సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఎనలిస్టుల అంచనాలకనుగుణంగానే సోమవారం లాభాలతో ఆరంభమయ్యాయి. అయితే ఆరంభలాభాలనుంచి మిడ్‌సెషన్‌లో వెనక్కి తగ్గినప్పటికీ ఆ తరువాత ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. చివరి దాకా లాభాల జోరు కొనసాగింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ లాభాలు ఊతమిచ్చాయి. చివరికి సెన్సెక్స్793 (37494) నిఫ్టీ 229 (11057 పాయింట్లు జంప్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు ఎగిసింది. గత మూడు నెలల కాలంలో ఇంత భారీగా లాభపడటం ఇదే మొదటి సారి.
దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. యస్‌బ్యాంకు, అదానీ పోర్ట్స్,హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండియా బుల్స్, ఐసీఐసీఐ బ్యాంకు, జీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, హీరో మోటో, టాటా స్టీల్, వేదాంతా, హిందాల్కో, భారతి ఇన్‌ఫ్రా టెల్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, సిప్లా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రిలయన్స్ కూడా స్పష్టంగా నష్టపోయింది.
కాగా వివిధ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన స్టాక్మార్కెట్లు జోష్‌లో ఉంటాయని ఆర్థిక నిపుణు అంచనాలకు తగినట్లుగానే మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులపై సర్‌ఛార్జీని, అలాగే, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పైన పన్నును ఉపసంహరించుకోవడం మార్కెట్లకు ఉత్తేజం తెచ్చింది. అలాగే, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు రూపాయి మాత్రం డాలరు మారకంలో బలహీనంగా ఉంది. మరోవైపు పసిడి రికార్డు స్థాయికి చేరాయి. వెండి ధర ఇదే బాటలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment