వేసవి తాపం చల్లారి హమ్మయ్యా అనిపించే కాలం. చలచల్లగా హాయిగా ఉంటుందని ఆనందించేలోపు అంటు వ్యాధులు మనం కోసం రెడీగా ఉంటాయి. ఈ కాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ తదితర అంటువ్యాధులు ప్రబలేకాలం. ఇలాంటి కాలంలో ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు
నేరెడు పండ్లు: ఇందులో పోటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తంలో ఆకస్మికంగా పెరిగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
చెర్రీస్:
దీనిలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణం కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలోనూ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడంలో ఉపకరిస్తుంది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ ఇన్వెక్షన్ల నుంచి సునాయసంగా బయటపడే సామార్థ్యాన్ని పెంపొందిస్తాయి.
బొప్పాయి:
ఈ బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సంక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్‌లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే గాక చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
దానిమ్మ :
దానిమ్మ గింజలు:
ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన పండు. ఇందులో ముఖ్యంగా బీ విటమిన్లు, ఫోలేట్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, రక్త ప్రసరణకు సహయపడతాయి. ఈ పళ్లు హైపర్‌టెన్షన్, గుండె సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
పీచెస్:
ఈ పండ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పచ్చిగా గానీ సలాడ్‌తో గానీ కలిపి తినండి. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ ఐరన్ ఉన్నాయి. ఇది జామూన్ మాదిరి మంచి శక్తిమంతమైన పోషకాలను అందిస్తుంది.
లిచ్చి:
ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆస్తమా రోగుల శ్వాసక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి తరుచుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
పైన చెప్పిన ఈ పళ్లల్లో దేని రుచి మీకు నచ్చకపోయినా, వాటిని తినడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పండ్లను పచ్చిగా తినడం లేదా జ్యూస్ /సలాడ్‌లు, స్మూతీలు, యోగర్ట్‌లు లేదా డెజర్ట్‌లలో చేర్చి తీసుకోండి. ఇవి మీ రోజువారీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి.
(చదవండి: ఈ కాక్‌టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..)
Comments
Please login to add a commentAdd a comment