‌కుంట, కవాడిగూడ, యూసూఫ్‌గూడ, సీతాఫల్‌మండీ అభ్యర్థులు అవివాహితులు. వీరంతా వైవాహిక జీవితానికి ముందే రాజకీయాల్లో అడుగుపెట్టడం గమనార్హం.
యువతతోనే మార్పు
హుడాకాంప్లెక్స్: ‘రాజకీయాలను చాలామంది బురద గుంటలా భావిస్తుంటారు. అందులోకి దిగితే ఎక్కడ తమకు అంటుకుంటుందోనని భయపడుతుంటారు. నీతి, నిజాయితీ, సేవాభావం కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల అవినీతిపరులు, స్వార్థపరులు, వ్యాపారులు, రౌడీలు రాజకీయాల్లో వస్తున్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి గెలుపొందుతున్నారు. చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యువత, ముఖ్యంగా అంకితభావంతో ప్రజలకు సేవ చేసే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వారితోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(38) అభిప్రాయపడ్డారు.
సమాజసేవపై మక్కువతో రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు ఆమె చెప్పారు. తల్లిదండ్రులది ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం. అత్తమామలది రాజకీయ నేపథ్యం. చిన్నప్పటి నుంచే నాకు రాజకీయంపై ఆసక్తి ఉంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ రోజుల్లో విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాను. ఎంఏ ఎకానామిక్స్‌లో డిస్టింక్షన్ సాధించాను. ఉన్నత చదువులు చదివిన నాకు నా భర్త అంజన్‌కుమార్ కుటుంబం ద్వారా నాకు రాజకీయ వారసత్వం లభించింది. గత ఎన్నికల్లో మా మామ, బావ పోటీ చేసి ఓడిపోయారు. అయినా వారు నిరుత్సాహపడలేదు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే సరూర్‌నగర్ డివిజన్ నుంచి పోటీ చేశాను. ఓటర్లు నన్ను ఆదరించి ఎన్నికల్లో గెలిపించారు. బంధుప్రీతి, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాసేవ చేస్తాను’ అని ఆమె వివరించారు.
క్రీడల నుంచి రాజకీయాల్లోకి..
కాప్రా: గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది సత్తాచాటిన కాప్రా సిట్టింగ్ కార్పొరేటర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ శివమణి రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటాడు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఫుట్‌బాల్ క్రీడాకారుడైన స్వర్ణరాజ్ మైనంపల్లి హన్మంతరావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం తరఫున రాష్ట్ర, జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడలో పాల్గొని తనదైన శైలిలో ఆటతీరు కనబర్చారు. కాప్రా సర్కిల్ ప్రస్తుతం పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు స్వర్ణరాజ్. డివిజన్‌లో ప్రజల సమస్యలు, తన సమస్యలుగా భావించి సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా కల్పించి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. స్వర్ణరాజ్ క్రీడాకారుడే కాకుండా రాజకీయాల్లోకి రాకముందు హార్డ్‌వేర్ ఇంజినీర్ కూడా.. యువత క్రీడల వైపు దృష్టి సారించేలా కందిగూడలో బాస్కెట్ బాల్ గ్రౌండ్ నిర్మించారు.
స్వర్ణరాజ్ శివమణి
కార్యకర్త కుటుంబం నుంచి..
అంబర్‌పేట: ఆమె తండ్రి టీఆర్‌ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త. బస్తీలో చిన్నపాటి లీడర్. పార్టీ జెండాలు మోయడం, అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేయడం చేసేవారు. ఎన్నికల సమయంలో రత్నానగర్ బస్తీలో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు. బస్తీలకు వచ్చిన నాయకులకు జైకొడుతుండేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని దగ్గరగా చూసిన దూసరి లావణ్యకు ప్రజాసేవ అంటే ఇష్టం. పెళ్లి తర్వాత భర్త దూసరి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబం సైతం అదే బస్తీలోనే నివాసం ఉండేది. భర్త శ్రీనివాస్‌గౌడ్‌కు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తతత్వం. ఎవరు ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసేవారు. భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో అతడికి అన్నివిధాలుగా ప్రోత్సాహం ఉండేది. భర్త ప్రోత్సాహంతో టీఆర్‌ఎస్ తరఫున పోటీలో దిగి విజయం సాధించారు దూసరి లావణ్య. బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని తెలిపారు.
భర్త, పిల్లలతో ..
డాక్టర్.. నుంచి కార్పొరేటర్‌గా..
బహదూర్‌పురా: బహదూర్‌పురా నియోజకవర్గం నవాబ్‌సాబ్‌కుంట డివిజన్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి షరీన్ ఖతూన్(26) రెండోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించింది. 21 ఏళ్ల వయస్సులో గ్రాడ్యుయేషన్ చేస్తూ మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది. ప్రస్తుతం డాక్టర్ ఇన్ ఫార్మసీ కోర్సు పూర్తిచేసి ఆస్పత్రిలో పనిచేస్తూనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ మజ్లిస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అటు ఉన్నత చదువులు కొనసాగిస్తూనే డివిజన్ ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. తండ్రి అన్నాన్‌తో కలిసి స్థానిక బస్తీల్లో పర్యటిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు.
నిరక్షరాస్యులు ఐదుగురే..
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఏసీల నుంచే కాకుండా పలువురు స్వతంత్రులు పోటీ చేశారు. ఇలా మొత్తం 1,122 మంది పోటీ చేశారు. వీరిలో 600పైగా గ్రాడ్యూయేట్లు ఉన్నారు. ఇప్పటి వరకు గెలుపొందిన 149 మంది అభ్యర్థుల్లో 102 మంది విద్యాధికులే. వీరిలో 80 మంది బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఉండగా, 13 మంది ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేశారు. మరో ఇద్దరు ఎంబీఏ, ముగ్గురు బీటెక్, ఒకరు ఎంటెక్, ఇద్దరు వైద్య విద్యను పూర్తి చేశారు. ఒకరు ఎంసీఏ, పదో తరగతి పూర్తి చేసిన వారు 18 మంది ఉండగా, ఇంటర్మీడియట్ చదివిన వారు 11 మంది ఉన్నారు. ఐదుగురు నిరక్షరాస్యులు ఉండగా, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుకున్న వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అంతేకాదు 2009, 2016లోని జీహెచ్‌ఎంసీ పాలకవర్గంలో విద్యావంతులు శాతం 50లోపే ఉండగా ఈ సారి ఏకంగా 68 శాతానికి పెరగడం విశేషం.
చిన్నవయసులో..
కవాడిగూడ: డిగ్రీ బీకాం చదువుతుండగానే 22 ఏళ్ల వయసులోనే ఆమెకు బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం వచి్చంది. పేద దళిత కుటుంబానికి చెందిన రచనశ్రీ తండ్రి టెంట్‌హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాదాపు 36 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీలో పనిచేసిన అనుభవం ఉంది. అతడి సేవలకు గానూ బీజేపీ రచనశ్రీని కవాడిగూడ డివిజన్ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆమె తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్యనందితపై 1,468 ఓట్ల మెజారీ్టతో ఆమె విజయం సాధించారు. రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పేదల కష్టాలపై తన తండ్రి చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూసిన అనుభవం, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసినందున వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
22 ఏళ్లకే రాజకీయాల్లోకి..
చిలకలగూడ: ప్రపంచంలోని అన్ని అంశాలను ఫింగర్ టిప్స్‌పై ఆవిష్కరిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్న గూగుల్ సంస్థ ఉద్యోగి ఆమె. 2016లో రాజకీయ రంగంలో అవకాశం రావడంతో ప్రజాసేవ చేసే ఆలోచనతో సరేనంది. కట్ చేస్తే 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున అత్యధిక మెజారీ్టతో సీతాఫల్‌మండి డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించింది సామల హేమ. అప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ స్థానికులకు మరింత దగ్గరైంది. మరోమారు అవకాశం రావడంతో విజయకేతనం ఎగురవేసింది. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం బిజినెస్ మేనేజ్‌మెంట్ అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. 22 వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె కొద్దిరోజుల్లోనే తనదైన ముద్ర వేసింది. ఉద్యోగంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో, రాజకీయాల్లోకి వచి్చన తర్వాత కూడా అంతే ఆనందంగా ఉన్నానని, చెప్పులు అరిగేలా తిరిగిన వృద్ధురాలికి ఫించను అందిస్తే ఆమె కళ్లలో కనిపించే మెరుపే నాకు అనంతమైన ఆత్మసంతృప్తి ఇస్తుందని చెప్పారు.
అతి పిన్న వయసు
చాంద్రాయణగుట్ట: జీహెచ్‌ఎంసీలోనే 2016 ఎన్నికల్లో అతి పిన్న వయసు(21)లో కార్పొరేటర్‌గా గెలుపొందిన ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్ రెండోసారి కూడా 26 ఏళ్ల వయసులో ద్వితీయ విజయాన్ని అందుకున్నాడు. మజ్లిస్, బీజేపీల నడుమ జరిగిన పోరులో 8,006 ఓట్ల మెజారీ్టతో మజ్లిస్ తరఫున విజయం సాధించారు. బీఈ చదువుతున్న సమయంలోనే మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచిన ఫహద్ ఐదేళ్ల పాటు ప్రజల మధ్యే ఉంటూ అభిమానాన్ని చూరగొని రెండోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫహద్‌కు వివాహం జరిగింది. కుల, మత, రాజకీయాలకతీతంగా చేసిన అభివృద్ధే తనకు మరోసారి అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు.
నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
మల్కాజిగిరి: ప్రజాసేవ కోసమే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు శ్రవణ్. 40 సంవత్సరాలుగా అతడి తండ్రి ఎలాంటి పదవి ఆశించకుండా బీజేపీ కార్యకర్తగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మద్దతుతో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్‌గా పోటీచేసే అవకాశం రావడంతో గెలుపొందారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆయన తెలిపారు.
నాడు రేషన్ డీలర్.. నేడు కార్పొరేటర్
అబిడ్స్: గోషామహాల్ డివిజన్‌లో అందరినోట అతడు సుపరిచితుడు. 30 సంవత్సరాలుగా గోషామహాల్ డివిజన్ పరిధిలోని ధూల్‌పేట్‌లో లాల్‌సింగ్ రేషన్ డీలర్. బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ ఓ వైపు రేషన్ షాపు నడుపుతూ.. మరోవైపు బీజేపీలో సైతం కొనసాగుతున్నాడు. గోషామహాల్ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లాల్‌సింగ్ 7,369 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ ముఖేష్‌సింగ్‌ను ఓడించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. 59 సంవత్సరాల లాల్‌సింగ్‌కు ఇద్దరు పిల్లలు. ఊహించని స్థాయిలో విజయం సాధించడంతో సంబురపడుతున్న లాల్‌సింగ్ మాట్లాడుతూ.. తాను ఇక నుంచి పూర్తిగా ప్రజాసేవలో మునిగిపోతానన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారికి అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల రూపకల్పనకు కృషి చేస్తానన్నారు.
మేనత్త, మేనల్లుడి విజయం
కుత్బుల్లాపూర్: వారు వరుసకు బంధువులు.. ఒకరు మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిస్తే.. మరొకరు రెండుసార్లు గెలిచారు. రంగారెడ్డినగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా మూడుసార్లు విజయం సాధించిన విజయ్‌శేఖర్‌గౌడ్, కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన గౌరీష్ పారిజాతగౌడ్ మేనత్త, మేనల్లుడు కావడం విశేషం. అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరోమారు సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వడంతో వీరిద్దరూ విజయం సాధించారు.
మూడుసార్లు మూడు పార్టీలు
సైదాబాద్: ఐఎస్‌సదన్ ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో ప్రతీసారి భిన్నంగా తీర్పునిస్తున్నారు. ఐఎస్‌సదన్ డివిజన్‌గా ఏర్పడిన తర్వాత నిర్వహించిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను గెలిపించారు. సైదాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న ఐఎస్‌సదన్ 2009లో చేసిన పునరి్వభజనలో భాగంగా డివిజన్‌గా ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఐఎస్‌సదన్ నుంచి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అప్పటి బీజేపీ అభ్యర్థి సామ సుందర్‌రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత 2016లో టీఆర్‌ఎస్ అభ్యరి్థగా రంగంలోకి దిగిన సామ స్వప్నాసుందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి సునీతారెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిలిచిన జంగం శ్వేతామధుకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్‌రెడ్డిపై గెలిచి విజయకేతనం ఎగురవేశారు. ఇలా డివిజన్ ఓటరు ప్రతీ గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ మార్పును కోరుకుంటూ టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యరి్థకి ఒక్కోసారి అవకాశం ఇచ్చారు.
పచ్చపార్టీకి తీవ్ర పరాభవం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే టీడీపీకి గ్రేటర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. హైటెక్ సిటీని తామే నిరి్మంచామని, చంద్రబాబు విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పారీ్టకి గ్రేటర్ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 38 ఏళ్ల పార్టీ చరిత్ర ఉన్న టీడీపీ గ్రేటర్‌వాసులు నమ్మలేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2016 జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పరాభవం పాలైంది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పూర్తిస్థాయిలో ఓటమిపాలైంది. అంతేకాదు ఆ పార్టీ అభ్యర్థులకు అన్నిచోట్లా డిపాజిట్ గల్లంతైంది. ఈ ఘోర పరాజయంతో నగరాన్ని ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు మాటల్లోని డొల్లతనం వెల్లడికావడంతో పాటు ఆ పార్టీ సంపూర్ణంగా నగర రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగైనట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దశలవారీగా కనుమరుగవుతూ వచి్చన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో తన ప్రస్థా నాన్ని అత్యంత అవమానకరంగా ముగించింది.
92 డివిజన్‌ల్లో వెయ్యిలోపు ఓట్లు
ఈసారీ గ్రేటర్ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పారీ్టకి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివిజన్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. పోటీ చేసిన 106 డివిజన్లలో 92 డివిజన్లలో వెయ్యిలోపు ఓట్లు పడ్డాయి. 14 డివిజన్లలో వెయ్యి ఓట్లు కంటే తక్కువ నమోదయ్యాయి. 65 డివిజన్లలో కేవలం 100 కంటే తక్కువ జనం ఓట్లు వేశారు. ఎస్‌సదన్‌లో టీడీపీ అభ్యరి్థకి అతితక్కువగా 22 ఓట్లు పడ్డాయి. కేపీహెచ్‌బీ డివిజన్‌లో అత్యధికంగా 2,656 ఓట్లు పడ్డాయి. బాలాజీనగర్ డివిజన్‌లో 2,252 ఓట్లు, వీవీనగర్‌లో 2,297 ఓట్లు, హైదర్‌నగర్‌లో 2,119 ఓట్లు పడ్డాయి. తక్కువగా ఘాన్సీబాజార్‌లో 54 , కూర్మగూడ 55, కిషన్‌బాగ్‌లో 71, దూద్»ౌలిలో 82 ఓట్లు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment