national song
-
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
రిపబ్లిక్ డే వివాదంలో అనసూయ.. ఫైనల్‌గా
Anasuya Trolled On Republic Day For Singing National Song: బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయింది అనసూయ భరద్వాజ్. ఓ పక్క గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే మరోపక్క వెండితెరపై తళుక్కుమంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా అలరించి మరింత పాపులర్ అయింది. అలాగే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడుప్పుడు పలు వివాదాలు కూడా అనసూయను పలకరిస్తూ ఉంటాయి. నెటిజన్లు ట్రోల్ చేయడం, వారికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వడం పరిపాటే. అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. క్లారిటీ ఇద్దామనుకున్న ట్రోలింగ్ ఆగట్లేదు. ఇంతకీ అనసూయ చేసిన పని ఏంటంటే.. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని పాడింది. జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్.. ఈరోజు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. ఈ కామెంట్లకు విసిగిన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్ కామెంట్‌కు 'లేదు.. నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్ అయినట్టున్నారు.' అలాగే టీ షర్ట్‌పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు 'అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్ డే' అని చెప్పింది అనసూయ. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
వివాదాస్పద బిల్లుకు హాంకాంగ్ ఆమోదం
హాంకాంగ్: చైనా జాతీయ గీతాన్ని అవమానించడం చట్ట విరుద్ధం, శిక్షార్హమని తేల్చే వివాదాస్పద బిల్లుకు గురువారం హాంకాంగ్ చట్టసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ సందర్భంగా ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో బిల్లుకు అనుకూలంగా 41 మంది ఓటేయగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. హాంకాంగ్ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, చైనాతో పోలిస్తే తమ పౌరులకు అధికంగా ఉన్న ఇతర హక్కులకు ఈ బిల్లు విఘాతమని ప్రజాస్వామ్య అనుకూలురు వాదిస్తుండగా.. చైనా జాతీయ గీతానికి సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని చైనా అనుకూలురు వాదిస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. హాంకాంగ్‌లో చైనా జాతీయ గీతమైన ‘మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్’ గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష, 50 వేల హాంకాంగ్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశముంది. బిల్లుపై ఓటింగ్ సమయంలో ప్రజాస్వామ్య అనుకూల వాదులు సభలో ఆందోళనలు జరిపారు. (చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్ మద్దతు!) -
‘ఏ పరిస్థితుల్లోనైనా ‘జై హింద్’ అనే అంటాను’
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ‘ఆస్క్ అసద్’ పేరిట ట్విటర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. గురువారం సాయంత్రం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకున్నారు. కశ్మీర్లో మూక దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కశ్మీరీలు కూడా భారత్‌లో భాగమేనని తెలిపారు. హింసను అరికట్టడం, రాంబో విధానాలను తగ్గించడం ద్వారా మాత్రమే అక్కడి పరిస్థితులను చక్కదిద్దవచ్చని అన్నారు. తమ పార్టీ అందరి కోసం పోరాడుతుందని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నదే తమ కోరిక అని పేర్కొన్నారు. అంతేకాకుండా తానెప్పుడూ జాతీయ గేయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. దానిని పౌరులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను ‘జై హింద్’ అనే అంటానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మతం పేరుతో భయం సృష్టించడం ఎప్పటికైనా ముప్పేనని చెప్పుకొచ్చారు. మీరు ప్రధాని అయితే చేసే మొదటి పని ఏమిటని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. ఉన్నదానితో తాను సంతోషంగా ఉన్నట్టు పేరొన్నారు. మీరు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అవదలచుకున్నారా అని మరో నెటిజన్ అడగ్గా.. లేదని సమాధానం ఇచ్చిన అసద్, తెలుగు రాష్ట్రాలతోపాటు, యూపీ, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. చివరిగా ఆస్క్ అసద్‌లో పాల్గొన్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతానని అన్నారు. #AskAsad Regardless of any atmosphere, I will always say Jai Hind https://t.co/xzJMpDdMGN — Asaduddin Owaisi (@asadowaisi) 7 March 2019 -
‘ఆ తప్పు చేయకపోతే దేశ విభజన జరిగేది కాదు’
కోల్‌కతా : ‘కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయం వందేమాతరాన్ని కూడా విడదీసి చూస్తుంది... తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయానికి మతం రంగు పులుముతుంద’ని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గురువారమిక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ సృష్టికర్త బంకించంద్ర ఛటర్జీ తొలి స్మారకోత్సవానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘జాతీయ గేయమైన వందేమాతరం మన దేశ భౌగోళిక సాంప్రదాయనికి నిదర్శనం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. జాతీయతకు ప్రతిరూపమైన ఈ గేయానికి మతం రంగులు పులమడం మంచిది కాదు. 1937లో కాంగ్రెస్ వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది. కానీ వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే తీసుకుంది. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఆ తప్పు చేసి ఉండకపోతే దేశ విభజన జరిగేదే కాదు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా తీసుకుంది. కేవలం ఒక మతం వారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇలా చేసింది. ఫలితంగా దేశం రెండుగా చీలిపోయింది. కాబట్టి దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే. చాలా మంది చరిత్రకారులు దేశ విభజనకు కారణం ఖిలాఫత్ ఉద్యమం, విభజించు - పాలించు విధానం అనుకుంటూ వాటిని విమర్శిస్తారు. కానీ నా వరకూ మాత్రం కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే తీసుకుని దేశ విభజనకు కారణమయ్యింది’ అన్నారు. -
అక్కడ ప్రతిరోజూ జనగణమన
జైపూర్ : జాతీయగీతం జనగణమనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న దశలో జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అపూర్వమైన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రతి రోజూ జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతాలాపనపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వారం రోజులు తరువాత ఇక్కడి అధికారులు ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారం నుంచి జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి రోజూ ఉదయం 9:50 గంటలకు జాతీయ గీతం జనగణమన, సాయంత్రం 5:55 గంటలకు జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 9:50 గంటలకు అధికారులంతా నిలబడి జనగణమన ఆలపించారు. జాతీయ గీతాలాపనపై జైపూర్ మేయర్ అశోక్ లాహోటి మాట్లాడుతూ.. జనగణమన ఆలపనతో పని ప్రారంభించడం వల్ల ఉత్తేజంతో పనిచేస్తామని తెలిపారు. -
వందేమాతరం ‘స్టేటస్’ ఏంటి?
‘వందేమాతరం’ గేయం... భారత స్వాతంత్య్రపోరాటంలో ముఖ్యభూమికను పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావోద్వేగ భూమికగా నిలిచింది. బంకిమ్ చంద్ర చటర్జీ 1876లోనే దీన్ని రాసినా... విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు కూర్చి ఆలపించడంతోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరాన్ని ఆలపించారు. అనంతర కాలంలో దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, బ్రిటిష్ పాలనపై దిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు. 1911 డిసెంబరులో ఠాగూర్ ‘జనగణమన’ను రచించారు. దీన్ని డిసెంబరు చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగష్టు 14న రాత్రి 11 గంటలకు సమావేశమైన రాజ్యాంగ సభ కూడా అజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది. ముస్లిం లీగ్ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక... వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయగీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం... బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పింపకూడదని. రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవశేపెట్టి...చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాలేదు. నాటి పెద్దలంతా కలిసి ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రకటన చేశారు... ‘జనగణమన... భారతదేశానికి జాతీయ గీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్రపోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్నీ... జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి' ► రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేమీ వందేమాతరం గేయానికి లేవు. ► డిసెంబరు 23, 1971న జాతీయ చిహ్నలకు అవమానాలను నిరోధించే చట్టాన్ని అప్పటి భారత ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాలను అవమానించడకుండా నిరోధించే నిబంధనలను ఇందులో పొందుపర్చారు. జాతీయగీతంతో సమానహోదా ఉండాల్సిన జాతీయ గేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఈ చట్టంలో ఎక్కడా లేదు. ► 1976లో ర్యాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు. వీటిని అర్టికల్ 51ఎ... లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని పేర్కొన్నారు. ఇందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు. ► జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమానహోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గత ఏడాది నవంబరులో ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ ఆర్ మొరార్కా అనే ఆయన పిల్ దాఖలు చేశారు. ► పిల్ దాఖలైన తర్వాత... ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం అలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఈ నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ప్రభుత్వం నవంబరు 22, 2016న రాజ్యసభకు తెలిపింది. ► మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు ఫిబ్రవరి 8, 2017న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్రం దాఖలు చేసిన ఆఫిడవిట్లో... ‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్టమైన స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించినట్లు కాదు’’ అని పేర్కొంది. వందేమాతరం... పాడనందుకు కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లో ‘వందేమాతరం’పై వివాదం ముదురుతోంది. ఈ నెల 28న (మంగళవారం) కార్పొరేషన్ సమావేశంలో సభ్యులందరూ లేచి నిలబడి వందేమాతరం ఆలపించడం మొదలుపెట్టారు. ఏడుగురు ముస్లిం కౌన్సిలర్లు వందేమాతరం ఆలపించడానికి నిరాకరించి.. బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. బుధవారం సమావేశమైన కార్పొరేషన్ సభ్యులు... ఈ ఏడుగురు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.. బీజేపీకి చెందిన మేయర్ హరికాంత్ అహ్లువాలియా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘మా మతం... షరియా చట్టాలు వందేమాతరాన్ని అంగీకరించవు. రాజీనామా చేయడానికైనా సిద్ధమే... కానీ వందేమాతరం ఆలపించం’ అని కౌన్సిలర్లు దివాన్జీ షరీఫ్, షాహిద్ అబ్బాసీలు అన్నారు. సభ్యత్వాలను రద్దు చేయడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జాతీయ గీతం ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయహే’ వెనక మనకు గుర్తులేని చరిత్ర ఎంతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించేందుకు పార్లమెంట్‌కు ఎంతో కాలం పట్టలేదు. కానీ జాతీయ గీతాన్ని ఎంపిక చేసుకోవడానికే దాదాపు మూడేళ్లు పట్టింది. తొలుత స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనే డిమాండ్ వచ్చింది. జాతీయ కాంగ్రెస్ ప్రతి సదస్సులో వందేమాతరం గీతాన్నే ఆలాపించేవారు. మొహమ్మద్ జిన్నా లాంటి ముస్లిం నాయకులు, ఆయన అనుచరులు కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ తర్వాత ఛాందసవాద ముస్లిం నాయకులు తమ మత విశ్వాసాలకు ఆ గీతం వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అప్పుడు వారి మనోభావాలను గౌరవించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వా 1950, జనవరి 26వ తేదీన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పుడు పార్లమెంట్లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జన గణ మన అధినాయక జయహే’ను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాటలకు సమాన హోదాను కల్పిస్తూ ఒక్కొక్కటి కచ్చితంగా 60 సెకండ్లు ఉండాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది. ఆకాశవాణి ద్వారానే ప్రచారం ఈ రెండు గీతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం 60 సెకండ్లకు మించకుండా గాత్రంతో ఒకటి, కేవలం సంగీత వాయిద్యాలతో ఒక్కటి చొప్పున అంతర్జాతీయ గీతాల బాణీలను పరిగణలోకి తీసుకొని బాణికట్టి పాడించే బాధ్యతని ఆలిండియా రేడియో (ఆకాశవాణికి)కు అప్పగించారు. గాత్ర గీతాలను పండిట్ దినకర్ కైకిని, సుమతి ముతాత్కర్తో పాడించారు. మ్యూజిక్ వర్షన్ కూడా కంపోజ్ చేశారు. వాయిద్యాల వర్షన్‌ను ప్రత్యేకంగా సైనిక బ్యాండ్‌కే పరిమితం చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు వర్షన్లను పార్లమెంట్ కమిటీ, గ్రాఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు ఆమోదించాయి. రెండు పాటల రెండు వర్షన్లను వెయ్యేసి రికార్డుల చొప్పున కాపీ చేయించాలని నిర్ణయించారు. రికార్డుకు ఓ పక్కన వందేమాతరం గాత్రాన్ని, మరోపక్క వాయిద్య గీతాన్ని, అలాగే మరో రికార్డుకు ఓ పక్క జన గన మనను, మరో పక్క మ్యూజిక్ వర్షన్ రికార్డు చేయించారు. ఆ రికార్డులను దేశంలో 800 రేడియో స్టేషన్లకు పంపించారు. ప్రతి రోజు ఆకాశవాణి ప్రాథ:కాళ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు వందేమాతరం గేయాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించారు. 1955 నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని ఆకాశవాణి పాటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జన గణ మన గీతాన్ని వినిపించాలని నిర్ణయించారు. అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇదే క్రమంలో దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేత తరగతులు ప్రారంభానికి ముందు వందేమాతరంను, తరగతులు ముగిశాక జన గన మనను పాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎంపీలకు ప్రాక్టీస్ ఆరోజుల్లో జాతీయ గీతం 60 సెకండ్లు ఉండాలంటే ఎక్కువ, తక్కువ కాకుండా కచ్చితంగా 60 సెకండ్లే ఆలాపించేవారు. అప్పట్లో ఎంపీలందరికీ జాతీయ గీతం వచ్చేది. అయితే 60 సెకండ్ల కచ్చితత్వం కోసం గాయకురాలు సుమతి ముతాత్కర్ ప్రతి శుక్రవారం పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీలకు పాడడంలో శిక్షణ ఇచ్చేవారు. (సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో)