ప్రతీకాత్మక చిత్రం
వర్షాకాలం వచ్చేసింది. వాన జల్లులు హాయిని కలిగించినా ఎన్నోచర్మ, ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో పొంచి ఉంటాయనే విషయం మరచిపోకూడదు. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం వల్ల వీటినుంచి బయటపడవచ్చు. రోజువారీ ఆహారంలో కొన్ని డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డిటాక్స్ డ్రింక్స్ అంటే.. యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటే పండ్లు, కూరగాయలతో తయారు చేసిన ద్రావకం.
ఇవి శరీరంలో ఉత్పత్తయ్యే హానికర విషపదార్థాలను బయటికి పంపడానికి, రక్త శుద్ధికి, జీవక్రియను క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. తద్వారా మన చర్మకాంతి పెరగడమేకాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే 5 రకాల డిటాక్స్ డ్రింక్స్ మీకోసం..
గ్రీన్ టీ
మనకు తెలిసిన ప్రసిద్ధ డిటాక్స్ డ్రింక్స్‌లో గ్రీన్ టీ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నిమ్మ రసం
ఇంట్లో తయారు చేసుకుకోగల నిమ్మరసం శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ డ్రింక్‌లో విటమిన్ ‘సి’ నిండుగా ఉంటుంది. ఇది కేవలం సూక్ష్మజీవులు, శిలీంధ్ర సంబంధిత అంటురోగాల నుంచి కాపాడటమేకాకుండా, చర్మకాంతిని పునరుద్ధరిస్తుంది.
పసుపు కలిపిన పాలు
పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల చేకూరే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తులసి టీ
ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఔషధ మొక్క తులసి. ప్రాచీనకాలం నుంచే సంప్రదాయ వైద్య పద్ధతుల్లో తులసి వాడుకలో ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలానుగుణంగా సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తులసి ఆకులను నీళ్లలో బాగా మరిగించి, ఒడగట్టి, వేడి వేడిగా తాగాలి. ఈ హెర్బల్ టీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, రోజు మొత్తం ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
కొబ్బరి నీళ్లు
సహజమైన డిటాక్స్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ప్రసిద్ధమైనవి. ఇవి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొబ్బరినీళ్లు చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, చర్మంపై ముడతలు, గీతలు తగ్గిస్తాయి.
రోజువారి పోషకాహారంలో భాగంగా ఈ 5 రకాల డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యమైన, ప్రకాశవంతమైన చర్మసౌందర్యం మీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది!
చదవండి: Dandruff Tips: చుండ్రు సమస్యా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment