Anasuya Trolled On Republic Day For Singing National Song: బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయింది అనసూయ భరద్వాజ్. ఓ పక్క గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే మరోపక్క వెండితెరపై తళుక్కుమంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా అలరించి మరింత పాపులర్ అయింది. అలాగే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడుప్పుడు పలు వివాదాలు కూడా అనసూయను పలకరిస్తూ ఉంటాయి. నెటిజన్లు ట్రోల్ చేయడం, వారికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వడం పరిపాటే.
అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. క్లారిటీ ఇద్దామనుకున్న ట్రోలింగ్ ఆగట్లేదు. ఇంతకీ అనసూయ చేసిన పని ఏంటంటే.. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని పాడింది. జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్.. ఈరోజు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు.
ఈ కామెంట్లకు విసిగిన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్ కామెంట్‌కు 'లేదు.. నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్ అయినట్టున్నారు.' అలాగే టీ షర్ట్‌పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు 'అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్ డే' అని చెప్పింది అనసూయ.
Comments
Please login to add a commentAdd a comment