huge gains
-
బడ్జెట్ ముందు బుల్ దూకుడు
ముంబై: బడ్జెట్ వారాన్ని స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఆరంభించింది. రిలయన్స్(7%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1.53%) షేర్లు రాణించడంతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. మధ్యంతర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే ఆశలూ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇటీవల క్యూ3 ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం ఆశావహ అవుట్‌లుక్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి నెల రోజుల్లో(డిసెంబర్ 5, 2023 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,241 పాయింట్లు పెరిగి 71,942 ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్లు బలపడి 21,738 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, పారిశ్రామిక, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ ఇండెక్సులు 1.68%, 1.03% చొప్పున లాభపడ్డాయి. ఆసియాలో చైనా, సింగపూర్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. యూరప్‌లో బ్రిటన్, ఫాన్స్ సూచీలు అరశాతం పెరిగాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ సుమారు 2% ర్యాలీతో బీఎస్ఈలో రూ.6.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.377 లక్షల కోట్లకు చేరింది. ఇంధన షేర్లకు భారీ డిమాండ్ పశ్చిమాసియా సంక్షోభంతో ఎర్రసముద్రం నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా నవంబర్ నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న ఇంధన రంగ షేర్లకు సోమవారం అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఓఎన్జీసీ, క్యాస్ట్రోల్ 8%, రిలయన్స్, కోల్ ఇండియా 6%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, బీపీసీఎల్, గెయిల్ 4%, ఇంధప్రస్థగ్యాస్ 3%, ఆయిల్ ఇండియా, ఐఓసీ 2% షేర్లు రాణించాయి. రి‘లయన్స్’ గర్జన ఇంధన రంగ షేర్ల ర్యాలీలో భాగంగా రిలయన్స్ షేరు 7% ర్యాలీ చేసి రూ.2896 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా లాభపడి రూ. 2905 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ.1.25 లక్షల కోట్లు పెరిగి తొలిసారి రూ.19.59 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కాగా గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు మొత్తం 9% లాభపడింది. -
భారీ లాభాలు : 10100 ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు, దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడనుందన్న అంచనాల మధ్య కీలక సూచీలు రెండూ జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు ఎగిసి 34363 వద్ద, నిప్టీ 153 పాయింట్ల లాభంతో 10131వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ సాంకేతికంగా 34 వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 10100 స్థాయిని అధిగమించడం విశేషం. మార్చి 13 తరువాత మళ్లీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. బ్యాంక్ నిఫ్టీ 21వేల స్థాయిని దాటింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ లో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఆటో, మెటల్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీ లాభాలతో ఉన్నాయి. అలాగే క్యూ 4 నికర లాభం 26.5 శాతం ఎగియడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ 6 శాతం లాభాలతో వుంది. మార్చి ఫలితాలతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కూడా 6 శాతం ఎగిసింది. మరోవైపు అరబిందో ఫార్మా, బీపీసీఎల్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌తో సహా మొత్తం 15 కంపెనీలు తమ మార్చి త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నాయి. -
మార్కెట్లో దివాలీ బొనాంజా : ఎయిర్‌టెల్‌కు షాక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. సంవత్ 2076కు శుభారంభాన్నిచ్చిన ఇన్వెస్టర్లు మంగళవారం కూడా కొనుగోళ్లకు క్యూ కట్టడంతో దలాల్ స్ట్రీట్ దీపావళి మతాబులా వెలిగిపోతోంది. యుఎస్-చైనా వాణిజ్య చర్చలలో పురోగతి, ఫెడరల్ రిజర్వ్ పాలసీ రివ్యూ సమావేశాలు, 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కోత ఉండనుందని అంచనాలతోపాటు , ఉద్దీపన ప్యాకేజీ వుంటుందనే ఊహాగానాలతో వాల్ స్ట్రీట్ ఆల్-టైమ్ గరిష్టానికి చేరింది. అలాగే ఇతర ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణితో మూడు నెలల గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 430 పాయింట్లు పెరిగి 39,680 వద్ద, నిఫ్టీ 123పాయింట్లు ఎగిసి 11,751 వద్దకు చేరుకుంది. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు రికార్డు స్థాయిలను అధిగమించేందుకు చేరువలో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ఏజీఆర్ ఫీజు సుప్రీం తీర్పు నేపధ్యంలో టెలికాం రంగం నష్టపోతోంది. దీనికి తోడు ఫలితాల ప్రకటనను నవంబరు 14 కు వాయిదా వేసింది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సర్దుబాటు తదుపరి స్థూల ఆదాయం మదింపు అంశంలో స్పష్టత రావలసి ఉన్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఈ అంశంలో టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్)ను సంప్రదిస్తున్నట్లు తెలియజేసింది. ఈ దెబ్బతో ఎయిర్టెల్ 4 శాతానికిపైగా నష్టపోయింది. ప్రదానంగా బ్యాంకు, ఆటో, మెటల్ రంగ లాభాలు మార్కెట్‌ను లీడ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా కొనసాగుతుండగా, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, రిలయన్స్, టీసీఎస్, మారుతి, ఐసీఐసీఐ, బజాజ్ లాభపడుతుండగా, మరోవైపు ఎస్‌బ్యాంకు, నెస్లే, భారతి ఇన్ఫ్రాటెల్,కోల్ ఇండియా, గ్రాసిం, కోట్‌మహీంద్ర, నష్టపోతున్నాయి. -
యస్ బ్యాంకునకు ఊరట : షేరు జంప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణదాత యస్‌బ్యాంకునకు భారీ ఊరట లభించింది. ఇటీవల పాతాళానికి పడిపోయిన బ్యాంకు షేరు గురువారం నాటి ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 20శాతం ఎగిసింది. తద్వారా వరుస ఐదు రోజుల పతనానికి చెక్ పెట్టింది. బ్యాంక్ ఫైనాన్షియల్, నిర్వహణ, అంతర్గత పరిస్థితులు పటిష్టంగా ఉన్నట్లు యస్ బ్యాంక్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లిక్విడిటీ పరిస్థితులు సైతం మెరుగ్గా ఉన్నాయని స్టాక్ ఎక్చ్సేంజీ సమాచారంలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లతో భారీగా లాభపడింది. దాదాపు ఎనిమిది నెలల్లో ఇది అతిపెద్ద లాభం. ప్రమోటర్ రాణాకపూర్, తదితరులు 2.16 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంకులో వాటా 4.72 శాతానికి పరిమితమైనట్లు యస్ బ్యాంక్ ఇప్పటికే తెలిపింది. రాణా కపూర్ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. డిపాజిట్లు, నిధుల లభ్యతపై కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు ఉద్దేశ్యం పూర్తిగా తెరపైకి వచ్చాయని, కనీస మూలధన పరిమితికి మించి తమ వద్ద నిధుల లభ్యత ఉన్నట్లు తెలిపింది. షేర్ల పతనానికి అడ్డుకట్ల వేసేందుకు తక్షణ చర్యలు ప్రారంభిస్తామని ఎక్చ్సేంజీలకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. మరోవైపు బ్యాంక్‌ను కష్టాల కడలి నుంచి గట్టేక్కించే అంశంలో మేనేజ్మెంట్పై తమ పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటర్ అశోక్ కపూర్ , ఆమె కుమార్తె షాగున్ గొగోయ్ ప్రకటించడం ఇన్వస్టెర్లకు మరింత ఊతమిచ్చింది మరోవైపు బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా చేసినట్లు సీఈవో రవ్నీత్ గిల్ గురువారం ప్రకటించారు. 2004లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్యాంకులో చేరిన మోంగా తదనంతరకాలంలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగారు. కాగా మంగళవారం తనఖా షేర్లను ఇన్స్టిట్యూషన్స్ విక్రయించడంతో దాదాపు 30 శాతం పడిపోయింది. రూ. 29 వద్ద షేరు ఒక దశాబ్దం కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
అదే జోరు : సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం కూడా హుషారుగా ప్రారంభమైనాయి. కార్పొరేట్ పన్ను కోత నేపథ్యంలో గత వారాంతంలో రికార్డుల లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు ఈ రోజూ అదే జోరును కంటిన్యూ చేశాయి. సెన్సెక్స్1000 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో సెన్సెక్స్ 39 వేలను దాటేసింది.నిఫ్టీ 11550 మార్క్‌ను, నిఫ్టీ బ్యాంకు కూడా 30 వేల మార్క్‌ను అధిగమించడం విశేషం. దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఆటో ఇన్ఫ్రా సెక్టార్లు భారీగా లాభపడుతున్నాయి. అలాగే హోటళ్లపై జీఎస్టీ తగ్గింపుతో హోటల్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మ, ఐటీ సెక్టార్లు నష్టపోతున్నాయి. ఎల్ అండ్ టీ, ఐటీసీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, మారుతి సుజుకి టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. డా.రెడ్డీస్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్,వి ప్రో, టీసీఎస్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. డాలరు పోలిస్తే 70.99 వద్ద కొనసాగుతోంది. -
దలాల్ స్ట్రీట్‌కు సీతారామన్ దన్ను
సాక్షి, ముంబై : దలాల్ స్ట్రీట్ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోతుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతి భారీ లాభాలు లాంటి రికార్డులు ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగియగా, నిఫ్టీ 650 పాయింట్లకు పైన లాభపడింది. దీంతో కీలక సూచీలు కీలక మద్దతు స్థాయిలకు ఎగువకు చేరాయి, ఆఖరి అర్ధగంటలో లాభాల స్వీకరణతో చివరికి సెన్సెక్స్ 1921 పాయింట్ల లాభంతో 38,014 వద్ద, నిఫ్టీ సైతం 569 పాయింట్లు జంప్‌చేసి 11,274 వద్ద స్థిరపడింది. బ్యాంకు నిఫ్టీ కూడా 7 శాతం రికార్డు లాభాలను సాధించింది. దాదాపు అన్ని రంగాలు లాభాల దూకుడు ప్రదర్శించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, క్యాపిట్, కన్సూమర్ గూడ్స్ రంగాలు 10-6 శాతం దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, హీరో మోటో, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్, బ్రిటానియా, టైటన్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్ప్రైజెస్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా స్వల్పంగా నష్టపోయాయి. దీంతో చరిత్రలో తొలిసారి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కేపిట లైజేషన్ రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి మార్కెట్ విలువ రూ. 1.45 ట్రిలియన్లను అధిగమించడం విశేషం. -
లాభాల జోరు, ట్రిపుల్ సెంచరీ
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో . ప్రస్తుతం సెన్సెక్స్ ఏకంగా 344 పాయింట్లు జంప్ చేసి 36,991 వద్ద, 37,000 పాయింట్ల మార్క్‌కు అతిసమీపంలోకి వచ్చింది. అలాగే నిఫ్టీ 101పాయింట్లు ఎగసి 10,944 వద్ద ట్రేడవుతోంది. ప్రయివేట్ రంగ పేరోల్స్‌లో వృద్ధి, వాణిజ్య వివాదాలకు అక్టోబర్‌లో చైనాతో అత్యున్నత సమావేశం తదితర సానుకూల అంశాల నేపథ్యంలో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఆటో, మీడియా పుంజుకెగా, రియల్టీ సెక్టార్‌నష్టపోతోంది. టెక్ మహీంద్రా, యాక్సిస్, ఎన్టీపీసీ, మారుతీ, ఆర్ఐఎల్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ భారీగా లాభపడుతుండగా, ఐబీ హౌసింగ్, సన్ ఫార్మా, విప్రో, యస్ బ్యాంక్, టీసీఎస్, బీపీసీఎల్, గెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. -
దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఎనలిస్టుల అంచనాలకనుగుణంగానే సోమవారం లాభాలతో ఆరంభమయ్యాయి. అయితే ఆరంభలాభాలనుంచి మిడ్‌సెషన్‌లో వెనక్కి తగ్గినప్పటికీ ఆ తరువాత ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. చివరి దాకా లాభాల జోరు కొనసాగింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ లాభాలు ఊతమిచ్చాయి. చివరికి సెన్సెక్స్793 (37494) నిఫ్టీ 229 (11057 పాయింట్లు జంప్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు ఎగిసింది. గత మూడు నెలల కాలంలో ఇంత భారీగా లాభపడటం ఇదే మొదటి సారి. దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. యస్‌బ్యాంకు, అదానీ పోర్ట్స్,హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండియా బుల్స్, ఐసీఐసీఐ బ్యాంకు, జీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, హీరో మోటో, టాటా స్టీల్, వేదాంతా, హిందాల్కో, భారతి ఇన్ఫ్రా టెల్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, సిప్లా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రిలయన్స్ కూడా స్పష్టంగా నష్టపోయింది. కాగా వివిధ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన స్టాక్‌మార్కెట్లు జోష్‌లో ఉంటాయని ఆర్థిక నిపుణు అంచనాలకు తగినట్లుగానే మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులపై సర్ఛార్జీని, అలాగే, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పైన పన్నును ఉపసంహరించుకోవడం మార్కెట్లకు ఉత్తేజం తెచ్చింది. అలాగే, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు రూపాయి మాత్రం డాలరు మారకంలో బలహీనంగా ఉంది. మరోవైపు పసిడి రికార్డు స్థాయికి చేరాయి. వెండి ధర ఇదే బాటలో ఉంది. -
స్టాక్ మార్కెట్ల జోరు : ట్రిపుల్ సెంచరీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో హుషారుగా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే డబుల సెంచరీ కొట్టింది. ప్రస్తుతం 304 పాయింట్లు లాభపడి 39351 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు ఎగిసి 11785 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, కెనరా బ్యాంకు, పీఎన్బీ,బీవోబీ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఇక జెట్ ఎయిర్వేస్ (ఫ్యూచర్స్) పతనానికి అడ్డే లేదు. -
లాభాల ఓపెనింగ్ : మెటల్ రీబౌండ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి.అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 170 పాయింట్లు జంప్ చేసి 38,715 వద్ద , నిప్టీ 49 పాయింట్లుఎగిసి 11618 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్నిసెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా మెటల్, ఐటీ షేర్లు లాభాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా లాభపడుతోంది. వేదాంతా, హిందాల్కో, నాల్కో, సెయిల్ తదితర మెటల్ షేర్లు బాగా లాభపడుతున్నాయి. ఐడియా షేర్ భారీగా లాభపడుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ బలహీనంగా ఉంది. అటు డాలరు మారకంలో రుపీ తిరిగి ఫామ్‌లోకివచ్చింది. డాలరు మారకంలో 19 పైసలు ఎగిసి 69.15వద్ద కొనసాగుతోంది. గురువారం 42 పైసలు పతనమై 69.30వద్ద రూపాయి ముగిసిన సంగతి తెలిసిందే. -
మంచి ‘వాతావరణం’ భారీ లాభాల ముగింపు
సాక్షి, ముంబై: రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్‌మార్కట్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే డబుల్ సెంచరీతో అదరగొట్టిన సెన్సెక్స్ చివరివరకు అదే జోరును కంటిన్యూ చేసింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి వారాంతంలో సెన్సెక్స్ 391పాయింట్ల లాభంతో 37556 వద్ద, నిఫ్టీ116 పాయింట్లు ఎగిసి 11360 వద్ద ఉత్సాహంగా ముగిసింది. అన్ని రంగాలూ లాభపడగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రియల్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. మంచివాతావరణ అంచనాలు, జీఎస్టీ రేట్ కట్, బలమైన త్రైమాసికి ఫలితాలు మార్కెట్లకు ఊత మిచ్చినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. ఐబీ హౌసింగ్, యాక్సిస్, వేదాంతా, యస్‌బ్యాంక్, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, గ్రాసిమ్, హీరోమోటో, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, విప్రో, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో ఉందన్న అంచనాలతో భారీగా నష్టపోయింది. -
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సాక్షి, ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం లభించిందన్న వార్తలతో ప్రభుత్వం రంగ బ్యాంకులు భారీగా లాభపడ్డాయి. మిడ్‌సెషన్ నుంచీ జోరందుకున్న కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ బాగా బలపడింది. దీంతో సెన్సెక్స్ 276 పాయింట్లు ఎగిసి 31,568 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 9852 వద్ద ముగిసింది . తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,850 స్థాయిని సైతం అధిగమించింది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ప్రధానంగా నిఫ్టీ బ్యాంక్ 1.27 శాతం ఎగసింది. ఇదే బాటలో మెటల్, ఫార్మా, రియల్టీ కూడా లాభపడ్డాయి. అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వం రంగ బ్యాంకు షేర్లు లాభాల్లో ముగియగా, అదానీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ డాక్టర్ రెడ్డీస్, భారతీ, గెయిల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, డీఎల్ఎఫ్, ఇండియాబుల్స్, డెల్టాకార్ప్, హెచ్‌డీఐఎల్, యూనిటెక్, శోభా, ఒబెరాయ్, ఫీనిక్స్ టాటా మోటార్స్, టాటా స్టీల్ లాభాలు మార్కెట్ మద్దతునిచ్చాయి. టెక్మహాంద్రా, టాటా పవర్, ఇన్ఫ్రాటెల్, ఐషర్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్, జీ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రుపాయి స్వల్పంగా నష్టపోయి రూ.64.12వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. లాభపడి రూ. 29,132 వద్ద ఉంది.