స్టాక్ మార్కెట్లు (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్‌మార్కట్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే డబుల్ సెంచరీతో అదరగొట్టిన సెన్సెక్స్ చివరివరకు అదే జోరును కంటిన్యూ చేసింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి వారాంతంలో సెన్సెక్స్ 391పాయింట్ల లాభంతో 37556 వద్ద, నిఫ్టీ116 పాయింట్లు ఎగిసి 11360 వద్ద ఉత్సాహంగా ముగిసింది. అన్ని రంగాలూ లాభపడగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. మంచివాతావరణ అంచనాలు, జీఎస్‌టీ రేట్ కట్, బలమైన త్రైమాసికి ఫలితాలు మార్కెట్లకు ఊత మిచ్చినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.
ఐబీ హౌసింగ్, యాక్సిస్, వేదాంతా, యస్‌బ్యాంక్, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, గ్రాసిమ్, హీరోమోటో, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్‌ఫ్రాటెల్, విప్రో, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంలో ఉందన్న అంచనాలతో భారీగా నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment