సాక్షి, సిటీబ్యూరో: మేయర్ ఎన్నికల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు గురువారం ఉదయం 9 నుంచి సా. 4 గంటల వరకు అమలులో ఉంటాయి.
►అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి లిబర్టీ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్ళిస్తారు.
►లోయర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు. కట్టమైసమ్మ చౌరస్తా నుంచి తెలుగు తల్లి ఫైఓవర్ మీదుగా పంపిస్తారు.
►హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని లిబర్టీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్, నిజాం కాలేజీ, అసెంబ్లీ మీదుగా పంపిస్తారు.
►బషీర్‌బాగ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు.
►తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ వైపు వాహనాలను పంపించరు. వీటిని ఇక్బాల్ మీనార్ జంక్షన్ నుంచి రవీంద్రభారతి చౌరస్తా మీదుగా మళ్లిస్తారు.
►పోలీసు కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ మీదుగా తెలుగుతల్లి చౌరస్తా వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి, ఇక్బాల్ మీనార్ వైపు నుంచి పంపిస్తారు.
జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక: ట్రాఫిక్ ఆంక్షలు
Published Thu, Feb 11 2021 9:27 AM | Last Updated on Thu, Feb 11 2021 10:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment