
కారంచేడులోని దగ్గుబాటి నివాసం వద్ద కారు దిగి ఇంట్లోకి వెళ్తున్న బాలకృష్ణ
Nandamuri Balakrishna Family Celebrations At Prakasham District: సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు వచ్చారు. అక్కాబావలైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకొనేందుకు కారంచేడులోని వారింటికి చేరుకున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ.
ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధర వచ్చినప్పటికీ.. చాలా కాలంగా బాలకృష్ణ రాలేదు. ఈ సారి బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు. గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment