
సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్యాన్ గాలి వీస్తోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దేశంలోని అన్ని సర్వే సంస్థలు చెప్తుండటం.. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో ఆయన వెన్నంటి నడుస్తున్న అశేష జనవాహినిని చూసి పచ్చ తమ్ముళ్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఫ్యాన్ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారు. ఓటమి భయంతో నిరాశలో మునిగిపోయిన టీడీపీ నేతలు ఓటర్లను అభ్యర్థించే బదులు.. దౌర్జన్యం చేసి మరీ.. ‘టీడీపీకి ఓటు వేస్తారా..! చస్తారా..!’ అని బెదిరింపులకు దిగుతున్నారు. ఎదురు మాట్లాడితే దాడులకూ తెగబడుతున్నారు.
జిల్లాలోని చీరాల మండలం కారంచేడు గేటు వద్ద తప్పతాగిన టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కారుకు అడ్డుగా నిలవడంతోపాటు టీడీపీకి ఓటు వేయాలంటూ దురుసుగా మాట్లాడారు. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. తల, మొహంపై గాయాలపాలైన జాండ్రపేటకు చెందిన శోభన్‌బాబు, నాగరాజు, రాజేంద్రబాబు చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడింది రామ్‌నగర్‌కు చెందిన వారుగా స్థానికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment