దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి
సాక్షి, ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ‍్యంగా కొన్ని ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం లభించిందన్న వార్తలతో ప్రభుత్వం రంగ బ్యాంకులు భారీగా లాభపడ్డాయి. మిడ్‌సెషన్ నుంచీ జోరందుకున్న కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ బాగా బలపడింది. దీంతో సెన్సెక్స్ 276 పాయింట్లు ఎగిసి 31,568 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 9852 వద్ద ముగిసింది . తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,850 స్థాయిని సైతం అధిగమించింది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ప్రధానంగా నిఫ్టీ బ్యాంక్ 1.27 శాతం ఎగసింది. ఇదే బాటలో మెటల్, ఫార్మా, రియల్టీ కూడా లాభపడ్డాయి.
అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్‌ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వం రంగ బ్యాంకు షేర్లు లాభాల్లో ముగియగా, అదానీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ డాక్టర్ రెడ్డీస్, భారతీ, గెయిల్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్, డీఎల్‌ఎఫ్, ఇండియాబుల్స్, డెల్టాకార్ప్, హెచ్‌డీఐఎల్, యూనిటెక్, శోభా, ఒబెరాయ్, ఫీనిక్స్ టాటా మోటార్స్, టాటా స్టీల్ లాభాలు మార్కెట్ మద్దతునిచ్చాయి. టెక్‌మహాంద్రా, టాటా పవర్, ఇన్‌ఫ్రాటెల్, ఐషర్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్, జీ నష్టపోయాయి.
అటు డాలర్ మారకంలో రుపాయి స్వల్పంగా నష్టపోయి రూ.64.12వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి పది గ్రా. లాభపడి రూ. 29,132 వద్ద ఉంది.