తిరువనంతపురం: దేశంలో నైరుతి రుతుపవనాలు రెండ్రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నట్లు భారత దేశ వాతావరణ విభాగం తెలిపింది. అయితే, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
అదే విధంగా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం, మధ్య భారతదేశంలో ఓ మోస్తరు అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలియ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment